దైవపరిపాలనా వార్తలు
ఘనా: ఈ దేశములో మన పనిపైయున్న బహిష్కరణ ఎత్తివేయబడినది. వారి రాజ్యమందిరములు మరలా తెరువబడి, ప్రస్తుత చట్టప్రకారము రిజిస్ట్రేషన్ చేసికొనుటకు అనుమతి మంజూరు చేయబడుట సహోదరులకు గొప్ప సంతోషమును కలుగజేసినది.
లైబీరియా: అంతర్గత యుద్ధము కారణంగా, లైబీరియాలో అనేక నెలలుగా మూసివేయబడియున్న బ్రాంచి, తిరిగి తెరువబడింది. నలుగురు మిషనరీలు బ్రాంచిలో సేవచేయుటకు తిరిగివచ్చారు. సహోదరులు స్వేచ్ఛగా తిరిగి సహవసించుటకు ఎంతో సంతోషిస్తున్నారు.