నీవు తిరిగివెళ్లినప్పుడు సంభాషణను ప్రారంభించుట
1 మనము మొదటిసారి కలిసినప్పుడు ఆసక్తిని చూపినవారితో సంభాషణను ప్రారంభించుటలో ఫలవంతంగా నుండుటకు, మొదటి సందర్భములో మాట్లాడి స్థిరపరచిన విషయముపై నిర్మించుటకు ప్రయత్నించుము. దీని ఉద్దేశ్యమేమనగా గతములో విడిచివెళ్లిన ఆలోచనలు, లేక సాహిత్యముయొక్క విలువను ఆ వ్యక్తి గుణగ్రహించునట్లు చేయుటయే.
2 పునర్దర్శనమునుచేయుటకు సిద్ధపడుటకై సమయమును తీసికొనుము. నీవు ప్రదర్శించు ప్రచురణనుండి ఆసక్తిని రేకెత్తింపజేయు వ్యాఖ్యానములను ఎన్నుకొనుము. ఎంతసమాచారమును తెలియజెప్పాలి, ఎంతసేపు ఉండాలి అను విషయమును నిర్ణయించుటలో వివేకమును ఉపయోగించుము. అసాధారణమైన ఆసక్తిని చూపినప్పుడు తప్ప, ఎక్కువ సందర్భాలలో ఒకటి లేక రెండు అంశాలనుగూర్చి క్లుప్తమైన చర్చ చాలా మంచిది. క్రింది ముఖ్యాంశములను పరిశీలించుము:
3 భూమి మానవుని నిరంతర గృహముగా కాబోతున్నట్లయిన, దానిపై ఎటువంటి భవిష్యత్తు ఆశీర్వాదములు ఉంటాయని మనము ఎదురుచూడవచ్చును? ఈ చర్చ, జీవితము యావత్తు అనే పుస్తకము పేజీలు 161-3లో వివరించబడినట్లు, యెషయా 11:6-9, ప్రకటన 21:2-4 పై ఆధారపడినది.
ఈ విధముగా చెప్తూ సంభాషణను ప్రారంభించవచ్చును:
◼ “నేను పోయినసారి మిమ్ములను దర్శించినప్పుడు, ఈ భూమి చిరకాలము ఉండాలని దేవుడు ఎలా సంకల్పించాడో మనము చర్చించాము. అయితే ఆలోచించమని మీకు ఒక ప్రశ్నవేసి వెళ్లితిని. అదేమనగా: అప్పుడు ఏ పరిస్థితులు ఉండును? అనేది. ఇప్పుడు తిరిగివచ్చి బైబిలు చెప్పు సమాధానమును మీతో చెప్పుటకు నేనెంతో సంతోషిస్తున్నాను.”
4 దేవునిరాజ్యము క్రింద జీవితమును అనుభవించుటకు మనము చేయవలసినది: యోహాను 17:3 మరియు 1 తిమోతి 2:4ను ఉపయోగించుటద్వారా సత్యము పుస్తకము పేజి 11లో వివరించబడినట్లు ఈ అంశమును విపులీకరించవచ్చును. (జీవితము యావత్తు పుస్తకము, పేజి 216)
ప్రారంభించుటకు, నీవు ఇలా చెప్పవచ్చును:
◼ “దుష్టత్వమును అంతముచేయు దేవుని వాగ్దానమునుగూర్చి మీతో సంభాషించుటకు నేను చాలా సంతోషించాను. [ఆ వ్యక్తిని తన సత్యము పుస్తకము తెచ్చుకొనమని అడుగుము.] అయితే మనందరము శ్రద్ధవహించవలసిన ప్రశ్న ఏమనగా, ఈ మార్పునుండి ప్రయోజనము పొందులాగున ఉండుటకు మనము ఏమి చేయవచ్చును? మీ పుస్తకము పేజి 12లో ఎత్తిచూపబడినట్లు, యోహాను 17:3లో యేసు ఏమి చెప్పాడో గమనించండి.”
5 పరదైసు భూమియందు ఏ అవసరతలు తీర్చబడును? కీర్తన 72:16 మరియు 145:16 నే గాని లేక ప్రకటన 21:4 మరియు 22:2, 3నే గాని నీవు ఉపయోగించవచ్చును. సువార్త పుస్తకము 8, 9 పేజీలలో యుక్తమైన వ్యాఖ్యానములు ఇవ్వబడినవి.
నీ ప్రారంభపు మాటలు ఇలా ఉండవచ్చును:
◼ “పోయినసారి నేనిక్కడకు వచ్చినప్పుడు [వచ్చిన రోజును తెల్పుము], పరదైసు భూమిలో మృతులైన మనప్రియులను తన కుమారుని ద్వారా పునరుత్థానముచేయు దేవుని వాగ్దానమునుగూర్చి చూశాము. అప్పుడు అనుభవించగల కొన్ని ఆశీర్వాదము లేమి? మీ పుస్తకము లేఖనానుసారముగా వీటిలో కొన్ని ఏమిటో సూచించుచున్నది.” పైన చెప్పబడిన సూచనలకు తగ్గట్లు, చూపబడిన ఒకటి లేక రెండు లేఖనములను బైబిలునుండి చదివి, సువార్త పుస్తకములోని 8, 9 పేజీలలోని లావు అక్షరములతో వ్రాయబడిన ముఖ్య వాక్యాలను, బహుశా పేరాగ్రాఫ్ 7ను కూడ చదువుము.
6 మనము ప్రకటించు రాజ్యవర్తమానమునందు అనేకులు ఆసక్తిచూపియున్నారు. ఎన్నో గృహాలలో మనము వివిధ రకముల సాహిత్యమును విడిచిపెట్టాము. ఇతర సందర్భాలో మనము తొలుత మాట్లాడిన లేఖన సంబంధమైన సంభాషణయెడల మెప్పును గమనించాము. కావున ఆసక్తిచూపియున్న వారందరిని తిరిగి దర్శించి, వారికి సత్యమును బోధించుటకు ప్రయత్నించుదము.—మత్త. 10:11, 28:19, 20; యోహా. 21:17; ప్రక. 22:17.