మార్చి కొరకు మీ అందింపు ప్రసంగములను సిద్ధపడుము
1 ఈ నెలలో, ఏవేని 192-పేజీల రెండు పాత పుస్తకములను మనము అందిస్తున్నాము. ఈ మంచి ప్రచురణలలో దేనినైనను సువార్తను అనేక విధములుగా అందించుటకు ఉపయోగించవచ్చును. క్రింద సూచించబడిన అందింపు ప్రసంగాలలో ఒకదానినైనను, లేక అన్నిటినైనను నేర్చుకొని ఉపయోగించుటకు ఉపయుక్తమని నీవు నిశ్చయంగా కనుగొందువు.
2 భూమి—మానవుని నిరంతర గృహము: భూమి దాని పర్యావరణ స్థితినిగూర్చి చింతను వ్యక్తముచేయు ప్రజలతో నీవు సంభాషణను ప్రారంభించ నిష్టపడినట్లయిన, ఈ అంశముతో ప్రయత్నించుము: “మానవజాతి గృహముగా భూమి నిరంతరము నిలవనైయున్నది.” ఈ అంశము కుటుంబజీవితము, ప్రకృతిని ప్రేమించువారు మరియు పర్యావరణ విభాగానికి సంబంధించినవారి అవధానమును ఆకట్టుకొనుటకు చాలా సులువైనదిగా ఉండును. దీనికి ఉపయోగించవలసిన లేఖనము ప్రసంగి 1:4. దాని అంశము మరియు లేఖనము సత్యము పుస్తకములో పేజి 132, పేరాగ్రాఫ్లు 13, 14లలో వివరించబడినది.
3 నిన్నునీవు పరిచయము చేసికొనిన తర్వాత, నీవిట్లు చెప్పవచ్చును:
◼ “నేను, మనలో చాలా మందికి అత్యంత శ్రద్ధగల ఒక విషయమునుగూర్చి క్లుప్తంగా చర్చించేందుకు కలుస్తున్నాను. ఈ భూమి మన గృహము. నిస్సంశయముగా మీరుకూడా అది పాడుచేయబడుచున్న స్థితినిగూర్చి చింతను కలిగి ఉంటారు. శాస్త్రజ్ఞులు మరియు పర్యావరణ విభాగమునకు చెందినవారు కలుషితము ఇలాగే కొనసాగితే, భూమి నివాసానికి అయోగ్యంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యకు మీకేదైన పరిష్కారము కనిపిస్తుందా? (ఇష్టపడితే, ఇంటివారు వ్యాఖ్యానించుటకు వ్యవధినిమ్ము.) భూమియొక్క భవిష్యత్తునుగూర్చి బైబిలు ప్రసంగి 1:4లో ఏమి చెప్తుందో క్లుప్తముగా మీకు చూపిస్తాను.” ఆ లేఖనము చదివి, సత్యము పుస్తకములోని 132వ పేజి, 13, 14 పేరాలలోని వ్యాఖ్యానమును చూపుము.
4 దుష్టత్వము తీసివేయబడుతుంది: నేరము, బలత్కారము, యుద్ధములనుగూర్చి చింతను కనపర్చు ప్రజలకు ప్రీతికరంగా యుండునట్లు, మీరు: “దేవుని ప్రేమించువారు జీవితమును, శాంతిని అనుభవించునట్లు దుష్టత్వము తీసివేయబడుతుంది” అను అంశమును సంభాషించుటకు యిష్టపడవచ్చును. కీర్తన 37:9-11 ఈ అంశమును చూపిస్తుంది. సువార్త పుస్తకము 130వ పేజి, 2, 3 పేరాగ్రాఫ్లు విషయములను చక్కదిద్దుటకు దేవునియొక్క సహనము అభ్యాసయుక్తమైన జ్ఞానమైయున్నదని చూపుతున్నవి.
5 మామూలుగా పరిచయము చేసుకున్న తర్వాత, నీవిట్లు చెప్పవచ్చును:
◼ “నేరము మరియు బలత్కారముతో మనము పోరాడకుండ ఉండే సమయము ఎప్పుడైనా వస్తుందని మీరనుకుంటారా? [ఇంటివారు మాట్లాడుటకు అవకాశమివ్వండి.] బైబిలు కీర్తన 37:9-11లో ఇందుకు శాశ్వత పరిష్కారమును చూపుతుంది.” లేఖనమును చదివి సువార్త పుస్తకములో 130వ పేజినందు, ఎన్నుకొనబడిన 2, 3 పేరాగ్రాఫ్లను చదువుము.
6 పునరుత్థాన నిరీక్షణ: ప్రతిఒక్కరు ఏదో ఒక సమయములో ప్రియమైనవారిని మరణములో కోల్పోయియుంటారు గనుక, “పరదైసు పరిస్థితులందు మృతులైన మన ప్రియులను తిరిగి జీవమునకు తెచ్చు రాజ్యపరిపాలన” అను అంశముపై సంభాషణను ప్రారంభించుట, ఓదార్పుకరంగా ఉండగలదు. నీవు యోహాను 5:28, 29నేగాని, లేక లూకా 23:43నేగాని ఉపయోగించి, ఆ అంశము మరియు లేఖనముపై సువార్త పుస్తకము 229వ పేజి, పేరాగ్రాఫ్ 8, మరియు 185వ పేజి, పేరాగ్రాఫ్ 1లోని వ్యాఖ్యానమును చూపించవచ్చును. (జీవితము యావత్తు పుస్తకములో పేజి, 191.).
7 “రీజనింగ్” పుస్తకము 14వ పేజిలోని, మూడవ ఉపోద్ఘాతమును ఉపయోగిస్తూ సంభాషణను ప్రారంభించి ఇలా చెప్పవచ్చును:
◼ “అప్పుడప్పుడు మనలో ఎక్కువమందిమి మరణములో కోల్పోయిన మన ప్రియులనుగూర్చి తలంతుము. అయితే వారిని మనము మరలా చూస్తామని మీరనుకుంటారా? [ఇంటివారు తమ అభిప్రాయమును వ్యక్తపరచుటకు అవకాశమిమ్ము.] మేము మాట్లాడు అనేకమంది దేవుని వాక్యము వాగ్దానముచేసినదానిని, మరియు ఈ ఉత్తరాపేక్ష ఈ భూమిపైనే నెరవేరునని నేర్చుకొనుటకు ఆశ్చర్యపడుతున్నారు. బైబిలు వాగ్దానముచేసినదానిని గమనించండి . . . ” యోహాను 5:28, 29నిగాని లేక లూకా 23:43నుగాని ఉపయోగించి, సువార్త పుస్తకములోని 229వ పేజి, లేక 185వ పేజి పేరాగ్రాఫ్ 1నందలి వ్యాఖ్యానముతో జతపర్చుము.
8 ఈ అందింపులలో ఒకటి లేక అన్నింటిని సిద్ధపడి ఈ నెలలో ఉపయోగించుము. నీవు ఉపయోగించు ఏ ప్రచురణలోనైనను ఎత్తిచూపవలెననుకున్న వ్యాఖ్యానమునేగాని, లేక చూపవలెననుకున్న పటమునేగాని కనుగొనుటకు నీకు కష్టంగా ఉండకూడదు. ఎక్కువగా ఆసక్తి చూపనప్పుడు ఆ అంశమునకు సంబంధించిన కరపత్రమును అందించుము.