కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/92 పేజీ 3
  • యెహోవా క్రియలను ప్రచురపరచుడి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా క్రియలను ప్రచురపరచుడి
  • మన రాజ్య పరిచర్య—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • కావలెను—4,000 మంది సహాయ పయినీర్లు
    మన రాజ్య పరిచర్య—1997
  • క్రొత్త సేవా సంవత్సరంలో ఓ చక్కని లక్ష్యాన్ని పెట్టుకోండి
    మన రాజ్య పరిచర్య—2007
  • యెహోవా గుణాతిశయములను ప్రచురం చేయండి
    మన రాజ్య పరిచర్య—2007
  • నీవు సహాయ పయినీరుగా చేయగలవా?
    మన రాజ్య పరిచర్య—1992
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1992
km 4/92 పేజీ 3

యెహోవా క్రియలను ప్రచురపరచుడి

1 “జనములలో ఆయన క్రియలను ప్రచురముచేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. . . . ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను.” (యెష. 12:4, 5) ఈ ఉద్బోధకు మీరెలా ప్రత్యుత్తరమిత్తురు? ఒక ప్రజగా లేక ఆయా వ్యక్తులుగా యెహోవా మనయెడల చేసిన క్రియలను తలంచినట్లయిన, వాటిని ఇతరులకు చెప్పుటకు మన హృదయములు కదలించబడవా? దాదాపు 73 సంవత్సరముల క్రితము యెహోవా తన ప్రజలను బబులోనుసంబంధమైన చెరనుండి విడిపించెను. 1919 నుండి సత్యారాధన స్థిరముగా స్థాపించబడి, ఈనాడు భూమియొక్క సమస్త భాగములకు వ్యాపించినది. యెహోవా వీటిని నెరవేర్చిన ప్రమాణము మన ఊహలకందనిది. ఒకవ్యక్తిగా, దేవుని నడిపింపును, రక్షణను, ఆశీర్వాదమును నీవు ఎంత ప్రగాఢముగా మెచ్చుకొందువు? ఆయన క్రియలను ప్రచురముచేయుటకు, ఆయన నామమును ఘనపరచుటకు నీవు ఇంకా ఎక్కువ చేయగలవా?

2 జ్ఞాపకార్థకూటపు కాలములో దేవునికి మనము నిత్యము కృతజ్ఞత చూపగల దైవికకార్యమును మన మనస్సుకు తెచ్చును. యెహోవాకు మన కృతజ్ఞతను, మన మెప్పును చూపుటకు ఏప్రిల్‌ మాసములో సహాయ పయినీరుగా చేయుట మనకు ప్రత్యేకముగా యుక్తమైన సమయము. అంతేగాక, ప్రాంతీయ కాపరి సందర్శన కాలములో నీవు సహాయ పయినీరుగా చేసినట్లయిన, పరిచర్యలో ఆయనిచ్చు ప్రోత్సాహము మరియు సహాయమునుండి కూడ ప్రయోజనము పొందెదవు.

3 తరచు అనేకమంది ప్రచారకులు గుంపుగా సహాయపయినీర్లుగా సేవచేయుటకు ముందుకు వచ్చినప్పుడు పరిస్థితులు బాగుగా అనుకూలించును. ప్రతిఒక్కరికి కలసిపనిచేయుటకు ఎవరో ఒకరు తోడుండులాగున, మంచి కాలక్రమ పట్టికను వేసికొనవచ్చును. చిన్నపిల్లలున్న సహోదరీలు ఒకరికొకరు సహాయము చేసికొనునట్లు ఏర్పాట్లు చేసికొనవచ్చును. మంచి పథకముద్వారా కోరబడిన 60 గంటలను చేరుకొనుట అంత కష్టమైనదేమికాదని అనేకులు కనుగొన్నారు. కొందరు సహాయపయినీర్లు వారి లౌకికపనికి ముందుగాని లేక తరువాతగాని ఒకటి లేక రెండుగంటలు సాక్ష్యమిచ్చి, వారాంతములలో దీర్ఘకాల సమయమును సేవలో గడుపుదురు.

4 ఒకవేళ, నీవు సహాయపయినీరుగా చేయలేకపోయినను, ప్రాంతీయసేవలో నీ పనిని వృద్ధిచేసికొనవచ్చును. పయినీర్లుగా చేయువారికి రవాణా విషయములో సహాయపడుటద్వారా, లేక వారితో కలసిపనిచేయుటద్వారా వారికి నీవు ప్రోత్సాహకరంగా ఉందువు. యెహోవా నామమును ఆయన క్రియలను ప్రచురముచేయుటకు మనము చేయగలిగిన పనిని మెప్పుగల మనదేవుడు గుర్తించకుండా పోడు.—మలా. 3:16.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి