“నన్ను జ్ఞాపకముచేసికొనుటకై దీనిని చేయుడి”
1 యేసు తన అనుచరులకు ఆయన మరణమును సాంవత్సరికముగా ఆచరించుమని ఆజ్ఞాపించెను. (లూకా 22:19) ఈ ఆచరణ మానవజాతికొరకు యేసు అర్పించిన గొప్పబలిని జ్ఞాపకముచేయునదిగా ఉండును. ఈ సంవత్సరము ఏప్రిల్ 17, శుక్రవారం సూర్యాస్తమయము తరువాత యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తముగా క్రీస్తు మరణ జ్ఞాపకార్థమును ఆచరించెదరు.
2 వ్యక్తిగత సిద్ధపాటు: ఈ ప్రాముఖ్యమైన సందర్భయుక్తమైన ఆచరణకు మనమెట్లు సిద్ధపడగలము? ఇందుకు యేసు యొక్క భూజీవితము ఆయన పరిచర్యపై ప్రార్థనాపూర్వకంగా ధ్యానముంచుట ఒక మార్గము. ఆయన తన పరిపూర్ణ మానవప్రాణమును బలిగా అర్పించుటద్వారా మానవజాతికి విమోచకుడాయెను. (మత్త. 20:28) ఈ ఏర్పాటును ప్రతిఒక్కరు గుణగ్రహించునట్లు ది గ్రేటెస్ట్ మ్యాన్ హు ఎవర్ లివ్డ్ అను పుస్తకములో 112 నుండి 116 అధ్యాయములను పరిశీలించుడని మేము సిఫారసుచేస్తున్నాము.
3 యెహోవాసాక్షుల 1992 కేలండరులో గుర్తించబడినట్లు, జ్ఞాపకార్థకూటమునకు ముందు మన బైబిలు పఠనమునకై బైబిలు పుస్తకమైన మార్కునుండి కొన్నిఎన్నికచేయబడిన వచనములున్నవి. ఈ ప్రత్యేక బైబిలు పఠనము ఆరుదినములకు అనగా ఏప్రిల్ 12-17, ఆదివారం నుండి శుక్రవారం వరకు ఏర్పాటుచేయబడినది. ఈ గంభీరమైన సంఘటనలను ధ్యానించుటకు మనమందరము తగినంత సమయము తీసికొందము.
4 పెద్దలద్వారా పూర్ణమైన సిద్ధపాటు: జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానకరపత్రాలు లభ్యమగులాగున జాగ్రత్తపడుము. హాజరుకాబోవు వారందరికి తగినంత కూర్చొను సదుపాయమున్నదా? హాలును ఒకటి కంటె ఎక్కువ సంఘములు ఉపయోగించు సందర్భములలో జ్ఞాపకార్థదినమును ఆచరించుటకు ప్రతిసంఘమునకు తగినంత సమయముండులాగున క్రమమైన ఏర్పాట్లుచేయబడవలెను. ఉపచారకులుగా సేవచేయువారికి వారివారి కర్తవ్యములనుగూర్చి తెలియజేయవలెను. హాజరగు క్రొత్తవారిని ఆహ్వానించుటలో వారు ముందుగా చొరవతీసికొనవలెను. సమాచారమును లేఖనానుసారముగా, స్పష్టముగా అందించగల బాగా అర్హుడైన ప్రసంగీకుని ఎన్నుకొనవలెను. బాధ్యతగల పెద్దలను లేక పరిచారకులను చిహ్నములను అందించుటకు నియమించుము. పులియని రొట్టె, కలుషితముగాని ఎర్రని ద్రాక్షరసమును ఏర్పాటుచేయవలెను. ఇతర అదనపు జ్ఞాపికలకు ది వాచ్‌టవర్ ఫిబ్రవరి 15, 1985, పేజి 19 చూడండి.
5 పూర్ణముగా ముందే సిద్ధపడియుండుట ద్వారా ఈ ప్రత్యేక సందర్భ గుర్తింపును పూర్తిగా గుణగ్రహిస్తున్నామని మనము చూపెదము మరియు యేసు ఆజ్ఞానుసారముగా క్రీస్తు మరణ జ్ఞాపకార్థదినమును ఆచరించుటకు ఇష్టపడుతున్నామని కూడ చూపెదము.
[3వ పేజీలోని బాక్సు]
1. ప్రసంగీకునితో సహా ప్రతి ఒక్కరికి ఆచరణయొక్క సరైన స్థలము, సమయము తెలియపరచబడినదా? ప్రసంగీకునికి రవాణ సౌకర్యమున్నదా?
2. చిహ్నములనందించుటకు ఖచ్ఛితమైన ఏర్పాట్లు చేయబడినవా?
3. బల్లపైపరచుటకు శుభ్రమైన బట్ట, అవసరమైనన్ని గ్లాసులు, ప్లేటులు ఎవరైనా తెచ్చుటకు ఏర్పాట్లుచేయబడినవా?
4. జ్ఞాపకార్థమునకు ముందు హాలును శుభ్రముచేయుటకును, అదే హాలును ఆ సాయంకాలమే మరోసంఘము ఉపయోగిస్తుంటే ఆ తదుపరి స్వల్పముగా శుభ్రముచేయుటకును ఏ యేర్పాట్లు చేయబడినవి?
5. ఉపచారకులు, చిహ్నములనందించువారు నియమించబడ్డారా? వారి కర్తవ్యములను నిర్వహించుటకు ముందుగా వారితో కూటము ఏర్పాటుచేయబడినదా? ఎప్పుడు? ప్రతిఒక్కరికి సమర్ధవంతముగా చిహ్నములు అందించబడునట్లు ఏ పద్ధతిని అవలంభిస్తారు?
6. వృద్ధులు, వికలాంగులైన సహోదరసహోదరీలకు సహాయముచేయుటకు ఏర్పాట్లు పూర్తిచేయబడినవా? నిర్బంధియై, రాజ్యమందిరములోకి రాలేని అభిషక్తులెవరైనావుంటే, వారికి చిహ్నములనందించు ఏర్పాట్లు చేయబడినవా?