పయినీరు సేవ—ప్రేమను వ్యక్తపరచునది
1 యెహోవా యెడల మన పొరుగువారియెడల మనకుగల ప్రేమ ప్రకటించు పనిలో మనం ఎక్కువగా పాల్గొనుటకు మనలను కదిలిస్తుంది. యెహోవాయెడలను ప్రజలయెడలను మన ప్రేమ పెరిగేకొలది పరిచర్యలో మనము ఇంకా ఎక్కువగా పాల్గొనుటకు మనము పథకము వేసికొనుటకు పురికొల్పబడతాము. దేవుని వాక్య “అనుభవజ్ఞాన”మందు మనము వృద్ధి అయ్యేకొలది మనప్రేమ విస్తరించును. (ఫిలి. 1:9, 10) యెహోవాచిత్తమునుగూర్చి ఎక్కువగా తెలిసికొనే కొలది మనము జీవించే కాలముల అత్యవసరతను మనము ఇంకా ఎక్కువ గుణగ్రహిస్తాము. ఇది యితరులయెడల గల మన శ్రద్ధను తీవ్రతరం చేస్తుంది. అనేకులు పయినీరు సేవలను చేపట్టుటద్వారా తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.
2 సహాయపయినీరుగా లేక క్రమపయినీరుగా తయారుగుటకు అవసరమైన సర్దుబాటులను మీరు చేసికొనగలరా? నిజమే, మనలో అందరము పయినీరు సేవ చేయుట వీలు కాదు. అయితే మనలో ప్రతి ఒక్కరము మన పరిస్థితులను ప్రార్థనపూర్వకంగా విశ్లేషించుకోవాలి.
3 ఎక్కువమంది క్రైస్తవులు పయినీరు సేవచేయుటకు స్వేచ్ఛగా సమయమును పొందలేకపోతున్నందున, ప్రస్తుతము మన సమయమును కోరు అనవసరమైన విషయములనుండి ‘సమయమును (కొనవలసిన NW) సద్వినియోగము చేసికొనవలసిన అవసరముంది. (ఎఫె. 5:15-17) దేవునియెడల మరియు ప్రజలయెడలగల మన ప్రేమ, దానిని అధికంగా వ్యక్తముచేయుటకై మన వ్యక్తిగతకోరికలను లేక సౌకర్యములను త్యాగముచేసికొనుటకు ఇష్టపడునట్లు చేయవలెను. (మార్కు 12:33) మనము సంపాదించేవి, లేక సాధారణమైనవేనని భావించేవి, ప్రపంచములో వేరొక ప్రాంతమందు విలాసమైనవిగా ఎంచబడవచ్చును.
4 దైవ-దృష్టి సంబంధమైన ఈ పద్ధతిలో ఆలోచించునట్లు తమపిల్లలకు సహాయపడేందుకు తల్లిదండ్రులు ఏమిచేయవచ్చును? తల్లిదండ్రులు తమపిల్లలకు పిన్నవయస్సునుండే దైవపరిపాలనా సంబంధమైన లక్ష్యాలను ముందు పెట్టాలి. పాఠశాలనుండి వారు పట్టా పుచ్చుకొనుసమయము వచ్చినప్పుడు వారు లౌకిక సంబంధమైన లక్ష్యాలనా లేక ఆత్మీయమైన వాటిని తలస్తున్నారా? పిన్నవయస్సులోనే పయినీరు సేవలో ప్రవేశించుటద్వారా వచ్చు శాశ్వత ప్రయోజనములను చూడగలుగునట్లు వారికి సహాయపడవలెను. ఇదే పరలోకమందు ధనమును సమకూర్చుకొనుట. (మత్త. 6:19-21) అది దేవుని సంతోషపెట్టి, ఆయనయెడల మనకుగల భక్తి మరియు నమ్మకత్వమునకు నిదర్శనముగా ఉండును. అది ఇతరుల ప్రాణమును కూడా రక్షించును.
5 ‘మనుష్యులందరు రక్షణపొందవలెనని’ దేవునిచిత్తము. (1 తిమో. 2:4) అయితే మన ఇష్టము కూడా అదేనని మనము చూపగలమా? రాజ్యాసక్తులను మొదట పెట్టినట్లయిన మనమును ఆలాగే చూపగలము. జీవితమునకు అవసరమైనవాటిని యెహోవా ఇస్తాడను నమ్మకమును కలిగియుండుట ద్వారా మనము కూడ అలా చేయగలము. (మత్త. 6:31-33) ఆర్థిక పరిస్థితులు విషమంగా క్షీణించినను, మనలను పోషిస్తాడనే యెహోవా వాగ్దానము ఎన్నటికి మారదు.—కీర్త. 37:25.
6 మన పరిస్థితులు అనుమతించినంతవరకు ప్రాంతీయపరిచర్యలో పాల్గొనుటకు ప్రయాసపడుట ప్రేమను వ్యక్తపరచు మార్గము. కొందరికి ఇది క్రమపయినీర్లగుట కావచ్చు. సెప్టెంబరు 1, 1992 నుండి అలా ప్రారంభించుటకు మీరు చేయదగిన దానినంతా ఎందుకు చేయకూడదు?