ప్రశ్నాభాగము
◼ లిటరేచర్ మరియు మ్యాగజైన్ డిపార్టుమెంట్లను నిర్వహిస్తున్న పరిచారకుల పనిని సేవాధ్యక్షుడు ఎలా పర్యవేక్షించగలడు?
నెలనెల పుస్తక పఠన గుంపులను సందర్శించుట ప్రాంతీయసేవ కొరకైన కూటములను ఏర్పాటుచేయుటకే సేవాధ్యక్షుని ఆసక్తి పరిమితము కాదు. సంఘమునకు నియమించబడిన ప్రాంతములో సేవాభివృద్ధికి దోహదపడు ప్రతిదాని విషయములోను ఈ ఆసక్తిపరుడైన పెద్ద అత్యంత శ్రద్ధచూపును.
ప్రతినెల తగినన్ని సాహిత్యములు, పత్రికలు అందుబాటులో ఉండునట్లును అవన్ని మంచి స్థితిలో ఉండునట్లును ఆయన చూస్తాడు. అందుకొరకు లిటరేచర్ మరియు మ్యాగజైన్ డిపార్టుమెంట్లను నిర్వహిస్తున్న పరిచారకులకున్న అనేక బాధ్యతలను ఆయన పర్యవేక్షిస్తాడు.
సాహిత్య అందింపు ప్రకటనలు మన రాజ్య పరిచర్యలో వచ్చునప్పుడు సేవాధ్యక్షుడు వాటికి విశేష అవధానమిచ్చును. ఉపయోగార్థము తగినంత పరిమాణములో సాహిత్యములు అందుబాటులో ఉండునట్లు ఆయన, లిటరేచర్ను చూస్తున్న సహోదరుడు కలిసి సన్నిహితంగా కృషిచేస్తారు. అయితే ఎక్కువగా ఆర్డరు చేయకుండా వారు జాగ్రత్తపడాలి. ఒక సాహిత్యము మొదటసారిగా ప్రాంతీయ సేవలో వాడవలసివస్తే లేదా త్వరలో అది సంఘములో పఠించ బడుననుకుంటే సొసైటికి ఆర్డరు పంపేటప్పుడు, ఈ వాస్తవాలన్నింటిని పరిగణలోనికి తీసుకోవాలి. ఆ సాహిత్యము అంతకుముందు అందించబడియుంటే, గతములో ప్రత్యేక అందింపు చేసిన వాటి సంఘ ప్రాంతీయ సేవా రిపోర్టుచూస్తే మన వద్దనున్న సాహిత్యములు సరిపోవునో లేదో తేలిపోతుంది. అయితే గతములో ఆ సాహిత్యము అందించినప్పటినుండి ఆ నెల కొరకు ఆక్జిలరీ పయినీర్లుగా సేవచేయబోవు ప్రచారకుల సంఖ్య ఎంత, ప్రచారకులు, రెగ్యులర్ పయినీర్ల సంఖ్య ఎంత పెరిగింది అనువాటిని కూడా పరిగణలోనికి తీసికోవాలి. సంఘకూటములకు ముందు ఆ తరువాత కూడా సాహిత్యములు లభ్యమయ్యేటట్లు చూడాలి. సాహిత్యములున్న పెట్టెలను, శుభ్రమైన, పొడిగానున్న స్థలములో పాడైపోకుండా ఉండేటట్లు సరియైన విధంగా నిలువచేయాలి.
మాగజైన్ డిపార్టుమెంట్‌ను చూచే సహోదరునితో కూడా సేవాధ్యక్షుడు సహకరించును. ప్రతినెలకొరకు ఆర్డరు చేయబడిన పత్రికలను, పరిచర్యలో అసలు ఎన్ని పత్రికలు అందించబడుచున్నవో అనుదానితో సేవాధ్యక్షుడు, పత్రికలను చూస్తున్న సహోదరుడు అప్పుడప్పుడు పోల్చిచూస్తుండవలెను. ఒకవేళ అవి తమ గృహములలో క్రమేపి పేరుకుపోవుచున్న యెడల కొంతమంది ప్రచారకులు తమ పత్రికల ఆర్డరును తగ్గించవలసి వుంటుంది. పత్రికలను వృధా చేయకూడదు.
అవే సూత్రములను మనస్సునందుంచుకొని, లిటరేచర్ ఆర్డరు ఫారమ్ (S-14) నందు సంఘము ఆర్డరు చేయబోవు ప్రత్యేక అందింపు సాహిత్యములు ఎన్ని ఉన్నాయో సేవాధ్యక్షుడు వ్యక్తిగతంగా పరిశీలించవలెను. అటుతరువాత అతడు ఆ ఫారమ్‌ను సంఘ కార్యదర్శికి యిస్తే, ఆయన మిగతా వాటిని జాగ్రత్తగా పరిశీలించి, ముఖ్యంగా కంట్రోల్డ్ స్టాక్ సాహిత్యములకు ఎక్కువ అవధానమిచ్చును.
అయితే, లిటరేచర్ మాగజైన్ డిపార్టుమెంట్లను సరిగా నిర్వహించాలంటే పేపరు మీద చేసే పనికొంత ఉంటుంది. వీటికి నియమించబడిన సహోదరులకు, ఫారమ్‌లను ఉపయోగించుట, రికార్డును నిర్వహించుట, అనువాటిని గూర్చి ఏమైన ప్రశ్నలుంటే ఈ పనిలో వారికి కార్యదర్శి సంతోషంగా తోడ్పడగలడు.