సెప్టెంబరు కొరకు సేవా కూటములు
సెప్టెంబరు 7తో ప్రారంభమగు వారము
పాట 162 (89)
10 నిమి: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. తాజా పత్రికలనుండి మాట్లాడదగు అంశములను చర్చించండి. ఈ వారాంతములో అందరిని ప్రాంతీయ సేవలో పాల్గొనమని ప్రోత్సహించండి.
15 నిమి: “ఆసక్తిని రేకెత్తించు ఉపోద్ఘాతములు” ప్రశ్నా సమాధానముల పరిశీలన. పేరా 5లో సూచించబడిన అంశాలను ప్రదర్శించి చూపుము.
20 నిమి: “ఇంకను అభివృద్ధి చెందుటకు అనుకూలమైన చర్య.” ఇన్సర్ట్‌లోని మొదటి రెండు పేరాలను ప్రసంగముగా అందించుము. శీర్షికలోని మిగతా భాగమును ప్రశ్నా, సమాధానములతో వివరించుము. స్థానికంగా అన్వయించదగిన అంశాలను నొక్కి తెల్పుము. క్లుప్తమైన సంక్షిప్త సారాంశముతో ముగించుము.
పాట 155 (85), ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 14తో ప్రారంభమగు వారము
పాట 133 (68)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. విరాళములు ముట్టినట్లు తెల్పిన అభినందనలు తెలుపుము. స్థానిక సంఘము కొరకు అలాగే సొసైటి ప్రపంచవ్యాప్త పనికొరకు అందించిన ఆర్ధిక మద్దతుకై సంఘమును మెచ్చుకొనుము.
20 నిమి: పునర్దర్శనములపై ఆసక్తిని వృద్ధిచేయుట. సేవాధ్యక్షునిచే చర్చ. ప్రజలతో మాట్లాడి, సాహిత్యమును అందించుటను అనేకులు ఆనందిస్తారు. (om పు. 87-8) మన బాధ్యతలో మనము మాట్లాడువారి హృదయాలలో ఆసక్తిని వృద్ధిచేయటం కూడ ఇమిడివుంది. మొదట్లో సాహిత్యము అందించని చోట, పునర్దర్శనముపై ఆసక్తిని పెంచుటకు ఒక కరపత్రమును ఎలా ఉపయోగించ వచ్చునో ఒక క్లుప్తమైన ప్రదర్శనను అందించుము. కేవలము ఒకటి లేక రెండు అంశాలను ఉన్నత పరచుము. రీజనింగ్ పుస్తకములోని ఇండెక్స్‌ను కూడ ఎలా ఉపయోగించ వచ్చునో చూపేందుకు క్లుప్తమైన ప్రదర్శనను అందించుము. బైబిలుపై ఆసక్తిని పెంచుటకు ఉపయోగించగల పుస్తకములోని క్లుప్తమైన, సూటియైన అంశాలను నొక్కి చూపుము. మరల దర్శించుటకు ఎలా ఏర్పాటు చేసికొనవచ్చునో చూపుము.
15 నిమి: “మహా బబులోను.” రీజనింగ్ పుస్తకములో 49-53 పేజిల చర్చ. ప్రదర్శన: ప్రచారకుడు బైబిలు విద్యార్ధితో తన అభివృద్ధిని గూర్చి చర్చించును. యెహోవాచే పరిశుద్ధముగా, ఆయన సహాయానికి మరియు ఆశీర్వాదానికి యోగ్యునిగా దృష్టించబడు అవసరతను నొక్కితెల్పును. (1 పేతు. 1:15, 16) ఇప్పుడు బబులోనును విడిచి, యెహోవా పరిశుద్ధ సంస్థతో సహవసించు ప్రాముఖ్యతను నొక్కి తెల్పును. ఛైర్మన్ విద్యార్థులను సంస్థవైపు మళ్లించుటకు ప్రచురణలను ఉపయోగించమని మరియు పెద్దలు అందించు సహాయమును ప్రయోజనకరంగా ఉపయోగించుకొనమని సహోదరులను ప్రోత్సహిస్తూ ముగించును.
పాట 129 (66), ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 21తో ప్రారంభమగు వారము
పాట 113 (62)
15 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. “స్వస్థబుద్ధితోను, నీతితోను జీవించుట.” శీర్షిక యొక్క చర్చ. 1993 సేవా సంవత్సరములో జరుగు ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమమునకు హాజరగుటకు ముందుగానే పథకములు వేసికొనుమని సహోదరులను ప్రోత్సహించుము. తెలిసినట్లయిన తారీఖు, స్థలము ప్రకటించుము. ఈ వారాంతమందు ప్రాంతీయ సేవలో పాల్గొనుటకు ప్రోత్సహించుము.
20 నిమి: “పునర్దర్శనములు చేయుటలో ఉన్న సవాలు.” ప్రశ్నా సమాధానములు. 5, 6 పేరాలను పరిశీలించిన తరువాత రెండు ప్రదర్శనలను చూపుము. (1) బైబిలు పఠనమును ప్రారంభించుటకు ఒక కరపత్రమును ఎలా ఉపయోగించ వచ్చునో చూపుము. (2) రీజనింగ్ పుస్తకములో ఒక అంశమును ఎంపిక చేసికొని, పునర్దర్శనములో వేయబడిన ప్రశ్నకు సమాధానమిచ్చుటకు దానినెలా ఉపయోగించ వచ్చునో చూపుము. అభ్యాస కార్యక్రమముల విలువను ఉన్నతపరచుము. ఆసక్తి చూపిన ప్రతిచోటికి తిరిగి వెళ్లుటను ప్రోత్సహించుము.
10 నిమి: ఏప్రిల్ 15, 1992 వాచ్‌టవర్ లోని “మీకు జ్ఞాపకమున్నవా” శీర్షిక చర్చ. ఇంగ్లీషు కాకుండా, ది వాచ్‌టవర్ పక్షపత్రికగా ముద్రించబడుతున్న ఇతర భాషను ఉపయోగించే సంఘములు, జూలై 15, 1992 సంచికలోని “మీకు జ్ఞాపకమున్నవా” శీర్షికను వాడవచ్చును. వాచ్‌టవర్ నెలసరి పత్రికగా వచ్చు భాషా సంఘములు “మీకు జ్ఞాపకమున్నవా” అనే పేరుతో జూన్ 1, 1992 సంచికలో గల శీర్షికను వాడవచ్చును. పత్రికలను చదువుటకు అందరు మంచి కాలక్రమ పట్టికను కలిగి యుండుటకు ప్రోత్సహించుము. ఆచరణాత్మకమైన సలహాలను అందించుము.
పాట 130 (58), ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 28తో ప్రారంభమగు వారము
పాట 72 (39)
5 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: “ఇంటింటి సేవలో సమర్ధవంతముగా పనిచేయుట.” ప్రశ్నా సమాధానముల చర్చ. అక్టోబరు మాసంలో సహాయ పయినీరు సేవ చేయుటను ప్రోత్సహించుము. సహాయ పయినీరు సేవను చేసినవారు సాధారణంగా ఆ తదుపరి నెలలలో ఉన్నత ప్రమాణములో తమ సేవను చేస్తారని పేర్కొనుము.
15 నిమి: క్రియేషన్ పుస్తకమును అందించుము. ప్రదర్శనతో ప్రసంగము. క్రియేషన్ పుస్తకమును అందించునప్పుడు మాట్లాడగల అంశములను, చూపించదగు దృష్టాంతములను చర్చించుము. అన్వయింపదగిన చోట రీజనింగ్ పుస్తకములోని “క్రియేషన్” అను హెడ్డింగ్ క్రింద నున్న అంశములను ఉపయోగించవచ్చును. 16 మరియు 19 అధ్యాయములైన “వై వుడ్ గాడ్ పర్మిట్ సఫరింగ్?” “ఏన్ ఎర్తెలీ ప్యారడైజ్ సూన్ టు కమ్” నందలి సమాచారము ఇంటివారికి ఇంపుగా ఉండవచ్చును. 197 పేజిలోని చిత్రమును, సామెతలు 2:21, 22 ఉపయోగిస్తూ, దేవుడు భూమిని సృష్టించుటలో మొదటి ఉద్దేశము త్వరలో నెరవేరుతుందని ఉన్నతపరచులాగున ఒక అర్హతగల ప్రచారకునిచే అందింపును ప్రదర్శింపుము.
10 నిమి: “పునర్దర్శనములందు నిరంతరము జీవించుము అను పుస్తకమును ఉపయోగించుట” క్లుప్తముగా మొదటి రెండు పేరాలలోని అంశములను చర్చించుము. నేరుగా బైబిలు పఠనమును ప్రారంభించు పునర్దర్శనమును ప్రదర్శించుము.
పాట 126 (25), ముగింపు ప్రార్థన.
అక్టోబరు 5తో ప్రారంభమగు వారము
పాట 30 (91)
5 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: మీరు ఆత్మీయాభివృద్ధిని చేసికొనుచున్నారా? పెద్దచే చర్చ. గత సేవా సంవత్సరంలో సంఘములోని వారు కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలను చేరుకున్నారా? లేనియెడల ఎందుకు? సాధ్యమైన లక్ష్యాలను సూచించుము. ఆత్మీయతను కాపాడుకొనుటకు అభివృద్ధి అవసరము. (ఫిలి. 3:16) కుటుంబ పఠనములో వారు ఎచ్చట అభివృద్ధిని చేసికొనవలెనో నిర్ణయించుకొనుటకు తమ స్వంత పరిచర్యను పునర్విమర్శ చేసుకొనునట్టి ఒక కుటుంబపు క్లుప్త ప్రదర్శన.
10 నిమి: స్థానిక అవసరతలు లేక సంఘ ప్రాంతీయ సేవా కార్యమును గూర్చి పెద్దచే చర్చ.
15 నిమి: మీ పిల్లల హృదయములలో దేవుని తలంపులను ఉంచి పాఠశాలకు పంపండి. పెద్దచే ప్రసంగము. తన పద్ధతిలోనికి మనలను మరల్చుటకు ప్రయత్నించు లోకములో మనము జీవిస్తున్నాము. మన యౌవనుల విషయములో ఇది ప్రత్యేకముగా వాస్తవము. తల్లిదండ్రులు వారి సమస్యలు, అవసరతల విషయంలో ఎంతో జాగ్రత్తగా గమనించు వారైవుండవలెను. (సామె. 20:5) తల్లిదండ్రుల ప్రేమతోపాటు దేవుని చట్టాలను ఆయన ప్రేమను వారిలో నాటండి. ప్రదర్శన: కుటుంబము స్కూల్ బ్రోషూరును ఎట్లు ఉపయోగించ వచ్చునో చర్చించును. ఒక పిల్లవాడు అప్పుడే పాఠశాలకు వెళ్తున్నాడు, మిగతా ఇద్దరు పిల్లలైతే కొన్ని సంవత్సరముల నుండి పాఠశాలకు వెళ్తున్నారు. ప్రతిఒక్కని, పరిస్థితులకు అన్వయించదగిన అంశమును ఎంపిక చేయండి. పిల్లలను తమ స్వంత మాటలలో వారి టీచరుకు ఎలా చెబుతారో తండ్రికి లేక తల్లికి వ్యక్తపరచనివ్వండి. ఇమిడియున్న సూత్రములను పిల్లలు అర్థము చేసికొనునట్లు ఖచ్చితంగా చూడండి. ఈ భాగమును నిర్వహించు సహోదరుడు కుటుంబ బైబిలు పఠనమును ప్రోత్సహించి, పిల్లలతో తల్లిదండ్రులు బహుదగ్గరి, సన్నిహిత సంబంధమును కలిగియుండు అవసరతను నొక్కి తెల్పును.
పాట 109 (119), ముగింపు ప్రార్థన.