కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/92 పేజీ 4
  • ఆసక్తిగలవారియెడల శ్రద్ధ చూపండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆసక్తిగలవారియెడల శ్రద్ధ చూపండి
  • మన రాజ్య పరిచర్య—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • సరళమైన, ప్రభావవంతమైన పునర్దర్శనాలు
    మన రాజ్య పరిచర్య—1994
  • పునర్దర్శనములందు నిరంతరము జీవించుము అను పుస్తకమును ఉపయోగించుట
    మన రాజ్య పరిచర్య—1992
  • గట్టి పునాదిపై కట్టబడుటకు గొర్రెలవంటి ప్రజలకు సహాయం చేయుట
    మన రాజ్య పరిచర్య—1993
  • మెప్పుదలను పెంపొందించడానికి తిరిగి దర్శించుట
    మన రాజ్య పరిచర్య—1994
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1992
km 11/92 పేజీ 4

ఆసక్తిగలవారియెడల శ్రద్ధ చూపండి

1 ప్రజలపట్ల శ్రద్ధచూపుటలో యెహోవా అందరికంటె ఎంతో ఉదారస్వభావము గలవాడు. ఆయన మనకు భౌతిక సంబంధమైన వాటిని సమృద్ధిగా దయచేయుటతోపాటు, మనకు అవసరమగు, మనమానందించగల ఆత్మీయ విషయాలను కూడ అనుగ్రహించాడు. ఆయన మనపై ఎంతో శ్రద్ధగలవాడై, మన హృదయాలలో ఏముందోకూడ పరిశీలించును.—కీర్తన 139:23.

2 యేసు భూమిపై ఉన్నప్పుడు, ఇతరుల యెడల శ్రద్ధచూపుటలో ఆయన తన తండ్రి మాదిరిని పరిపూర్ణంగా అనుసరించాడు. యేసుతో “ప్రభువా, నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవ”నిన మనుష్యుని జ్ఞాపకం చేసికొనుము. అందుకు యేసు “నాకిష్టమే” అని జవాబిచ్చెను. (మత్త. 8:1-3) ఒక విధవరాలు దుఃఖముతో ఉండుటను యేసు చూసినప్పుడు, ఆయన ఏం చేశాడు? ఆమెకు సహాయము చేసేందుకు ఆగాడు. (లూకా 7:11-15) మీరును ఆసక్తిగలవారియెడల శ్రద్ధచూపుటకు ఎక్కువ అప్రమత్తంగా ఉండగలరా?

3 మన తండ్రియైన యెహోవా, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు అనుకరణగా ఇతరులయందు మనము కూడా వ్యక్తిగత శ్రద్ధతీసుకొనవలెను. దీనిని మనము కచ్చితమైన ఇంటింటి సేవారికార్డును భద్రపరచుకొనుటద్వారా చేయగలము. ఇందులో ఆసక్తిగల వ్యక్తి పేరు, సరైన అడ్రసు, అతనితో మొదటి దర్శనమందు చర్చించిన అంశమును వ్రాసుకొనవలెను. ఆ తరువాత, పునర్దర్శనము చేయకముందు బాగుగా సిద్ధపడండి. మునుపటి దర్శనములో పత్రికలను అందించియున్నట్లయిన, ఆ శీర్షికలలోని ఒక ప్రత్యేక విషయమును ఆధారంగా తీసుకొని పునర్దర్శనము చేయవచ్చును. దీనిని ఎలా చేయవచ్చునో గమనించండి:

4 నవంబరు 1, 1992 కావలికోటను మీరు అందించియుండి, పేజి 6 లోని “నిత్యజీమునకై దేవుడిచ్చు ఆహ్వానము” అనే శీర్షికవైపు దృష్టిమళ్లిస్తే, మీ పునర్దర్శనములో ప్రకటన 21:4, యోహాను 17:3 లను ఉన్నతంగా చూపుటకు మీరు సిద్ధపడవచ్చును.

ఉదాహరణకు, ప్రకటన 21:4 చదివిన తరువాత, మీరిలా అడగవచ్చును:

◼ “మనము నిత్యజీవమును ఎలా సంపాదించుకొనగలము? [జవాబు చెప్పనివ్వండి.] 7వ పేజీలో చిత్రీకరించబడినలాంటి లోకములో జీవమును పొందాలంటే యేసు ఏమిచెయ్యాలని చెప్పాడో వినండి.” తదుపరి, సమాధానకరమైన నూతనలోకములో నిత్యజీవము పొందాలంటే దేవునిగూర్చి మరియు యేసుక్రీస్తునుగూర్చిన జ్ఞానము పొందాలని ఉన్నతపరుస్తూ, యోహాను 17:3 చదవండి. ఆసక్తి కనిపించినట్లయిన, లైఫ్‌ ఇన్‌ ఎ పీస్‌ఫుల్‌ న్యూ వరల్డ్‌ కరపత్రిక నుండి పఠనమును ప్రారంభించుటకు ప్రయత్నించండి.

5 “ప్రపంచ జనాబా—భవిష్యత్‌ సంగతేమిటి?” అనే నవంబరు 8, అవేక్‌! లోనుండి ఎంపికచేయబడిన అంశమును చర్చించుటద్వారా మీరు మంచి ప్రత్యుత్తరమును పొందవచ్చు. మీరు పునర్దర్శనము చేయునప్పుడు మీ చర్చను కీర్తన 72:12, 16 ను ఆధారంగా తీసుకొని చేయవచ్చును.

మీరిలా అడుగవచ్చును:

◼ “ఈనాటి ప్రపంచములో స్పష్టంగా కనపడే ఆహార కొరతకు పరిష్కారమేమని మీరు నమ్ముతారు?” జవాబును అంగీకరించి, ఇలా చెప్పండి: ఆసక్తిదాయకంగా “సమీప భవిష్యత్తులో లోకంలోనుండి ఈ సమస్యను తీసివేస్తానని యెహోవా వాగ్దానముచేసియున్నాడు. [కీర్తన 72:12, 16 చదవండి] ఆహార ఉత్పత్తులు, మానవ వ్యవహారములన్నీ సక్రమంగా నిర్వహించబడి, ఆహార కొరత మరియు ఈనాడు పెరుగుతున్న ధరలవలన ఎవరును బాధనొందని ఒక కాలమును బైబిలు సూచించుచున్నది.” తదుపరి లైఫ్‌ ఇన్‌ ఎ ఫీస్‌ఫుల్‌ న్యూవరల్డ్‌ కరపత్రమును పరిశీలించుటద్వారా ఇతర భవిష్యత్‌ ఆశీర్వాదములను ఉన్నతపరచుము. తదుపరి పఠనములోనికి నడుపుము.

6 అప్పటికే ఇంటివారు మన ప్రచురణలలో ఒకదాన్ని కలిగియుంటే సంగతేమి? దానినే పఠనము ప్రారంభించుటకు ఎందుకు ఉపయోగించకూడదు? అది నిరంతరము జీవించగలరు పుస్తకమైతే విషయ సూచికవైపుకు పుస్తకమును త్రిప్పమని ఇంటివారినడిగి, తాను చర్చించాలని యిష్టపడే అంశాన్ని ఎంపికచేయమని అడగండి. తదుపరి, ఒకటి లేక రెండు పేరాలను పరిశీలించుటద్వారా మీరు పఠనమును ప్రారంభించవచ్చును.

7 బాగుగా సిద్ధపడి, సమర్ధవంతముగా పునర్దర్శనములను చేయుటద్వారా ఆసక్తిగలవారియెడల శ్రద్ధచూపటం, మనము దేవుని మరియు క్రీస్తును పోలి నడుచుకొనుచున్నామనియు, సాధ్యమైనంత ఎక్కువమంది రక్షింపబడాలని కోరుతున్నామనియు ప్రదర్శించును.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి