పునర్దర్శనములందు నిరంతరము జీవించుము అను పుస్తకమును ఉపయోగించుట
1 సత్యము పట్ల ఆసక్తి చూపిన వారియెడల శ్రద్ధ తీసికొనుటలో పట్టుదల చూపవలసిన ప్రాముఖ్యతను అపొస్తలుడైన పౌలు ఎరిగియుండెను. ఆయన వారిని క్రమముగా నీరు మరియు సేద్యము అవసరమైన మృదువైన మొక్కలకు పోల్చెను. (1 కొరిం. 3:6-9) అలాగే ఈనాడు ఆసక్తిగల వారిని ఆత్మీయముగా పెంచుటకు మనము పునర్దర్శనములు చేయునప్పుడు వారికి మన మృదువైన శ్రద్ధ అవసరము.
2 మనము మాట్లాడే వ్యక్తులకు తరచు మనము గత చర్చలోని అంశములను తిరిగి జ్ఞాపకముచేయుట అవసరము. కావున పునర్దర్శనముచేసే ప్రతిసారి, ముందు కలిసినప్పుడు మీరు ఏమి మాట్లాడారో వాటిని, ప్రత్యేకంగా ఇంటివారు మెచ్చుకొనిన అంశాలను క్లుప్తముగా పునఃసమీక్షించుట కోరదగినది. ఇంటివారిని చర్చలో చేర్చి, వారి ఆసక్తిని, అవసరతలను వెంటనే పసిగట్టుము.
3 పునర్దర్శనము చేయునప్పుడు, “నిరంతరము జీవించుము” అను పుస్తకమును వారు తీసుకున్నను లేక తీసుకొనకపోయినను మీరు నేరుగా పఠనమును ప్రారంభించే ఈ పద్ధతిని ఉపయోగించవచ్చును:
◼ “మేము మాట్లాడుచున్న అనేకమంది ప్రజలు తాము అడిగే బైబిలు ప్రశ్నలకు ఈ పుస్తకముద్వారా సమాధానములు పొందారు.” తదుపరి నిరంతరము జీవించుము పుస్తకములోని విషయసూచికకు త్రిప్పి మీరిలా అడుగవచ్చును: “ఇచ్చట ఏ అంశము మీకు ఎక్కువ ఆసక్తిదాయకంగా ఉంది?” ఆపై, తాను ఆసక్తిని కనపరచిన అధ్యాయమువైపు త్రిప్పి వరుసగా సంఖ్య వేయబడిన పేరాలు, అలాగే ప్రతి పేరా నుండి ఎక్కువ ప్రాధాన్యమైన విషయములను గ్రహించుటకు ప్రతి పేజి క్రింద ఉన్న ప్రశ్నలు ఎలా సహకరించునో చూపించుము. కేవలము కొన్ని అంశాలను చర్చించి మరల తిరిగి దర్శించటానికి కచ్చితమైన ఏర్పాట్లుచేయుము.
4 మరొక రీతిగా సమీపించుట ఎట్లంటే:
◼ “గతవారం మన చర్చవలన నాకు చాలా ఆనందం కలిగింది. అనేకమంది ప్రజలు మేము వారి ఇండ్లను ఎందుకు దర్శిస్తూ ఉంటామని శ్రద్ధ చూపుతున్నారు. మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అను ఈ పుస్తకము 29 వ పేజిలో చేయబడిన వ్యాఖ్యానము మీకు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుందని నేననుకుంటున్నాను. [పేరా 11 చదవండి.] మనము ఇక్కడ చదివిన దానిని బట్టి, మన ఆరాధన దేవునికి అంగీకృతము కావాలంటే మననుండి ఏమి అవసరమని మీరనుకుంటారు? [జవాబు చెప్పనిచ్చి, ఇంటివారిని మెచ్చుకొనుము.] యేసు కాలములో కూడ తమ మతము దేవునికి అంగీకృతమైనదని తలంచిన వారు కలరు. వారిని గూర్చి ఈ అధ్యాయములోని రెండవ పేరాలో ఏమి చెప్పబడిందో చూడండి.” చదివి ఆ వాక్యాలపై వ్యాఖ్యానించుము.
5 ముందటి సందర్శనములో “నిరంతరము జీవించుము” పుస్తకమును అందించిన చోటికి తిరిగి వెళ్లునప్పుడు:
◼ “గతసారి నేను సందర్శించినప్పుడు, మారవలసిన లోకపరిస్థితులను గూర్చి మనము చర్చించాము. దేవుడు దుష్టత్వమును ఎందుకు అనుమతిస్తున్నాడు అని మీరెప్పుడైనా ఆలోచించారా? జవాబు చెప్పనిచ్చి, పఠన ప్రశ్నలను సూచిస్తూ, 99వ పేజి, పేరా 2కు త్రిప్పండి. లేఖనములను పరిశీలిస్తూ, ఈ పేరాను చదివి చర్చించండి. ఉదాహరణకు, 78, 84-5, 119, 147, 149-53, 156-8 పుటలలో నుండి ఎంపిక చేసుకొనిన కొన్ని దృష్టాంతముల వైపు త్రిప్పుతూ మీ చర్చను ఎక్కువగా బలపరచ వచ్చును.
6 ఒక కరపత్రమును అందించిన చోట: కొన్నిసార్లు మొదట దర్శించిన చోట ఒక కరపత్రమును విడిచివస్తాము. పునర్దర్శనములు చేసేటప్పుడు, అందులో చూపబడిన లేఖనములతో సహా, ఒకటి లేక రెండు పేరాలను మీరు చర్చించవచ్చును. ఆ తర్వాత అక్కడ చూపబడిన లేఖనములలో ఒకటి ఎంతో విశదంగా నిరంతరము జీవించుము పుస్తకములో ఎలా చర్చించబడిందో చూపుము. ఆ వ్యక్తి ఆసక్తిని చూపినట్లయిన, మీరు నిరంతరము జీవించుము పుస్తకాన్ని అందించి, మీ తదుపరి దర్శనములో మరలా చర్చను కొనసాగించుటకు ఏర్పాట్లు చేయుము.
7 మనకు అప్పగింపబడిన క్రైస్తవ విశ్వాసమందలి మృదువైన మొక్కలకు నీరుపోయుటలో నమ్మకముగా శ్రద్ధవహించే కొలది, దేవుడు తన స్వంత ఘనత మరియు స్తుతి నిమిత్తమై దానిని వృద్ధిచేయును.—1 కొరిం. 3:7.