జనవరిలో సహాయ పయినీర్గా సేవచేయుము
1 మనమందరం ఇలా ప్రశ్నించుకోవడం ఉత్తమం: ‘జనవరిలో నేనెంత మేరకు వెలుగు ప్రకాశకునిగా ఉంటాను? నేనొక సహాయ పయినీర్గా సేవచేయగలనా?’—మత్తయి 5:14, 16.
2 బాప్తిస్మము పొందిన యౌవనులకు పాఠశాలలో ఎక్కువగా సెలవులు దొరికే అవకాశం ఉండవచ్చు. ఆ నెలలో వీరితోపాటు కొంతమంది తలిదండ్రులు, పెద్దవారైన ఇతర ప్రచారకులు విస్తృతపరచబడిన ప్రాంతీయ సేవలో పాల్గొనవచ్చును. పూర్తికాల ఉద్యోగంచేసే అనేకమంది కూడా ఈ రక్షణదాయకమగు పరిచర్య నిమిత్తం వినియోగించగలుగుటకై కొంత అదనపు సమయాన్ని కలిగియుండవచ్చును.
3 సహాయ పయినీర్గా సేవచేయగల్గుటలోగల కీలకమేమంటే అవసరమైన అదనపు ప్రయత్నం చేయడానికి మనంచూపే ఇష్టతే. (లూకా 13:24) కుటుంబ, సంఘ విషయాలతోపాటు మన కార్యాలను మనం జాగ్రత్తగా వ్యవస్థీకరించుకుంటే, సహాయ పయినీర్గా సేవచేయుటలోని ఆనందాన్ని అనుభవించులాగున మనకు సమయం లభించేటట్లు చేసుకోగలం.
4 జనవరిలో మీ పరిచర్యను మీరు విస్తరింపజేయగలరా? అలాచేయడం ఇండ్లయొద్ద మరింత నమ్మకంగా మీరున్నట్లు భావించుటకు సహాయం చేస్తుంది, తత్ఫలితంగా క్షేమాభివృద్ధికరమైన అనుభవాలు కలుగుతాయి. ఆ విధంగా మీరు గొప్ప ఆనందాన్ని అనుభవించగలరు.—అపొ. 20:35.