డిశంబరు కొరకు సేవా కూటములు
డిశంబరు 7తో ప్రారంభమగు వారము
పాట 49 (23)
10 నిమి: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి ఎంపికచేయబడిన ప్రకటనలు. రాజ్య-ప్రచారపు పనిలో ప్రచారకులు కలిగియున్న భాగం విషయమై వారిని మెచ్చుకొనుము. స్థానిక ప్రాంతమందు ఉపయోగించుటకై ప్రస్తుత పత్రికలనుండి మాట్లాడదగు అంశాలను సూచించుము.
15 నిమి: “దేవుని వాక్యపు శక్తి.” ప్రశ్నా-జవాబులు. ఎందుకు నీవు బైబిలును నమ్మగలవు అనే కరపత్రాన్ని అందరూ చదవాలని, ప్రాంతీయ సేవలో ఉపయోగపడు సహేతుకమైన సరళమైన, ధాటిగా వాదించు పద్ధతులను గుర్తుపెట్టుకొమ్మని ప్రోత్సహించుము.
20 నిమి: “మొదటిసారి కలిసినప్పుడే పునాదివేయండి.” ఈ భాగం నిర్వహించే సహోదరుడు 2, 3 పేరాలలో ప్రస్తావించబడిన రెండు ఉపోద్ఘాతాలలో ఒకదానిని ఉదహరిస్తూ 4, 5, 6 పేరాలలోని ప్రతి అంశాన్ని తెలియజేయు నాలుగు ప్రదర్శనలను పరిచయం చేస్తాడు. చివరి ప్రదర్శన మాత్రం నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని ఎలా అందించవచ్చో చూపించాలి.
పాట 52 (59), ముగింపు ప్రార్థన.
డిశంబరు 14తో ప్రారంభమగు వారము
పాట 141 (64)
5 నిమి: స్థానిక ప్రకటనలు మరియు దైవపరిపాలనా వార్తలు.
15 నిమి: “ఉపదేశములను నీవు అనుసరించెదవా?” ఇది ఆంగ్ల సంచికయగు ది వాచ్‌టవర్ అక్టోబరు 1, 1990, పుటలు 30-1పై అధారపడి సంఘాధ్యక్షుడు ఇచ్చే ప్రసంగం. ఈ శీర్షిక ప్రాంతీయ భాషా సంచికయగు కావలికోట నవంబరు 1, 1991 నందున్నది. ప్రత్యేక అవసరాలకు అనగా సేవా సమయాన్ని రిపోర్టుచేయడం, రాజ్యమందిరాన్ని శుభ్రంచేయడం, ప్రాంతీయ సేవ కొరకైన కూటములకు సమయానికి రావడం, రాజ్యమందిరంలో పిల్లలను అదుపులో ఉంచడం వంటి స్థానిక అవసరాలకు అన్వయించుము. అవసరమైనచోట మెచ్చుకొని, ప్రతివారు ఉపదేశములను అనుసరించినట్లయితే సంఘమంతయు ఎలా ప్రయోజనం పొందునో, నియమిత సేవకుల పని ఎలా సులభమగునో అందరు గ్రహించుటకు సహాయం చేయుము.
10 నిమి: “జనవరిలో సహాయ పయినీర్‌గా సేవచేయుము.” ఈ శీర్షికను ప్రశ్నా-జవాబుల ద్వారా స్నేహపూర్వకంగా, ఉత్సాహపూరితంగా నిర్వహించుము. ప్రాంతీయ సేవ కొరకైన స్థానిక ఏర్పాట్లను, జనవరిలో పెద్ద గుంపుల కొరకు చేయబడు ప్రత్యేక ఏర్పాట్లను గూర్చి ప్రకటించుము.
15 నిమి: జన్మదినాల్ని మనమెందుకు ఆచరించము. ఒక పెద్దకు, మంచి మాదిరిగావున్న తండ్రిలేని బాలునికి మధ్యజరిగే చర్చ. జన్మదిన వేడుకకు హాజరు కావలెనని తన సన్నిహితులు తెచ్చే వత్తిడిని ఎదుర్కొనుటకు కావలసిన సహాయం కొరకు ఆ బాలుడు ఆ పెద్దను సమీపించును. అది తప్పిదమని అతనికి తెలుసు అయితే దానిని ఇతరులకు స్పష్టంగా వివరించగల్గాలని అతడు కోరుచున్నాడు. ఆంగ్ల సంచికయగు ది వాచ్‌టవర్ సెప్టెంబరు 1, 1992 పుటలు 30-1 (వాచ్‌టవర్ పక్ష-పత్రికగా వెలువడు ఇతర భాషలలో ఈ శీర్షిక డిశంబరు 1, 1992 నందున్నది) మరియు రీజనింగ్ పుస్తకమందలి 58-70 పుటలలోని సమాచారమును ఆ పెద్ద దయాపూర్వకముగా, సుళువైన భాషలో ఆ బాలునితో పునఃసమీక్షించును.
పాట 27 (7), ముగింపు ప్రార్థన.
డిశంబరు 21తో ప్రారంభమగు వారము
పాట 179 (29)
15 నిమి: అక్కౌంట్సు రిపోర్టు, విరాళములు అందినవని తెల్పిన సమాచారంతోపాటు స్థానిక ప్రకటనలు. స్థానిక సంఘానికి ఆలాగే సొసైటి ప్రపంచవ్యాప్త పనికి సంఘం యిచ్చిన ఆర్థిక మద్దతును ఆప్యాయంగా మెచ్చుకొనుము. సెలవు కాలం కొరకు చేయబడిన ప్రత్యేక ప్రాంతీయ సేవా ఏర్పాట్లనుగూర్చి తగినచోట చొప్పించి తెలియజేయుము. తలిదండ్రులు స్కూల్ బ్రోషూరు 17-21 పుటలను ఉపయోగించి, సెలవుకాలంలో ఉత్పన్నం కాగల వివాదాంశాలను ఎదుర్కొనుటకు ప్రత్యేకంగా పాఠశాల పిల్లలను సిద్ధపరచవలెను.
20 నిమి: “ఆసక్తినెట్లు పెంపొందించాలి.” సేవాధ్యక్షుడు నిర్వహించే ప్రసంగం మరియు ప్రదర్శనలు. 5, 6 పేరాలలో ప్రస్తావించబడిన పద్ధతులను ప్రదర్శించుము. ప్రదర్శనలు సరళంగా, సులభంగా అనుసరించేవిగా ఉండేటట్లు చూడుము.
10 నిమి: “సరియైన మాట్లాడదగు అంశాలను ఎన్నుకొనుము.” ప్రాంతీయ సేవకు సిద్ధపడు భార్యాభర్తల మధ్యజరిగే చర్చ.
పాట 198 (50) ముగింపు ప్రార్థన.
డిశంబరు 28తో ప్రారంభమగు వారము
పాట 54 (71)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ఈ వారాంతమందు ప్రస్తుత పత్రికనుండి మాట్లాడదగు అంశాన్ని ఎట్లు ఉపయోగించవచ్చునో ఒక ప్రదర్శననిమ్ము. పోయిన సేవా కూటములో ఇవ్వబడిన సలహాలను ఉపయోగించుము.
20 నిమి: “మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదును.” నవంబరు 1, 1992 కావలికోట సంచిక, పక్షపత్రికలో పుట 28లోను, మాసపత్రికలో పుట 30లోగల శీర్షికపై ఆధారపడి సంఘపెద్దచేయు ప్రసంగం. ఆంగ్ల సంచికయగు ది వాచ్‌టవర్ నందు ఈ శీర్షిక ఆగష్టు 1, 1992లో కలదు. యెహోవా సంస్థనుండి వేరైపోయి, క్రియాశూన్యులైన వ్యక్తులను తిరిగి ఆహ్వానించుటలో ఆయన కనికరమును, ఇష్టతను నొక్కితెల్పుము. ఒక వ్యక్తి నిజమైన సంతోషాన్ని కనుగొనగల ఒకే ఒక స్థలం యెహోవా సంస్థేనని చూపించుము.
15 నిమి: “మన సాహిత్యాన్ని నీవు విలువైనదిగా ఎంచుదువా?” ప్రోత్సాహకరమైన ప్రసంగం.
పాట 24 (70), ముగింపు ప్రార్థన.