కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/93 పేజీ 2
  • ఫిబ్రవరి కొరకు సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి కొరకు సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఉపశీర్షికలు
  • ఫిబ్రవరి 1తో ప్రారంభమగు వారము
  • ఫిబ్రవరి 8తో ప్రారంభమగు వారము
  • ఫిబ్రవరి 15తో ప్రారంభమగు వారము
  • ఫిబ్రవరి 22తో ప్రారంభమగు వారము
మన రాజ్య పరిచర్య—1993
km 2/93 పేజీ 2

ఫిబ్రవరి కొరకు సేవా కూటములు

ఫిబ్రవరి 1తో ప్రారంభమగు వారము

పాట 171 (59)

10 నిమి: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి సముచిత ప్రకటనలు. తాజా సంచికల ఆధారంగా పత్రికా అందింపు ప్రసంగాన్ని ప్రదర్శించుము.

20 నిమి: “మన సంఘ పుస్తక పఠన నిర్వాహకునితో సహకరించుట.” ప్రశ్నా సమాధానములు.

15 నిమి: “సరళమైన, సమర్థవంతమైన సంభాషణా ప్రసంగాలు.” ప్రేక్షకులతో చర్చించుము. పేరా 3ను చర్చించునప్పుడు, ప్రచారకుడు నిరంతరము జీవించగలరు పుస్తకముపై ఇంటివారిలో ఎలా ఆసక్తిని కలిగించవచ్చో చూపే ప్రదర్శన. ఇంటివారు స్పష్టమైన ఆసక్తిని చూపాలి. పేరా 5 చర్చించేటప్పుడు, ఇంటివారు కొద్దిపాటి ఆసక్తితోనే ఉన్నప్పుడు చర్చను కొనసాగించుటకు ప్రచారకుడు కరపత్రాన్ని ఎలా ఉపయోగించవచ్చో ప్రదర్శించుము.

పాట 215 (117), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 8తో ప్రారంభమగు వారము

పాట 126 (10)

10 నిమి: స్థానిక ప్రకటనలు. తాజా పత్రికల నుండి మాట్లాడదగు అంశములను చర్చించుము. ఈ వారాంతములో ప్రాంతీయ సేవలో పాల్గొనమని అందరిని ప్రోత్సహించుము.

20 నిమి: “నిరంతరము జీవించగలరు పుస్తకమునుండి బైబిలు పఠనములను నిర్వహించండి.” ప్రశ్నా సమాధానముల చర్చ. పేరా 6ను పరిశీలించిన తర్వాత నిరంతరము జీవించగలరు పుస్తకమునుపయోగించి బైబిలు పఠనమునకు ఆహ్వానించి, దానిని ఎలా ప్రారంభించగలడో ప్రదర్శించుము. పఠనములు ప్రారంభించగలిగిన పిల్లల స్థానిక అనుభవములు ఏవైనావుంటే వాటిని తెలియజేయుము.

15 నిమి: “నాట్‌ పెడలర్స్‌ ఆఫ్‌ గాడ్స్‌ వర్డ్‌.” డిశంబరు 1, 1992 ఇంగ్లీషు వాచ్‌టవర్‌ 26-9 పేజీల ఆధారంగా సంఘాధ్యక్షునిచే లేక మరొక పెద్దచే ప్రసంగము. సొసైటి ప్రపంచవ్యాప్త పనికి, అలాగే స్థానిక సంఘానికి మద్దతిచ్చుటలో సహోదరుల వంతుకు ఆప్యాయకరముగా మెచ్చుకొనుము. ప్రాంతీయ భాషలలో కూటములు జరుపుకొను సంఘములు పక్షపత్రికల సంచికలలో నవంబరు 15, 1992 నందు 30 పేజీలో ఉన్న “మీకు జ్ఞాపకమున్నవా?” భాగాన్ని చేయవచ్చును. ది వాచ్‌టవర్‌ నెలసరి పత్రికలలోనైతే డిశంబరు 1, 1992 పేజి 31లోని భాగాన్ని చేసికొనవచ్చును.

పాట 53 (27), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 15తో ప్రారంభమగు వారము

పాట 143 (76)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్సు రిపోర్టు. విరాళములు పంపినందుకు సొసైటి వ్యక్తపరచిన మెప్పును చదువుము. స్థానిక సంఘము కొరకు అలాగే ప్రపంచవ్యాప్త సొసైటి పనికొరకు సంఘముయొక్క నమ్మకమైన ఆర్థిక మద్దతును మెచ్చుకొనుము. వారాంతపు ప్రాంతీయ సేవా కార్యక్రమములో పాల్గొనుటకు ప్రోత్సహించుము.

20 నిమి: ‘నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో . . . వాటిని బోధించుట.’ ప్రశ్నాసమాధానముల ద్వారా ప్రేక్షకులతో పరిశీలన. పేరా 4, 5లను చర్చించేటప్పుడు స్థానిక పరిస్థితులకు సరిపోయే లేఖనాన్ని, ప్రచురణల ఉదాహరణను చూపుము. మీ ఉపోద్ఘాత చర్చనుండి కరపత్రములోనికి ఎలా వెళ్లవచ్చునో చూపే బాగా సిద్ధపడిన ప్రదర్శనను ఏర్పాటుచేయుము. సమయము అనుమతించేకొలది కరపత్రములోని ఒకటి రెండు పేరాలను పరిశీలించండి. కొత్త బైబిలు పఠనములను ప్రారంభించే ప్రయత్నాన్ని పట్టుదలతో కొనసాగించమని ప్రోత్సహించుము.

15 నిమి: “బ్లడ్‌,” రీజనింగ్‌ పుస్తకము పేజీలు 72-4. పెద్ద అక్షరములతో కనిపించే సమాచారమందున్న ప్రశ్నలు ఇంటివారు అడుగుతున్నట్లు పునర్దర్శన సెట్టింగ్‌ను ఏర్పాటుచేయుము. ప్రచారకుని సమాధానములు రీజనింగ్‌ పుస్తకముపై ఆధారపడి ఉండాలి.

పాట 181 (105), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 22తో ప్రారంభమగు వారము

పాట 150 (83)

10 నిమి: స్థానిక ప్రకటనలతోపాటు పెరిగిన సాహిత్యవెలను ప్రకటించుము. స్థానిక ప్రాంతములో కొత్త విడుదలలను ఉపయోగించగల మార్గాలను ఉన్నతపరుస్తూ, “ఇరుగుపొరుగునందు వెలుగు ప్రకాశకులు” శీర్షికను చర్చించుము.

20 నిమి: “విమోచన క్రయధనముయెడల మెప్పును చూపుట.” పెద్దచే ప్రసంగము.

15 నిమి: స్థానిక అవసరతలు లేక ది వాచ్‌టవర్‌ ఇంగ్లీషు సంచిక అక్టోబరు 1, 1992, ప్రాంతీయ భాషా పక్షపత్రిక జనవరి 1, 1993లో కనిపించే “లెర్న్‌ ఒబీడియన్స్‌ బై యాక్సెప్టింగ్‌ డిసిప్లెన్‌,” శీర్షికలోని సమాచారం ఆధారంగా అనుకూల ధోరణితో కూడిన ప్రసంగము. పిల్లలైనా, వృద్ధులైనా యెహోవా సేవకులందరు ఎలా క్రమశిక్షణలో పెట్టబడతారో చూపిస్తూ, విధేయతను అనుకూల దృష్టితో పరిగణించుటవల్ల కలిగే లాభాలను చర్చించుము. ది వాచ్‌టవర్‌ నెలసరి పత్రికగా ప్రచురించబడే భాషను ఉపయోగించే సంఘాలు నవంబరు 1, 1992 సంచికలోని “మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును” శీర్షికను ఉపయోగించవచ్చును.

పాట 211 (66), ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి