మీరు లేఖనములనుండి తర్కిస్తారా?
1 ఒక అనుభవజ్ఞుడైన సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నిండుగా ఆయుధాలను ధరించుకుంటాడు. నైపుణ్యముగల ఒక చేతిపనివాడు భవన నిర్మాణానికి వెళ్ళేటప్పుడు, ఆ పని పూర్తిగా నిర్వహించడానికి కావలసిన పరికరాలన్నింటిని తీసుకువెళ్తాడు. ప్రాంతీయసేవలో నిమగ్నమయ్యే యెహోవా పరిచారకుడు అవకాశం దొరికినప్పుడెల్లా తన “ఖడ్గాన్ని” నైపుణ్యంగా ఉపయోగించుటకు దాన్ని తన చేతిలో ఉంచుకుంటాడు. (ఎఫె. 6:17) మీ విషయంలోను అది నిజమేనా? మీరు సేవలో పాల్గొనేటప్పుడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని వినేవారి హృదయాలను ఆకర్షించులాగున దేవుని వాక్యమును మాట్లాడుటకు అనుమతిస్తారా?—సామె. 8:1, 6.
2 ప్రకటించడం ఎల్లప్పుడూ సులభం కాదు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇండ్లలో అరుదుగా ఉంటారు, ఉన్నా, వారు పనిలో నిమగ్నమై ఉంటారు, బైబిలు విషయాలను విశదంగా చర్చించడానికి అవకాశమివ్వరు. బైబిలు మన ముఖ్యమైన పాఠ్యపుస్తకమైనందున, మనం దాన్ని సేవలో ఎక్కువగా ఎలా ఉపయోగించి, వినేవారిపై దానిలోని ప్రేరేపిత సందేశం ప్రభావం చూపించడానికి అనుమతించగలం?
3 ప్రతి అవకాశంలో: ప్రతి ఇంటా, ఇంటివారిని పురికొల్పడానికి మనం బైబిలును ఉపయోగించడానికి ఇష్టపడతాం. మనం ఏ పుస్తకమిచ్చినా అలా ఉపయోగించడానికి సిద్ధపడాలి. ఆ వ్యక్తి పనిలో నిమగ్నమై ఉండడం వలన, బైబిలు తెరచి ఒకటో, రెండో వచనాలు చదవడానికి సమయం లేకపోతే, సాహిత్యం అందించక ముందు ఒక లేఖనాన్ని ఉదహరించి, దాన్ని మీరు వివరించగలరా? అలా చేస్తే ఆ వ్యక్తి ఆగి, వినడానికి దోహదపడవచ్చు.—హెబ్రీ. 4:12.
4 ఉదాహరణకు, మీరు “ఎ వరల్డ్ వితౌట్ డిసీజ్” అనే శీర్షికగల డిశంబరు 8, 1993, అవేక్!ను అందిస్తున్నట్లయితే కవరుమీది చిత్రాన్ని చూపిస్తూ, ఇలా అడగండి, “ఇక వ్యాధులు లేకుండా, ప్రతి ఒక్కరూ పూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించే కాలమొకటి ఉంటుందని మీరు నమ్ముతారా?” ప్రతిస్పందన ఏమైననూ, మీరు బైబిలు నుండి సూటిగా యెషయా 33:24 లేదా ప్రకటన 21:4 వంటి లేఖనాల్ని చదవండి, లేదా వాటిని వివరించి చెప్పండి. ఈ విధంగా మీరు దేవుని వాక్యాన్ని మాట్లాడనివ్వండి.
5 పునర్దర్శనాల్లో: మనం పునర్దర్శనాలు చేయకముందు సిద్ధపడాలి. అయినను, తరచు మనం సిద్ధపడని విషయాలు చర్చకు వస్తాయి. ఇలాంటి సందర్భంలోనే రీజనింగ్ ఫ్రమ్ ది స్క్రిప్‌చర్స్ అమూల్యమైన పరికరంగా రుజువుకాగలదు. మనం రీజనింగ్ పుస్తకం నుండి ఉదహరించి, మద్దతునిచ్చే లేఖనాలు చదవడం మనం దేవుని వాక్యాన్ని అమ్ముకొనేవారం కాదని, దేవుని పరిచారకులమని ప్రజలు తెలుసుకోవడానికి సహాయపడుతుంది.—2 కొరిం. 2:17.
6 ఏదైనా ఒక ప్రత్యేక విషయాన్ని గూర్చి మాట్లాడనిచోట, పునర్దర్శనం చేసేటప్పుడు, మీరు రీజనింగ్ పుస్తకం తెరిచి “జీజస్ క్రైస్ట్,” “లాస్ట్ డేస్,” “రెజరెక్షన్” వంటి సముచితమైన అంశాన్ని తప్పకుండా చర్చించవచ్చు. గృహస్థున్ని బైబిలు నుండి కొన్ని లేఖనాలు చదువుటకు ఆహ్వానించవచ్చు. ఈ విధంగా బైబిలు వారికి ఆసక్తికరంగాను, అర్థవంతంగాను ఉంటుంది. వారు యథార్థవంతులైతే యెహోవా పరిశుద్ధాత్మ వారికి ధారాళంగా లభిస్తుంది.
7 సువార్తను ప్రకటించి, దుష్టుని హెచ్చరించ వలసిన మన బాధ్యత గంభీరమైనది. ఇది యెహోవా సందేశం, మనది కాదు. ఆయన వాక్యమనే, ఆత్మ ఖడ్గం మీకు సహాయపడనివ్వండి.