పునర్దర్శనములు చేయుటలో ఉన్న సవాలు
1 సువార్త పరిచారకులుగా, శిష్యులను చేయుడి అని మనము ఆజ్ఞాపించబడియున్నాము. (మత్త. 28:19, 20) ఇందులో పునర్దర్శనములను చేయుట ఇమిడియున్నది. మన క్రైస్తవ పరిచర్యలోని ఈ ప్రముఖ భాగమునుగూర్చి మీరు అనుకూల దృష్టిని కలిగియున్నారా? పునర్దర్శనములను చేయుటలో నేర్పరులగుటయనేది, ఒక ఉత్తేజకరమైన సవాలు.—సామె. 22:29.
2 సమర్పించుకొన్న ప్రతి క్రైస్తవుడు శిష్యులను తయారుచేయు ఈ పనిలో వంతు కలిగి యుండుటను తన బాధ్యతగా భావించాలి. రాజ్యనిరీక్షణను ఇతరులతో పంచుకొనుటకై చేయు ఈ పని నిమిత్తం మన వ్యక్తిగత సౌఖర్యాలను కొంత వరకు ప్రక్కన పెట్టవలసి వస్తుంది. యథార్థవంతులు వారి ఆత్మీయ అవసరతలను తీర్చుకొనుటలో వారికి సహాయపడే అవకాశమును పునర్దర్శనములు మనకు కల్గించును.
3 ఆసక్తి కనబడిన అన్ని చోట్లను తిరిగి దర్శించండి: ఒక వేళ వారు సాహిత్యములను తీసుకొనక పోయినను, రాజ్యవర్తమానము యెడల ఆసక్తి కనపరచిన వారినందరిని పునర్దర్శించ వలెను. బైబిలు అంశాలను మనతో చర్చించుటకు ఇష్టపడుట ద్వారా, ఆసక్తి చూపే అనేకమంది ప్రజలున్నారు. ప్రజలతో లేఖన సంబంధమైన చర్చలను చేయుట ద్వారా వారిలో రాజ్యవర్తమానము యెడల ఎట్లు ఆసక్తిని పెంపొందించ వచ్చునో యేసు మరియు అపొస్తలులు చూపియున్నారు.—మార్కు 10:21; అపొ. 2:37-41.
4 తిరిగి సందర్శించుటలో మన ఉద్దేశము బైబిలు పఠనము ప్రారంభించుటై ఉండవలెను. బైబిలు పఠనము ఎలా నిర్వహించ బడుతుందో మనము ఇంటివారికి ప్రదర్శించి చూపవచ్చును. బోధించుటకు నేనొక యథార్థవంతుడైన వ్యక్తిని కనుగొనాలని ప్రార్థిస్తే, యెహోవా దానికి ప్రత్యుత్తరమిచ్చునని మీరు నిశ్చయత కలిగియుండవచ్చును. ఆయన సేవకై మీరు మనఃపూర్వకముగా చేయు ప్రయత్నములను యెహోవా దీవించును. యెహోవా సహాయమును కోరుతూ బైబిలు పఠనమును ప్రారంభించుటను ఒక గురిగా ఎందుకు పెట్టుకొనకూడదు?
5 కరపత్రములను బాగుగా ఉపయోగించండి: బైబిలు పఠనములను ప్రారంభించుటలో కరపత్రములను సమర్ధవంతముగా ఉపయోగించవచ్చును. దాని అట్ట పైగల చిత్రమును చర్చించుట వలననే అనేకులు సంభాషణను ప్రారంభించ గల్గారు. ఇంటివారితో ఒక పేరాను ఒకసారి చర్చించండి. ఒక ప్రశ్ననడిగినప్పుడు, ఆగి, ఇంటివారినే తనకైతానుగా తన అభిప్రాయమును తెల్పమని ఆహ్వానించండి. లేఖనములను చూచి, అవి ఎలా అన్వయించునో చూపించండి. ఆ తర్వాత సంభాషణను పఠనము నిర్వహించగల సాహిత్యము వైపు మళ్లించవచ్చును.
6 రీజనింగ్ పుస్తకమును ఉపయోగించండి: రీజనింగ్ పుస్తకముద్వారా ఫలవంతమగు పునర్దర్శనములను చేయవచ్చును. గతములో చేసియున్న సంభాషణను కొనసాగించుటకు వెళ్లునప్పుడు, ముఖ్యాంశముల పట్టికను, లేక ఇండెక్స్‌ను పునఃసమీక్షించ వచ్చును. లేవనెత్తబడిన అభ్యంతరాలను గూర్చి మాట్లాడబోయేముందు “స్క్రిప్చ్‌ర్స్ ఆఫన్ మిస్అప్లైడ్” అను భాగము ప్రయోజనకరంగా ఉంటుంది. 204 పేజిలోని “హౌడు జెహోవాస్ విట్నెసెస్ అరైవ్ ఎట్ దెయిర్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ది బైబిల్?” అను భాగము క్రింద ఉండు సమాచారము వంటి దానిని ఉపయోగించుట ద్వారా ఎక్కువ విజయాన్ని పొందినట్లు పయినీర్లు తెలియజేస్తున్నారు. బైబిలే దాని స్వంత వివరణ నిచ్చులాగున మనము ఎలా చేస్తామో వారు ఆసక్తిగల వ్యక్తికి చూపుతారు. ఇది బాగా సఫలీకృతమగుచు, అనేక బైబిలు పఠనములను ప్రారంభించుటకు దోహదపడినది.
7 యేసు, అపొస్తలుల వలెనే, యెహోవా గొర్రెల యెడల మనము యథార్థమైన శ్రద్ధను ప్రదర్శించ వలసి యున్నాము. (లూకా 9:11) ప్రజల యెడల గల ప్రేమ, మనలను వారికి రాజ్యసత్యములను అందించునట్లు చేస్తుంది. (2 కొరిం. 2:17) ఇతరుల ఆత్మీయ క్షేమమునకై మనలను మనము ఉపయోగించు కొనుటకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చినప్పుడు, పునర్దర్శనములను చేయు సవాలును మనము ఎదుర్కొన గల్గుదుము.