బైబిలు విద్యార్థులు వారి పఠనాన్ని సిద్ధపడుటకు సహాయపడండి
1 ప్రతివారం తమ పఠనానికొరకు సిద్ధపడే బైబిలు విద్యార్థులు, సాధారణంగా సిద్ధపడని వారికన్నా, తమ పఠనంలో యథార్థమైన ఆసక్తిని చూపిస్తూ, మరింత త్వరగా ఆత్మీయ అభివృద్ధిని సాధిస్తారు. కొన్నిసార్లు ఒక విద్యార్థి ఎలా సిద్ధపడాలో తెలియనందువల్లనే సిద్ధపడకపోవచ్చు. ఎలా సిద్ధపడాలో అతనికి నేర్పించడం అవసరం కావచ్చు. దీనినెలా చేయవచ్చు?
2 ప్రారంభంనుండే, సిద్ధపాటులో వ్యక్తిగత పఠనం చేరి ఉందని విద్యార్థికి అర్థమయ్యేలా చేయుటకు కొంతసమయం తీసుకోండి. చాలా మందికి, చదవడం వచ్చినా, ఎలా పఠించాలో వారికి నేర్పబడలేదు. అవసరమయ్యేకొలది, మీరు విద్యార్థికి చెప్పగల అనేక సహాయకరమైన సలహాలు థియోక్రాటిక్ మినిస్ట్రీ స్కూల్ గైడ్‌బుక్ లోని 33 నుండి 43 వరకున్న పేజీలలో ఉన్నాయి.
3 విద్యార్థికి పఠనము విలువను చూపండి: మీరు మీ విద్యార్థికి మీ పాఠ్యపుస్తకంలో గుర్తులు పెట్టుకున్న, లేదా అండర్లైన్ చేసిన ముఖ్యమైన పదాలను, చిన్నవాక్యాలను చూపించవచ్చు. గుర్తు చేసిన భాగాలు అందలి అంశాలను ఎలా జ్ఞాపకం చేసుకుని, వాటిని ఆయన తన స్వంత మాటల్లో చెప్పుటకు అవి ఎలా సహాయం చేస్తాయో ఆయనను గమనించనివ్వండి. అలా అతడు ప్రశ్నలకు జవాబు చెప్పేటప్పుడు పుస్తకంలోని భాగమంతా చదవకుండా ఉండగల్గుతాడు. ఈ సందర్భంలో ఇచ్చే తర్ఫీదు, తర్వాత సంఘ కూటాల్లో అర్థవంతమైన వ్యాఖ్యానం చేయడానికి అతనికి సహాయపడుతుంది. అతడు చేసే వ్యాఖ్యానాలు, పఠిస్తున్న అంశంయెడల అతనికున్న మెప్పును ప్రతిబింబించి, అతడు ఎంతలోతుగా అర్థం చేసుకున్నాడో సూచిస్తాయి.
4 బైబిలు ఉపయోగించడానికి అతనికి నేర్పండి: పాఠ్యాంశంలో సూచించబడిన లేఖనాలను ఎలా తీయాలో విద్యార్థి నేర్చుకోవలసిన అవసరం ఉంది. అతడు సమర్థవంతంగా చేయగల్గినప్పుడు, తాను నిజంగా బైబిలు విద్యార్థి అనే విషయాన్ని పూర్తిగా అభినందిస్తాడు. ప్రారంభంలో, అతడు బైబిలులో ఇచ్చిన బైబిలు పుస్తకముల పట్టిక చూడవలసిన అవసరమున్నను, బైబిలు విద్యార్థి 66 బైబిలు పుస్తకముల వరుసను నేర్చుకోవడానికి ప్రోత్సహించాలి. అతడు లేఖనములను తీసి, చదివినప్పుడు, పేరాలోని అంశానికి మద్దతునిచ్చే భాగాన్ని గుర్తించుటకు, ప్రస్తుత పఠనానికి సూటిగా సంబంధించని భాగాలు అతని శ్రద్ధకు భంగం కలగకుండా ఉండడానికి సహాయం చేయాలి.
5 విద్యార్థి అభివృద్ధి చెందుతుండగా, బైబిలు ఆరంభం నుండి ముగింపు వరకు చదవమని అతన్ని ప్రోత్సహించండి. బైబిలు మొత్తం దైవ ప్రేరేపిత వాక్యమని నిజ క్రైస్తవులు దాని ద్వారా ఆత్మీయంగా పోషించబడాలని నొక్కి తెల్పండి.—మత్త. 4:4; 2 తిమో. 3:16, 17.
6 ఇతర దైవపరిపాలనా సూచికలను పరిచయం చేయండి: విద్యార్థి మరింతగా అభివృద్ధి సాధించినప్పుడు, అతడు ఇతర దైవపరిపాలనా సూచికలను ఉపయోగించుటకు ఆరంభించవచ్చు. అతడు సంఘ కూటాలకు హాజరవుతుండగా, అతనికి అక్కడ కన్పించే వివిధ సంస్థ ప్రచురణలను చూడమని వివేచనతో ప్రోత్సహించండి. న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్‌లోని “బైబిల్ వర్డ్స్ ఇండెక్స్డ్” వంటి విశేష అంశాలను ఎలా ఉపయోగించవచ్చో నేర్పించండి. ఆయన తన స్వంత దైవపరిపాలనా గ్రంథశాలను తయారు చేసుకుంటుండగా, కాంప్రెహెన్సివ్ కాన్కార్డెన్స్, రీజనింగ్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్, ఇండెక్స్, ఇన్సైట్ మున్నగు పుస్తకాలను ఎలా ఉపయోగించాలో అతనికి చూపించండి.
7 బైబిలు విద్యార్థులను తమ బైబిలు పఠనానికి ఎలా సిద్ధపడాలో మనం నేర్పిస్తే, వారి వ్యక్తిగత గృహ బైబిలు పఠనం ముగించిన తర్వాత కూడా వారు సమర్థవంతులైన బైబిలు విద్యార్థులుగా సత్యంలో అభివృద్ధి చెందుతూ ఉండడానికి వారిని సంసిద్ధులను చేసిన వారమౌతాము.