నవంబరు కొరకైన సేవా కూటములు
నవంబరు 1తో ప్రారంభమగు వారం
పాట 5 (104)
10 నిమి: స్థానిక ప్రకటనలు, మన రాజ్య పరిచర్యనుండి ఎన్నుకోబడిన ప్రకటనలు. ప్రచారకులు రాజ్య ప్రచార సేవలో చేసిన పనిని మెచ్చుకోండి.
10 నిమి: రీజనింగ్ పుస్తకంలో పేజీ 104-6, “డ్రీమ్స్.” బైబిలు విద్యార్థితో చర్చించినట్లుగా నిర్వహించాలి. విద్యార్థి మనం కలల వలన నడిపించబడుటలోని జ్ఞానాన్నిగూర్చి అడుగుతాడు. మనం దయ్యాలకు, లోక సంబంధమైన తర్కవాదనకు ఎరకాగల అపాయాన్ని గూర్చి చర్చించండి. దేవుని వాక్యంలోని సూత్రాల వలన నడిపించబడవలసిన ప్రాముఖ్యతను చూపండి.
10 నిమి: స్థానిక అవసరాలు లేదా “సంభాషించడం అంటే కేవలం మాట్లాడుకోవడమే కాదు” ఆగష్టు 1, 1993, పేజీలు 3-8, కావలికోటలోని శీర్షికలపై ఆధారపడిన ప్రసంగం.
15 నిమి: “నేటి లోకంలో బైబిలు విలువ.” సేవాధ్యక్షుడు, ఇంటింటి సేవలో అభివృద్ధిని సాధించాలని కోరుకుంటున్న ప్రచారకుని మధ్య జరిగే చర్చ. మూడవ పేరా పరిశీలించిన తర్వాత సేవాధ్యక్షుడు గృహస్థునిగా ఉండి, సూచించబడిన అందింపుతో మాట్లాడడానికి ప్రయత్నించమని ప్రచారకున్ని అడుగుతాడు. నాల్గవ పేరా పరిశీలించిన తర్వాత సేవాధ్యక్షుడు ప్రచారకునితో సూచించబడిన విధంగా మాట్లాడి చూపిస్తాడు. ఆసక్తిగలవారిని, బైబిలు విద్యార్థులను న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ విలువను అభినందించుటకు ప్రోత్సహించండి.
పాట 52 (59) ముగింపు ప్రార్థన.
నవంబరు 8తో ప్రారంభమగు వారం
పాట 7 (93)
10 నిమి: స్థానిక ప్రకటనలు. వాటి విశేష అంశాలను చూపిస్తూ ఈ వారాంతంలో ఉపయోగించగల శీర్షికను ఎత్తి చూపుతూ ఇటీవలి పత్రికలను ఎలా అందించవచ్చో ప్రదర్శించండి. “ప్రాంతీయ సేవకు విశేషమైన నెల” అనే శీర్షిక వైపుకు అవధానాన్ని మళ్ళించి, డిశంబరు నెలలో సహాయ పయినీర్లుగా సేవ చేస్తూ లేదా పయినీర్లతో కలిసి ప్రాంతీయ సేవలో వారి పరిచర్యను అభివృద్ధిపరచే సాధ్యతను గంభీరంగా పరిశీలించడానికి ఆహ్వానించండి.
15 నిమి: “నిజమైన నడిపింపునిచ్చే పుస్తకం” అనే శీర్షికను గూర్చిన ప్రశ్న-జవాబుల చర్చ. మూడవ పేరాలో చెప్పిన విధంగా పునర్దర్శనాన్నిగూర్చి ప్రదర్శించండి. ఇంటింటి సేవలో, పునర్దర్శనాల్లో ప్రజలతో మాట్లాడేటప్పుడు బైబిలు ఆచరణాత్మక విలువనుగూర్చి ఉత్సాహంగా మాట్లాడుటకు అందరిని ప్రోత్సహించండి.
20 నిమి: “యౌవనస్థులారా—యెహోవా హృదయాన్ని సంతోషపర్చండి.” పెద్దలు ఇద్దరో ముగ్గురో బాప్తిస్మం పొందిన ప్రచారకులతో 1 నుండి 18 పేరాలు చర్చిస్తారు. యౌవనస్థులు వారి మంచి నడవడిని బట్టి పొందే ప్రయోజనాలను, “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .” శీర్షికల విలువను నొక్కి చెప్పండి. సమయం దొరికేదాన్నిబట్టి లేఖనాలు పరిశీలించండి.
పాట 80 (71) ముగింపు ప్రార్థన.
నవంబరు 15తో ప్రారంభమగు వారం
పాట 73 (18)
5 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టు, చందా అందినట్లు చెప్పబడిన వివరాలు. స్థానిక సంఘానికి, సంస్థ యొక్క రాజ్యమందిర నిధికి, సంస్థ లోకవ్యాప్త పనికి సంఘం ఇచ్చే ఆర్థిక మద్దతును మెచ్చుకోండి. రానున్న సెలవు దినాల్లోని ప్రాంతీయ సేవా ఏర్పాట్లను తెలపండి.
20 నిమి: “దేవుని సంస్థతో సహవసించడానికి బైబిలు విద్యార్థులకు సహాయపడుట.” ప్రశ్న-జవాబులు. ఎనిమిదవ పేరాను ప్రదర్శించండి, 9వ పేరాలో చెప్పిన ప్రకారం రాజ్య మందిరానికి ఆహ్వానించి ముగించండి.
20 నిమి: “యౌవనస్థులారా—యెహోవా హృదయాన్ని సంతోషపర్చండి.” ఇన్‌సర్ట్‌లోని 19-33 పేరాల ప్రశ్న-జవాబుల పరిశీలన. ఇద్దరో ముగ్గురో యౌవన ప్రచారకులను ఇంటర్‌వ్యూ చేయండి. వారి ఆత్మీయ అభివృద్ధికి సంఘం ఎలా సహాయపడిందో అడగండి.
పాట 90 (102) ముగింపు ప్రార్థన.
నవంబరు 22తో ప్రారంభమగు వారం
పాట 74 (44)
10 నిమి: స్థానిక ప్రకటనలు. దైవ పరిపాలనా వార్తలు. సాక్ష్యపు పనిలో ఈ వారాంతంలో తాజా పత్రికలు ఉపయోగించుటకు ప్రోత్సహించండి.
15 నిమి: “బైబిలు విద్యార్థులు వారి పఠనాన్ని సిద్ధపడుటకు సహాయపడండి.” ప్రశ్నలు-జవాబులు. సమయం దొరికేదాన్ని బట్టి పేరాలు చదవండి.
20 నిమి: “మీరు లేఖనముల నుండి తర్కిస్తారా?” ఇంటింటి సేవలో, పునర్దర్శనాల్లో ఫలభరితుడైన సహోదరుడు ప్రశ్న జవాబుల రూపంలోని చర్చ నిర్వహిస్తాడు. నాల్గవ పేరా పరిశీలించిన తర్వాత ఇంటివారు పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఒక ప్రచారకుడు తనకు జ్ఞాపకమున్న లేఖనాన్ని ఎలా ఉదహరించి, వివరిస్తాడో ప్రదర్శించండి. ప్రదర్శన తర్వాత, ప్రజలందరూ తమ అనుదిన చర్యల్లో మునిగి లేదా నిమగ్నమై ఉన్న ప్రాంతాల్లో “వాక్యమును ప్రకటించ”డానికి ప్రయత్నించేటప్పుడు మనం ఈ సలహాను అనుసరించుటలో గల విలువను నొక్కి చెప్పండి. (2 తిమో. 4:2) ఆరవ పేరా పరిశీలించిన తర్వాత, సాక్ష్యపుపనిలో రీజనింగ్ పుస్తకమును ఫలవంతంగా ఉపయోగించే ప్రచారకుడు దాన్ని తానెలా ఉపయోగిస్తున్నాడో వివరించడానికి ఆహ్వానించండి.
పాట 108 (69) ముగింపు ప్రార్థన.
నవంబరు 29తో ప్రారంభమగు వారం
పాట 83 (2)
10 నిమి: స్థానిక ప్రకటనలు. డిశంబరులో సహాయ పయినీరు సేవ చేయగల్గేవారిని ప్రోత్సహించండి.
15 నిమి: “ది బైబిల్—ఎ ప్రాక్టికల్ గైడ్ ఫర్ మోడర్న్ మ్యాన్.” మే 1, 1993 వాచ్‌టవర్ ఆధారంగా ఒక కుటుంబ శిరస్సు ప్రసంగమిస్తాడు. బైబిలు సూత్రాలను అన్వయించడం ద్వారా సమాధానకరమైన, స్నేహపూర్వకమైన కుటుంబ పరిస్థితులను పెంపొందించవచ్చనే విషయాన్ని నొక్కి తెల్పండి. ప్రేక్షకులలో ఒకరో ఇద్దరో, దేవుని వాక్యంలోని ఉపదేశం ఎలా వ్యక్తిపరంగా, కుటుంబపరంగా సహాయపడిందో చెప్పనివ్వండి.
20 నిమి: మహాగొప్ప మనిషి పుస్తకమును ఉపయోగిస్తూ డిశంబరు నెలలో గొర్రెలవంటి వ్యక్తులకు సహాయం చేయండి. ప్రేక్షకులతో చర్చ. యేసు పరిచర్యలో, లేదా ఇతరులతో ఆయనకుగల వ్యవహారాల్లో మిమ్మల్ని ఎక్కువగా ఏ వృత్తాంతం ఆకర్షించింది, ఎందుకు? ఈ ప్రచురణ మీవరకు ఎంత విలువైనది? మీరు దీన్ని పఠించడం వలన యెహోవాను గూర్చి ఏం నేర్చుకున్నారు? మీరు దీన్ని అందజేసేటప్పుడు ఏ విషయాలను ఎత్తి చూపారు? అనేటటువంటి ప్రశ్నలు అడగండి. అనుభవజ్ఞుడైన ప్రచారకుడు పుస్తకాన్ని అందజేయడాన్ని ప్రదర్శించాలి. ఆదివారం అందరూ సేవలో పాల్గొనాలని ప్రోత్సహించండి.
పాట 94 (22) ముగింపు ప్రార్థన.