కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/93 పేజీ 8
  • నిజమైన నడిపింపునిచ్చే పుస్తకం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిజమైన నడిపింపునిచ్చే పుస్తకం
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • మొదటిసారి కలిసినప్పుడే పునాదివేయండి
    మన రాజ్య పరిచర్య—1992
  • నేటి లోకంలో బైబిలు విలువ
    మన రాజ్య పరిచర్య—1993
  • బైబిలు—సర్వమానవాళికి దేవుడిచ్చిన మార్గదర్శిని
    మన రాజ్య పరిచర్య—1997
  • గొప్పనిధిని కనుగొనుటకు ఇతరులకు సహాయం చేయుట
    మన రాజ్య పరిచర్య—1993
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1993
km 11/93 పేజీ 8

నిజమైన నడిపింపునిచ్చే పుస్తకం

1 గత శతాబ్దంలో లోకం ఎంతో మారిపోయింది. సమాచార వ్యవస్థ, వైద్య, రవాణా రంగాల్లో అభివృద్ధి ఉన్నప్పటికీ, కుటుంబ జీవితంలో నాణ్యత క్రమంగా తగ్గిపోయింది. తదేకంగా మారుతూ ఉండే మానవ తత్వాల వలన నడిపించబడుటకు లక్షలాదిమంది ప్రజలు అనుమతిస్తున్నారు.

2 త్వరగా మారుతున్న ఈ లోకపు నటనలో యెహోవా ప్రజలు ఆయన వాక్యాన్ని అనుసరించడం వలన గొప్ప ప్రయోజనాలను అనుభవిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలనుండి బైబిలు మారకుండా ఉంది, నేటి సమస్యలను ఎదుర్కోడానికి దాని ఉపదేశం ఇప్పటికీ అత్యంత ఆచరణయోగ్యమైనదే. మన ఆధునిక దినాల్లో బైబిలు సరైన నడిపింపును యిస్తుందని గుణగ్రహించుటకు ఆసక్తిగల ప్రజలకు మనం ఎలా సహాయం చేయగలం?

3 మీరు “వై యు కెన్‌ ట్రస్ట్‌ ది బైబిల్‌” అనే కరపత్రమును మొదటి దర్శనంలో ఇచ్చినట్లయితే, మీరు మళ్ళీ దర్శించి, ఇలా చెప్పవచ్చు:

◼ “వాక్యం చెప్పేది నమ్మి, దాని ప్రకారం నడుచుకుంటే నిత్యజీవమిస్తాడన్న సందేశం దేవుడు తెలిపిందేనని బైబిలు స్పష్టంగా చెబుతుంది కనుక, ఇలాంటి విషయాలు మరెక్కువగా తెలుసుకోవడం విలువైనదని మీరు భావిస్తారా? [అభిప్రాయం చెప్పనివ్వండి.] ప్రస్తుత లోక విధానాన్ని గూర్చి బైబిలు ఏమి ప్రవచిస్తుందో చూడండి. [నేరుగా కరపత్రమునందలి 5వ పేజీలోని 2 తిమోతి 3:1-5 చదవండి.] ఈ వివరణ నేటి లోకానికి సరిపోతుందని మీరు అనుకుంటారా? [అభిప్రాయం చెప్పనివ్వండి.] భవిష్యత్తులో మంచి పరిస్థితులు ఏర్పడతాయనే నిరీక్షణకు సరైన కారణం ఉందా?” కరపత్రము చివరి రెండు పేరాలు చర్చించడం ద్వారా లేదా ది బైబిల్‌—గాడ్స్‌ వర్డ్‌ ఆర్‌ మ్యాన్స్‌? అనే పుస్తకంలోని 161వ పేజీని ఉపయోగిస్తూ, మానవజాతి కొరకు బైబిలిచ్చే అద్భుతమైన నిరీక్షణను నొక్కి చెబుతూ పునర్దర్శనానికి పునాది వేయగలరు.

4 ఇంటివారు బైబిలులోని ఆచరణాత్మక విలువయందు ఆసక్తి చూపినట్లయితే, మీరు “ది బైబిల్‌—గాడ్స్‌ వర్డ్‌ ఆర్‌ మ్యాన్స్‌?” అనే పుస్తకంలోని 12 వ అధ్యాయంలోని ఏవైనా ప్రత్యేక సూత్రాలు చూపించినట్లయితే, మీరిలా చెప్పవచ్చు:

◼ “నేడు మనకు ఆచరణయోగ్యమైన విషయాల్లో మనకు ఆసక్తి ఉంది, లేదంటారా? యుద్ధాలను ఆపివేయడం ఆచరణయోగ్యమని మీరు ఒప్పుకుంటారా? [అభిప్రాయం చెప్పనివ్వండి.] ప్రజలు ఇతర దేశాల్లోని ప్రజలతో సమాధానంగా కలిసి జీవించడానికి నేర్చుకుంటే, అదొక మంచి ప్రారంభమౌతుంది, ఏమంటారు? [జవాబు చెప్పనివ్వండి.] సరిగ్గా బైబిలు అదే ప్రవచించింది. [యెషయా 2:2, 3 చదవండి.] ఇది ఎప్పుడు, ఎలా సంభవిస్తుందని మీరెప్పుడైనా ఆలోచించారా?” ఇంటివారికి అనుకూలమైన సమయంలో మరొకసారి ప్రశ్నను చర్చించడానికి మీరు ఇష్టపడుతున్నారని వివరించండి.

5 మీరు “న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌” ఇచ్చినట్లయితే మళ్ళీ సందర్శించి ఇలా చెప్పవచ్చు:

◼ “నేను మీకిచ్చిన బైబిలును మీరు చదువుతున్నప్పుడు అందులో అన్నిచోట్ల దేవుని వ్యక్తిగత నామాన్ని ఉపయోగించడం మీరు గమనించి ఉండవచ్చు. ప్రాముఖ్యంగా ఇలా ఉపయోగించడం వలన ఇతర బైబిల్‌ తర్జుమాలకన్నా దీని నాణ్యత పెరిగింది. కొంతమంది ఆ పేరును ఉపయోగించడానికి వెనుకాడినా దేవుడు తన నామాన్ని ఎంతోకాలం క్రితమే తెలిపాడని, ఆయన సేవకులు ఆయన జీవముగల సత్యదేవుడని గుర్తించుటకు ఆయన పేరును ఉపయోగించాలని ప్రోత్సహిస్తున్నాడని మనం గుర్తుంచుకోవాలి. కీర్తన 83:18లో కీర్తనల రచయిత ఏమి రాసాడో గమనించండి.” లేఖనం చదివి, ఇంటివారిని వ్యాఖ్యానించనివ్వండి. ఆసక్తి కనపర్చేదాన్నిబట్టి, రీజనింగ్‌ పుస్తకంలోని 191 వ పేజీ ఆరంభమందు “జెహోవా” అనే శీర్షిక కింద యివ్వబడిన అదనపు సమాచారాన్ని మీరు ఉపయోగించవచ్చు.

6 మానవునికి అవసరమైన నడిపింపును బైబిలు మాత్రమే ఇస్తుంది. (యిర్మీ. 10:23) దేవుని సంకల్పాలను తెలుసుకొనుటకు, ఆయన అనుగ్రహాన్ని పొందుటకు ఒకే ఒక మార్గం, ఆయన వాక్యాన్ని పఠించుటయే. అందువల్ల, ఇతరులు దాని జ్ఞానయుక్తమైన, ఆచరణయోగ్యమైన సలహానుండి ప్రయోజనం పొందుటకు చిత్తశుద్ధితో ఆహ్వానిద్దాం.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి