పత్రికలందించుటకు సమయాన్ని కేటాయించండి
1 ఆయన మార్గాలను అనుసరించే వారికి ‘సమాధానము, భవిష్యత్తు, నిరీక్షణ’ అనేవి ఉంటాయని యెహోవా నిర్ణయించాడు. (యిర్మీ. 29:11) ఈ నిరీక్షణను గూర్చిన సమాచారం సమయానుకూలంగా కావలికోట, తేజరిల్లు! పత్రికలలో అందించబడింది. ప్రతివిధమైన పరిస్థితులలో ఉన్న ప్రజలందరికి ఈ పత్రికలు ప్రయోజనమివ్వగలవు. (1 తిమో. 2:4) పత్రికలను పంచిపెట్టుటలో మీరు, మీ కుటుంబం క్రమంగా సమయాన్ని కేటాయిస్తున్నారా?
2 మీరందించే పత్రికల సంఖ్య తగ్గిపోతుంటే, ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించగలరు? మన పత్రికల్లో ఉన్న విషయాల యెడల మీ మెప్పుదలను చురుకుగా ఉంచడం ఒక ప్రాముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి యిలా వ్రాశాడు: “మీ పత్రికలను చదవడం నిజంగా ఆనందదాయకమైన అనుభవం. అవి ‘ఓదార్పునిచ్చుటలో’ విలువలేనివి, తక్కువ ప్రాధాన్యత గలవి కాదుగాని, జీవితాన్ని అర్థవంతమైందిగా చేసుకొనుటకు నడిపింపును, మార్గాన్ని కలిగి ఉన్నాయి.” కావలికోట, తేజరిల్లు! జాగ్రత్తగా చేసిన పరిశోధన ఫలితంగా వచ్చినవే, మరి అవి “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన” దాసుని ఏర్పాట్లే. (మత్త. 24:45) ప్రజల హృదయాలను చేరడానికి అవి ప్రభావవంతమైన ఉపకరణాలు.
3 మీరు అందించే పత్రికల్లోని శీర్షికలతో పరిచయం కల్గివుండండి. మీ సమాజంలోని సరిక్రొత్త సమస్యలను గూర్చి చర్చించే విషయాలను వెదకండి. ఇంటివద్ద లేదా వీధిలో మీరు కలుసుకునే పురుషులు, స్త్రీలు, యౌవనులతో మాట్లాడటానికి సిద్ధపడడం మంచిది. వ్యక్తులకును, మొత్తం కుటుంబాలకును పత్రికలు ఎలా సంబంధం కల్గివున్నవో చూపడానికి సిద్ధపడండి.
4 పత్రికలందించడంలో శ్రద్ధకల్గి ఉండండి: మీ ఇంటింటి సేవ పట్టికలో పత్రికలతో సాక్ష్యమివ్వడమనేది ఒక ప్రాముఖ్యమైన భాగాన్ని కల్గియుండాలి. మీరు పత్రికలనందించడానికి శ్రేష్ఠమైన సమయాలేమిటి? సాయంకాలం మీ సంఘ పుస్తకపఠనానికి ముందు లేదా మధ్యాహ్నం తర్వాత ఒక గంటపాటు ఇంటింటి సేవ చేయడానికి ప్రయత్నించారా? కొన్ని ప్రాంతాల్లో సాయంకాల సాక్ష్యం చాలా ఫలవంతమైందిగా ఉంది. అనేక పద్ధతుల్లో పత్రికలను పంచిపెట్టడానికి శనివారం ఒక మంచి రోజు, కాని మిగతా రోజులు కూడా ఈ పని కొరకు ఉపయోగించవచ్చు. ఇంటింటను, దుకాణములలోను అందించే పని, పత్రికలను అందించే రోజులో ఓ క్రమమైన భాగంగా ఉండాలి.
5 పత్రికయొక్క ప్రతి సంచిక కూడా పంచిపెట్టే ప్రతుల కొరకు ప్రతి ఒక్కరూ క్రమమైన ఆర్డరు కల్గివుండాలి. ఏదైనా సందర్భంలో మీ వద్ద పాత సంచికలు అందుబాటులో ఉంటే, పత్రికల్లోని రకరకాల విషయాలను గృహస్థునికి చూపడానికి ఉపయోగించవచ్చు. అప్పుడప్పుడు, ఉద్యోగవిరమణ చేసిన వ్యక్తుల కొరకు నిర్మించబడిన గృహాల్లోను, ప్రవేశమున్న నర్సింగ్హోమ్లలోను, ఆసుపత్రుల్లోను కొన్ని పాత ప్రతులను విడిచిపెట్టవచ్చు. అలాంటి పత్రికలన్నీ అందించినట్లుగా లెక్కించి, ప్రతి నెలా మీ ప్రాంతీయ సేవా రిపోర్టులో రిపోర్టుచేయాలి.
6 పైన పేర్కొన్న సలహాలను పాటించడంద్వారా, నిస్సందేహంగా మీరు అందించగలిగే పత్రికల సంఖ్య పెరగడం గమనిస్తారు. ప్రస్తుత దుష్టవిధానంలోని జీవిత భారంతో నిండినవారై సహృదయులైయున్న ప్రజలు, కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో ఉన్న సమాచారాన్ని గుణగ్రహిస్తారు. యెహోవా అనుగ్రహం పొందాలని నిరీక్షిస్తున్న వారికి అవసరమైన ఆత్మీయాహారాన్ని నిజంగా ఈ పత్రికలు దయచేస్తాయి. కాబట్టి, పత్రికల యెడల శ్రద్ధకల్గి, మీ ప్రాంతంలో ఈ విలువైన పత్రికలను పంచిపెట్టే కార్యక్రమాన్ని వృద్ధిచేసే మార్గాలను వెదకండి.