“ఇంకొకసారి” వినడానికి వారికి సహాయం చేయండి
1 “దీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.” (అపొ. 17:32) మార్స్ కొండపై పౌలు యిచ్చిన ప్రసిద్ధిగాంచిన ప్రసంగంయెడల కొందరి ప్రతిస్పందన అది. అలాగే నేడు కూడా, మన మొదటి సందర్శనంలో మనం పంచుకొనిన రాజ్య వర్తమానాన్ని గూర్చి ఎక్కువగా వినడానికి కొందరు యిష్టపడతారు.
2 ఆసక్తిని రేకెత్తించడానికి మనం పునర్దర్శనం చేసేటప్పుడు ఎక్కువగా బోధిస్తాం. మనం అనుకూలమైన ఫలితాలు పొందడానికి మంచి సిద్ధపాటు సహాయపడుతుంది. పాఠశాల నిర్దేశక పుస్తకం (ఆంగ్లం) 51 వ పేజీ యీ విధంగా సిఫారసు చేస్తుంది: “మొదట, సమాచారాన్ని బలపర్చే స్పష్టమైన వాదనలను మనస్సులో ఉంచుకోండి. అది ఎందుకు అలాగుందో అర్థం చేసుకోండి. సమాచారాన్ని మీ స్వంత మాటల్లో చెప్పగలరేమో చూడండి. లేఖనాధార రుజువులను బాగా అర్థం చేసుకోండి. లేఖనాలను ఫలవంతంగా అన్వయించడానికి సిద్ధపడండి.”
3 మీరు “బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా?” అనే పుస్తకాన్ని అందించినట్లయితే, యీ విధంగా ప్పవచ్చు:
◼ “మనం క్రితం మాట్లాడుకున్నప్పుడు, బైబిలునందు మనం నమ్మకముంచగలగడానికి గల కారణాలను గూర్చి చర్చించుకున్నాము. నేను మీకిచ్చిన పుస్తకము “బైబిలును ఎందుకు చదవాలి?” అనే ప్రశ్నను లేవదీస్తుంది. [పేజీ 5 లోని ఉపోద్ఘాతం చదవండి, చివరి ప్రశ్నకు జవాబు చెప్పనివ్వండి.] యావత్ మానవజాతిని కలవరపెట్టే సమస్యలను దేవుడు తానే త్వరలోనే పరిష్కరిస్తాడని బైబిలు చెబుతుంది, అలాగే, ఆ సంతోషకరమైన సమయంలో ఆశీర్వాదాలను అనుభవించడానికి మనం నడవవలసిన మార్గంలో మనలను నడిపిస్తుంది. [కీర్తన 119:105 చదవండి.] వ్యక్తిగత, కుటుంబ బైబిలు పఠనానికి సహాయంగా యీ పుస్తకం తయారుచేయబడింది. దీన్ని ఎలా ఉపయోగించాలో మీకు చూపించడంలో నేను సంతోషిస్తాను.”
4 “మీరు బైబిలును ఎందుకు నమ్మగలరు,” అనే కరపత్రం అందించినచోట పునర్దర్శనం చేసినప్పుడు మీర యిలా ప్పవచ్చు:
◼ “భవిష్యత్తులో ఏమి జరుగుతుందనే విషయంలో మనకందరికీ ఆసక్తి ఉంది. ప్రస్తుత లోక పరిస్థితుల దృష్ట్యా, ఏమి జరుగుతుందని మీరనుకుంటున్నారు? [జవాబివ్వనివ్వండి.] ఏమి జరుగుతుందో మానవుడు కేవలం ఊహించగలడు గాని, ఏమి జరుగనున్నదో దేవునికే కచ్ఛితంగా తెలుసు. [యెషయా 46:10 చదవండి.] మనం త్వరలోనే పరదైసులోని కొత్త లోకంలోని ఆశీర్వాదాలను అనుభవిస్తామని బైబిలు ప్రవచిస్తుందని తెలుసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు. [4 వ పుటలోని మూడవ పేరాను చదవండి.] ఈ అద్భుతమైన వాగ్దానాన్ని గూర్చి మరింత ఎక్కువగా నేను చెబుతాను.”
5 ఒక పుస్తకాన్ని లేదా “మన సమస్యలు” వంటి బ్రోషూర్ను యిచ్చినచోట పునర్దర్శనం చేసినట్లయితే, బహుశా కింది సలహా మీకు ప్రయోజనకంగా ఉండవచ్చు:
◼ “ఈ మధ్యే, బైబిలు ఆధారిత ప్రచురణను మీకిచ్చి వెళ్ళాను, అలాగే దాన్ని చక్కగా ఉపయోగించుకోడానికి సహాయపడేందుకు, మళ్ళీ వస్తానని మాటిచ్చాను. ఇతరులతో స్నేహబంధాన్ని కాపాడుకోడం మన అనేక సమస్యలకు ఒక పరిష్కార మార్గము. మనం దీనిని ఎలా చేయవచ్చో చూపించే మంచి సలహా బైబిలులో ఉంది, మరి నూతనలోక అనువాదములో మనకవసరమైనది కనుక్కోడం చాలా సులభం. [పేజీ 1595 లో “ప్రేమ(లు)” అనే శీర్షిక క్రింద చూడండి. మొదటి కొరింథీయులు 13:4; కొలొస్సయులు 3:14; 1 పేతురు 4:8 వంటి లేఖనాలవైపు శ్రద్ధ మళ్ళించండి. ఈ సూత్రాలను పాటించడం మంచి ఫలితాలను ఎలా తేగలదో క్లుప్తంగా వివరించండి.] మన సమస్యలకు బైబిలు ఆచరణాత్మకమైన పరిష్కారమార్గాలను ఎలా యిస్తుందో చూపించడానికి యిదొక ఉదాహరణ. ఈసారి, సంతోషాన్ని, మనశ్శాంతిని కనుగొనడంలో బైబిలు మనకెలా సహాయపడగలదో చూపించే మరొక మార్గాన్ని తెలపడానికి యిష్టపడుతున్నాను.”
6 మనం యితరులకు అందించగల దేవుని వాక్యాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానానికి మించిన నిధి వేరే ఏదీ లేదు. అలాంటి జ్ఞానం యెహోవా భయాన్ని బోధించగలదు, నిత్యమైన ఆశీర్వాదాలను తెచ్చే ఆయన మార్గంలో నడవడానికి అది ప్రజలను ప్రోత్సహించగలదు.—సామె. 2:20, 21.