సన్నిహితంగా అనుసరించడానికి ఒక మాదిరి
1 నిస్సందేహంగా, జీవించినవారిలోకెల్లా యేసు మహాగొప్ప మనిషి. ఆయన తన శిష్యులకొరకు పరిపూర్ణమైన మాదిరినుంచాడు. మనం ఆయన పరిపూర్ణస్థాయికి సరితూగలేకపోయినప్పటికీ, మనం ‘ఆయన అడుగుజాడలయందు నడుచుకోవాలని’ పురికొల్పబడుతున్నాము. (1 పేతు. 2:21) ఆసక్తితో సత్యాన్ని యితరులతో పంచుకుంటూ, మనకు సాధ్యమైనంత వరకు యేసులా ఉండేందుకు కోరుకోవాలి.
2 యేసు కేవలం ప్రసంగీకుడు కాదు; ఆయన మహాగొప్ప బోధకుడు. ‘జనసమూహములు ఆయన బోధించే విధానమునకు ఆశ్చర్యపడుచుండిరి.’ (మత్త. 7:28) ఆయన ఎందుకంత ప్రభావవంతంగా ఉన్నాడు? ‘ఆయన బోధించే విధానమును’ సరిగ్గా పరిశీలిద్దాము.
3 మనం యేసును ఎలా అనుసరించగలము: యేసుకు ఆయన తండ్రి నేర్పించాడు. (యోహా. 8:28) యెహోవాను ఘనపరచి, ఆయన నామాన్ని మహిమపరచాలనేదే ఆయన ఉద్దేశం. (యోహా. 17:4, 26) మన ప్రకటన పనిలోను, బోధనలోను మనవైపు శ్రద్ధనాకర్షించాలని కాక, యెహోవాను ఘనపరచాలనేది కూడా మన ఉద్దేశమై ఉండాలి.
4 యేసు నేర్పించిన ప్రతిదీ దేవుని వాక్యంపై ఆధారపడినదే. ఆయన ప్రేరేపిత లేఖనాల్లో వ్రాయబడిన దానిని ఎడతెగక సూచించాడు. (మత్త. 4:4, 7; 19:5; 22:32) బైబిలు వైపుకు మన శ్రోతల శ్రద్ధ మళ్ళించాలని కోరుకుంటాం; అలా మనం ప్రకటించేది, బోధించేది మిక్కిలి అధికారపూర్వకమైన దానిపై ఆధారపడినదని వారు తెలుసుకోడానికి అనుమతిస్తాము.
5 యేసు క్లుప్తమైన, ఆచరణయోగ్యమైన, జటిలముకాని రీతులను ఉపయోగించాడు. ఉదాహరణకు, మనం దేవుని క్షమాపణను ఎలా పొందగలమో వివరిస్తూ, మనం యితరులను క్షమించాలని ఆయన ప్రోత్సహించాడు. (మత్త. 6:14, 15) మనం సరళమైన, సూటైన పదాల్లో రాజ్య వర్తమానాన్ని వివరించడానికి ప్రయత్నం చేయాలి.
6 యేసు యితరులను ఆలోచింపజేసే దృష్టాంతాలను, ప్రశ్నలను నైపుణ్యంగా ఉపయోగించాడు. (మత్త. 13:34, 35; 22:20-22) సామాన్యమైన, దైనందిన విషయాలను గూర్చిన దృష్టాంతాలు, సంకీర్ణమైన బైబిలు సిద్ధాంతాలను అర్థం చేసుకోడానికి ప్రజలకు సహాయపడగలవు. వినేదానిని గూర్చి యోచించడానికి శ్రోతలను ప్రోత్సహించే ప్రశ్నలను మనం అడగాలి. నడిపింపునిచ్చే ప్రశ్నలు వారు సరైన నిర్ధారణకు రావడానికి వారికి సహాయపడగలవు.
7 ఎక్కువ సమాచారాన్ని కోరిన వారికి క్లిష్టమైన విషయాలను వివరించేందుకు యేసు సమయాన్ని వెచ్చించాడు. ఆయన శిష్యులవలె, నిజంగా ఆసక్తిగలవారు యేసు బోధించినవాటి భావాన్ని గ్రహించగలిగారు. (మత్త. 13:36) యథార్థంగా ప్రశ్నలు అడగబడినప్పుడు మనం కూడా సహాయపడేవారిగా ఉండాలి. మనకు జవాబులు తెలియనట్లయితే, మనం ఆ అంశాన్ని గూర్చి పరిశోధన జరిపి, ఆ సమాచారంతో మరొక సమయంలో పునర్దర్శనం చేయగలము.
8 యేసు బోధించడానికి ప్రత్యక్ష దృష్టాంతాలను ఉపయోగించాడు. ఆయన తన శిష్యులకు యజమానుడైనప్పటికీ, తాను వారి కాళ్ళను కడగడం దీనికొక ఉదాహరణ. (యోహా. 13:2-16) మనం దీన స్వభావాన్ని చూపిస్తే, బోధించబడేవారు తాము నేర్చుకుంటున్నవాటిని అన్వర్తించుకోడానికి పురికొల్పబడుతారు.
9 ప్రజల హృదయాన్ని, నీతియెడల వారికి గల ప్రేమను యేసు ఆకర్షించాడు. మనం హృదయాలను కూడా చేరాలని కోరుకుంటాం. అత్యున్నతుడ్ని ఆరాధించాలని, యితరులతో సమాధానంగా, సంతోషంగా కలిసి జీవించాలనే జన్మసిద్ధమైన కోరికను రేకెత్తించడానికి మనం ప్రయత్నం చేస్తాము.
10 డిశంబరులో, జీవించిన వారిలోకెల్లా మహా గొప్ప మనిషి అనే పుస్తకాన్ని అందించడం ద్వారా యేసును గూర్చి మనం నేర్చుకున్న విషయాలను యితరులతో పంచుకోగలము. యేసు బోధనా విధానాలను మనం అనుకరించడం ద్వారా, మనం ఆయన బోధించినవాటిని వివరిస్తుండగా, యథార్థవంతులు వినడానికి పురికొల్పబడవచ్చు.—మత్త. 10:40.