మీరు కనుగొన్న ఆసక్తిని పెంపొందింపజేయండి
1 ఇంటింటి పరిచర్యలో పాల్గొనేటప్పుడు, సర్వసాధారణంగా మనము ఆసక్తిగల వ్యక్తితో గడపటానికి పరిమితమైన సమయాన్నే కలిగి ఉంటాము. అనేక సందర్భాల్లో నిజమైన బోధనా పని మనము పునర్దర్శనాలు చేసి, బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నప్పుడే జరుగుతుంది. (మత్త. 28:19, 20) పునర్దర్శనములో ప్రభావవంతముగా బోధించాలంటే, మొదటి దర్శనంలో మనము ఏమి చర్చించామో దాన్ని మనము పునర్విమర్శ చేసుకుని, ఇంకా చర్చను కొనసాగించటానికి సిద్ధపడడం అవసరము.
2 మీరు కుటుంబ ఏర్పాటులోగల అస్థిరత గురించి మాట్లాడినట్లయితే, “నిరంతరము జీవించగలరు” అనే పుస్తకంలోని 29వ అధ్యాయంలోని అంశాన్ని మీరు ఉపయోగించవచ్చు. మీరిలా ప్పవచ్చు:
◼ “క్రితంసారి వచ్చినపుడు ఒక సంతోషకరమైన కుటుంబ జీవితం కావాలనుకుంటే బైబిలు సలహాను అనుసరించడంలోగల జ్ఞానాన్ని గురించి మనం మాట్లాడుకున్నాము. నేడు కుటుంబాలను ఐక్యపర్చాలంటే దానికిగల కీలకమేదని మీరు భావిస్తున్నారు?” జవాబివ్వనివ్వండి. పుట 247లోని పేరా 27ను వివరిస్తూ, కొలొస్సయులు 3:12-14 చదవండి. నిజమైన ప్రేమ కుటుంబాలను ఎలా ఐక్యపర్చగలదో చూపిస్తూ ఇంకా కొన్ని వ్యాఖ్యానాలు చేయండి. సమస్యలను పరిష్కరించుకోటానికి నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని క్రమానుగుణంగా పఠనం చేయటం ఎలా సహాయపడగలదో వివరించండి.
3 క్షీణిస్తున్న ప్రపంచ పరిస్థితులనుగూర్చి మొదటి దర్శనంలోనే మీరు చర్చించినట్లయితే, ఈ విధంగా చెబుతూ మీరు దానిని కొనసాగించవచ్చు:
◼ “మనమందరమూ శాంతిగా జీవించాలంటే గొప్ప మార్పులు అవసరమని మీరు అంగీకరిస్తారని నేను నమ్ముతున్నాను. మన సమస్యలన్నిటికీ ముఖ్య కారణం సాతాను అని బైబిలు చూపుతుంది. దేవుడు అతడ్ని ఇంతకాలం కొనసాగడానికి ఎందుకు అనుమతించాడు అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. మీరేమని భావిస్తారు?” జవాబివ్వనివ్వండి. నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలోని 20వ పుటకు త్రిప్పి, 14 మరియు 15పేరాలను చూపుతూ సాతాను ఇంకా ఎందుకు నాశనము చేయబడలేదో వివరించండి. తర్వాత రోమీయులు 16:20 ను చదవండి, సమీప భవిష్యత్తునందు ఏమి జరుగుతుందని మనము ఎదురుచూడవచ్చో అది చూపుతుంది.
4 మీరు రాజ్య పరిపాలన క్రింద వచ్చే ఆశీర్వాదాలనుగూర్చి మాట్లాడినట్లయితే, మీ పునర్దర్శనమునందు, ఇలా ప్పవచ్చు:
◼ “దేవునిరాజ్యం భూమికి మరియు మానవజాతికి అద్భుతమైన ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. ఈ ఆశీర్వాదాలు 12 మరియు 13పుటలనందు ఎంతో చక్కగా ఉదాహరించబడ్డాయి. మీరు చూస్తున్న దానిలో మీకు ఏది ఆసక్తికరంగావుంది? [జవాబివ్వనివ్వండి.] ఇటువంటి లోకంలో జీవించడం ఎలా ఉంటుందో ఆలోచించండి.” పేరా 12ను పఠించండి. ఆసక్తివున్నట్లయితే, 13వ పేరానందలి ప్రశ్నను అడిగి, సమాధానాన్ని చర్చించండి. ఈ అధ్యాయం రాజ్య ఆశీర్వాదాలనుగూర్చిన అనేక ప్రశ్నలకు సమాధానాలను ఇస్తుందని, దానిని మరొక దర్శనమందు చర్చించడానికి మీరు ఇష్టపడుతున్నారని చెప్పండి.
5 మీరు ఇలా చెప్పడం ద్వారా బైబిలు పఠనాన్ని ప్రారంభించగలుగుతారు:
◼ “అనేకమంది ప్రజలు ఈ పుస్తకాన్ని ఉపయోగించడంద్వారా తమకుగల బైబిలుప్రశ్నలకు సమాధానాలను కనుగొన్నారు.” విషయసూచికకు త్రిప్పి, ఇలా అడగవచ్చు: “మీకు ఇక్కడున్న ఏ అంశము ఎక్కువ ఆసక్తికరంగావుంది?” జవాబు చెప్పనివ్వండి, వాళ్లకు ఆసక్తికరంగా అనిపించిన అధ్యాయానికి త్రిప్పి, మొదటి పేరాను చదవండి. ప్రతి పేరానందలి ముఖ్యాంశాలను ప్రతి పుటలో క్రింద ఇవ్వబడిన ప్రశ్నలు ఎలా ఉన్నతపరుస్తాయో వివరించండి. ఒకటి లేక రెండు పేరాలను చర్చించడంద్వారా వివరించిన తరువాత, మరలా ఒకసారి కలిసి మాట్లాడటానికి ఏర్పాట్లు చేయండి.
6 నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలో కనుగొన్న ఆసక్తిని పెంపొందింపజేయడం మన పరిచర్యను పూర్తిగా నెరవేర్చాలనే మన కోరికను చూపిస్తుంది. (2 తిమో. 4:5) మన శ్రోతలు నిత్యజీవానికి చేరటానికి మనం సహాయం చేయవచ్చు.—యోహా 17:3.