నవంబరు కొరకైన సేవా కూటాలు
నవంబరు 7 తో ప్రారంభమయ్యే వారం
పాట 4 (119)
10 నిమి: స్థానిక ప్రకటనలు, మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసిన ప్రకటనలు. కొత్త పత్రికలను అందించడానికి, ఒకటి రెండు ఉపయోగపడే మాట్లాడగల అంశాలను ఒక్కో పత్రికనుండి పేర్కొనండి.
18 నిమి: “దేవుని వాక్యం శక్తి గలది.” ప్రశ్నా జవాబులు. ప్రతిదినము లేఖనాలను పరిశీలించుట—1994 లోని ముందుమాట ఆధారంగా క్రమంగా బైబిలు చదవవలసిన ప్రాముఖ్యతపై వ్యాఖ్యానాలను కూడా చేర్చాలి.
17 నిమి: “బైబిలు—కలతలు గల లోకంలో ఓదార్పుకు మరియు నిరీక్షణకు మూలము.” ప్రేక్షకులతో చర్చించండి. సూచించబడిన సమాచారాన్ని ఎలా ఉపయోగించవచ్చో చూపించే రెండు ప్రదర్శనలను ఏర్పాటు చేయండి.
పాట 24 (70) ముగింపు ప్రార్థన.
నవంబరు 14తో ప్రారంభమయ్యే వారం
పాట 25 (30)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు మరియు చందా వివరాలేవైనా ఉంటే వాటిని చదవండి. వారాంతంలో ప్రాంతీయ సేవా కార్యక్రమాల ఏర్పాట్లను పునఃసమీక్షించండి.
17 మిని: “మీరు ఎలాంటి ఆత్మను కనబరుస్తారు?” ఒక ప్రసంగం. కావలికోట జూన్ 15, 1977, 369 వ పేజీ, 4, 5 పేరాల్లోని వ్యాఖ్యానాలు కూడా చేర్చండి.
18 నిమి: “మన రాజ్య ప్రకటనను మెరుగుపరచుకొనే మార్గాలు.” ప్రశ్నా జవాబులు. మన రాజ్య పరిచర్యలో యివ్వబడిన సలహాలు మంచి ఫలితాలతో ఎలా ఉపయోగించబడ్డాయో వివరించే ప్రేక్షకుల అనుభవాలను చెప్పనివ్వండి.
పాట 37 (24) ముగింపు ప్రార్థన.
నవంబరు 21 తో ప్రారంభమయ్యే వారం
పాట 40 (18)
12 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రశ్నాభాగము. ఒక ప్రసంగము. సమాచారాన్ని ఆ ప్రాంతానికి అన్వయించండి.
15 నిమి: స్థానిక అవసరాలు. లేక ఓ పెద్ద సెప్టెంబరు 1, 1994, కావలికోట, (పక్షపత్రికలు) 29 వ పేజీలోని “మీ పరిశుద్ధ సేవను గుణగ్రహించండి” అనే అంశంపై ఆధారపడిన ప్రసంగాన్ని యిస్తాడు.
18 నిమి: “‘ఇంకొకసారి’ వినడానికి వారికి సహాయం చేయండి” ప్రేక్షకులతో చర్చించండి. పఠనం ఆరంభించేటప్పుడు బైబిలును ఎలా ఉపయోగించవచ్చో చూపించే బాగా సిద్ధపడిన రెండు ప్రదర్శనలు ఉండాలి.
పాట 52 (59) ముగింపు ప్రార్థన.
నవంబరు 28 తో పారభమ వార
పాట 58 (61)
10 నిమి: స్థానిక ప్రకటనలు. కొత్త పత్రికలను అందించే మార్గాలను ప్రదర్శించండి.
17 నిమి: “ఇతరులతో కలిసి పనిచేయడం వలన వచ్చే ఆశీర్వాదాలు.” ప్రశ్నా జవాబులు. ఎల్లవేళలా తమంతట తాము వ్యక్తిగతంగా ప్రాంతీయ పరిచర్యకు ఏర్పాట్లు చేసుకునే బదులు, సంఘం ఏర్పాటు చేసిన సేవ కొరకైన కూటాలకు మద్దతునివ్వాలని అందరినీ ప్రోత్సహించండి. ఒక గుంపుతో కలిసి పనిచేయడం వలన అదనపు ఆశీర్వాదాలు, మరింత ఫలభరితమైన సేవ, పరస్పరం ప్రోత్సాహం లభిస్తాయి.
18 నిమి: డిశంబరులో మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని అందించడం. ఈ పుస్తకము అవసరం చాలా ఉంది. అనేకమంది ప్రజలు యేసు అనుచరులని చెప్పుకుంటున్నారు, మరియు ఆయన బోధించినవాటిని నమ్ముతున్నామని వాదిస్తారు, కాని ఇతర మానవుల నుండి ఆయనను ప్రత్యేకపరచినది ఏదని ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన అవసరం ఉంది—దాని పై వారి రక్షణ ఆధారపడి ఉంది. మహాగొప్ప మనిషి అనే పుస్తకం 133 వ అధ్యాయం యిలా చెబుతుంది: “ఆయన ఉత్కృష్టమైన ధైర్యమును, పురుషోచితత్వమును, ఆయన అసమానమైన జ్ఞానమును, బోధకునిగా ఆయన శ్రేష్ఠమైన సామర్థ్యమును, ఆయన సాహసవంతమగు నాయకత్వమును, ఆయన మృదువైన కనికరము మరియు సహానుభూతిని మనమాలోచించినప్పుడు మనహృదయములు కదిలింపబడును.” బైబిలు ఆయనను (1) ఒక సాక్షిగా (యోహాను 18:37), (2) ఒక రక్షకునిగా (అపొ. 4:12), (3) ఒక రాజుగా (ప్రక. 11:15) స్పష్టంగా గుర్తిస్తుంది. సామర్థ్యంగల ఒక ప్రచారకుడు యీ అంశాలలో కొన్నింటిని ఉపయోగిస్తూ బోధించడాన్ని ప్రదర్శించాలి. డిశంబరులో యీ పుస్తకాన్ని అందించడంలో అందరూ పాల్గొనాలని ప్రోత్సహించండి.
పాట 61 (13) ముగింపు ప్రార్థన.