బిలు—కలతలు గల లోకంలో ఓదార్పుకు మరియు నిరీక్షణకు మూలము
1 ఈ లోకం మానవజాతిని భయంకరమైన ఒత్తిళ్ళలోను, ఓదార్పు మరియు నిరీక్షణల అవసరతలోను ఉంచుతుంది. బైబిలు మాత్రమే యథార్థమైన ఓదార్పుకు మూలము. అది నీతియుక్తమైన కొత్త లోకం కొరకైన నిరీక్షణను అందిస్తుంది. (రోమా. 15:4; 2 పేతు. 3:13) అంతర్దృష్టి (ఆంగ్లంలో) పుస్తకం సంపుటి 1, పుట 311 యీ విధంగా చెబుతుంది: “బైబిలు లేకుండా మనం యెహోవాను తెలుసుకునేవారంకాము, క్రీస్తు విమోచనా క్రయధన బలినుండి లభించే అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకొని ఉండేవారంకాము, దేవుని నీతియుక్తమైన రాజ్యంలో లేదా దాని క్రింద నిత్యజీవాన్ని పొందడానికి మనం చేయవలసిన వాటిని గురించి అర్థం చేసుకొని ఉండేవారంకాము.”
2 లోకంనుండి వచ్చే ఒత్తిళ్ళను ఎదుర్కోవడానికి ప్రజలకు సహాయం చేయడంలో దేవుని వాక్యమైన బైబిలు వహించే పాత్రపై మనం నవంబరులో ప్రత్యేక శ్రద్ధను ఉంచుతాము. మనం సాధ్యమైనప్పుడెల్లా, పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదమును, అలాగే బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? అనే పుస్తకాన్ని అందిస్తాము. బైబిలు విలువను గుణగ్రహించడానికి నిజంగా సుముఖతగల వ్యక్తులకు సహాయం చేయడానికి మనం ఏమి చెప్పగలము?
3 మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్న తర్వాత, మీరు యిలా ప్పవచ్చు:
◼ “మనశ్శాంతిని కోల్పోవడానికి కారణమయ్యే సమస్యలు మన చుట్టూ ఉన్నాయని మీరు అంగీకరించవచ్చు. ఈ సమస్యలను ఎలా అధిగమించవచ్చో తెలిపే ఆచరణాత్మకమైన సలహాను మనమెక్కడ కనుగొనగలము? [జవాబు చెప్పనివ్వండి.] మనం సంతోషంగా ఎలా ఉండగలమో బైబిలు బోధిస్తున్నందున అది విశ్వసింపదగినదని నేను కనుగొన్నాను. [లూకా 11:28 చదవండి.] బైబిలు చదవమని, దాని మార్గనిర్దేశాలనుండి ప్రయోజనం పొందమని ప్రజలను ప్రోత్సహించడమే మా పరిచర్య ఉద్దేశం. మీరలా చేయడానికి, బైబిలు పఠన సహాయకమైన బిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? అనే పుస్తకము సహాయపడగలదు. అలా మీకు ప్రయోజనం చేయగలదు. లోకములోని అనేక సమస్యల కారణాన్ని గూర్చి అది ఏమి చెబుతుందో గమనించండి.” [పేజీ 187, 9 వ పేరాలోని, రెండవ వాక్యాన్ని చదవండి.] ప్రభుత్వము, మరియు మన సమస్యలు అనే బ్రోషూర్లను లేదా నిజమైన శాంతి భద్రతలు అనే పుస్తకాన్ని కూడా యీ విధంగా అందించవచ్చు.
4 మీరిలాంటి సరళమైన విధానాన్ని ఉపయోగించడానికి ఎంపిక చేసుకోవచ్చు:
◼ “దేవుని వాక్యమైన బైబిలు యెడల ప్రగాఢమైన గౌరవాన్ని కలిగించడంలో మాకు ఆసక్తి ఉంది. మీరెందుకు బైబిలును నమ్మగలరు అనే యీ కరపత్రాన్ని మీకివ్వడానికి మేము యిష్టపడుతున్నాము. శ్రేష్ఠమైన లోకం కొరకైన కచ్ఛితమైన నిరీక్షణను పొందడానికి మనమెందుకు బైబిలును చూడగలమో యిది వివరిస్తుంది. [ఆరవ పేజీ తీసి చివరి పేరాలో కీర్తన 37:29 చెబుతున్నది చదవండి.] మీరు యీ కరపత్రాన్ని వ్యక్తిగతంగా చదవండి, మరి నేను తర్వాత వచ్చినప్పుడు, బైబిలు అందించే నిరీక్షణను గురించి మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి.”
5 తగిన చోట, మీరు బిలు పఠనం ఆరంభించేందుకు సూటియైన యీ విధానాన్ని ఉపయోగించవచ్చు:
◼ “మీకు ఉచిత గృహ బైబిలు పఠన పద్ధతిని అందించాలని నేను వచ్చాను. బైబిలు దైవావేశము గలది, అలాగే తప్పు దిద్దుకోడానికి దాని మార్గనిర్దేశం సహాయపడగలదు. ఆధునిక భాషలోని పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము వ్యక్తిగత పఠనం కొరకు తయారు చేయబడింది. మీరు దీన్నెలా ఉపయోగించగలరో నేను క్లుప్తంగా చూపిస్తానండి. [పేజీ 1653 తీసి, 23ఎ వైపు శ్రద్ధ మళ్ళించండి. ఉదాహరించబడ్డ రెండో మూడో లేఖనాలను చూడండి. ఉదాహరించబడిన లేఖనాలను చూడడం వలన దేవుని రాజ్యం ద్వారా ఆయన నెరవేర్చాలని సంకల్పించినది ఎలా వెల్లడి అవుతుందో వివరించండి.] నేను మళ్ళీ వచ్చి యీ రాజ్య నిరీక్షణను గూర్చి చర్చించడానికి సంతోషిస్తాను.”
6 బైబిలు ఓదార్పుకు, నిరీక్షణకు అలాగే, నిత్యజీవానికి నడిపే సత్యానికి మూలము. (యోహాను 17:3, 17) బైబిలు జ్ఞానాన్ని యితరులతో పంచుకోవడం “మనుష్యులందరు రక్షణపొంది . . . యుండవలెనని యిచ్ఛయించు” యెహోవాను ప్రీతిపరుస్తుంది.—1 తిమో. 2:4.