మీ సొంత పత్రికా అందింపులను సిద్ధం చేసుకోండి
1 ప్రపంచ వివాదాంశాలు మొదలుకొని “దేవుని మర్మముల” వరకు ప్రతి దానిని గూర్చిన కాలోచితమైన, జ్ఞానాన్నందించే కావలికోట, తేజరిల్లు! పత్రికల్లోని శీర్షికలనుబట్టి మనం ఆ పత్రికలను ప్రశంసిస్తాం. (1 కొరిం. 2:10) సత్యాన్ని క్రమంగా బయల్పరచడంలో యెహోవా ఉపయోగిస్తున్న ఈ పత్రికల్లో మనం చదివిన క్రొత్తవి మరియు నిర్మాణాత్మకమునైన అనేక విషయాలను మనమందరం జ్ఞాపకం చేసుకుంటాం. (సామె. 4:18) మనం ప్రతి అవకాశంలోను విడి ప్రతులను అలాగే చందాలను ప్రతిపాదించడం ద్వారా వాటిని సాధ్యమైనంత విస్తృతంగా పంపకం చేయాలనే ఆతురతతో ఉండాలని మనం ఆశిస్తాం.
2 మీ ప్రదేశాన్ని విశ్లేషించండి: మీ ప్రాంతంలో ఎలాంటి ప్రజలు నివసిస్తారు? వారు ఎప్పుడూ తొందరలోనే ఉంటున్నట్లయితే మీరు క్లుప్తమైన, సంక్షిప్తమైన అందింపును సిద్ధం చేసుకోవలసిన అవసరం ఉండవచ్చు. అంత తొందరలో ఉండని ప్రజలుగల ప్రాంతం మీకున్నట్లయితే మీరు కొంచెం ఎక్కువ చెప్పగల్గవచ్చు. చాలా మంది గృహస్థులు పగటి సమయంలోనే పని చేస్తున్నట్లయితే, మీరు మధ్యాహ్నం తర్వాత, లేదా సాయంకాలం వారిని సందర్శిస్తే మీరు ఇంకాస్త సఫలతను పొందవచ్చు. పగటి సమయంలో వీధి సాక్ష్యం లేదా అంగడంగడి పరిచర్య చేయడం ద్వారా మీరు కొందరిని కలవవచ్చు. కొందరు ప్రచారకులు బస్ స్టాండ్ల దగ్గర లేదా రైల్వే స్టేషన్లలో లేదా పార్క్‌లలో ఉన్న ప్రజలను అనియతంగా సమీపించి మంచి ఫలితాలను పొందుతారు.
3 పత్రికలతో మీరు బాగా పరిచయం చేసుకోండి: మీరు ప్రతి సంచికను అందుకున్న వెంటనే చదవండి. మీ ప్రదేశంలోని ప్రజలకు ఆకర్షణీయంగా ఉంటుందని మీరు తలంచే శీర్షికలను ఎంపిక చేసుకోండి. ఏ విషయాలు వారిని ప్రభావితం చేస్తాయి? మీరు విశేషంగా చూపాలని పథకం వేసుకుంటున్న శీర్షిక నుండి ఉదాహరించగల ఒక ప్రత్యేక అంశం కోసం చూడండి. ఆసక్తిని రేకెత్తించేందుకు మీరు వేయగల ప్రశ్నను గూర్చి ఆలోచించండి. మీకు చదివే అవకాశం లభించేటట్లయితే గృహస్థునికి చదివి వినిపించేందుకు ఒక కాలోచిత లేఖనాన్ని ఎంచుకోండి. గృహస్థుడు చందా కట్టడానికి అంగీకరించేలా పురికొల్పేందుకు మీరు ఏమి చెబుతారు, పునర్దర్శనానికి మీరెలా పునాది వేయవచ్చు అనే విషయాలను గూర్చి ఆలోచించండి.
4 మీ ప్రారంభ మాటలను సిద్ధం చేసుకోండి: మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునేందుకు మరియు సంభాషణను ఆరంభించేందుకు మీరు ఉపయోగించే మాటలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. “నేను ఈ పత్రికలో ఒక ఆసక్తికరమైన శీర్షికను చదివాను, దానిని ఇతరులతో పంచుకోవాలని కోరుకుంటున్నాను” అనే ప్రారంభ మాటలతో కొందరు సఫలతను పొందారు. చాలా మంది తాము ఉపయోగించాలనుకున్న సంభాషణా అంశంపై కేంద్రీకృతమయ్యే ప్రశ్నతో ప్రారంభిస్తారు. ఉదాహరణకు:
5 నేరాల ప్రాబల్యాన్ని గూర్చిన శీర్షికను ఉన్నతపరుస్తున్నట్లయితే మీరు ఈ విధంగా అడగవచ్చు:
◼ “దోచుకోబడతామనే లేదా హాని జరుగుతుందనే భయం లేకుండా మనం రాత్రి నిద్రపోగలిగేందుకు ఏమి అవసరమౌతుంది?” ఈ సమస్యకుగల పరిష్కారాన్ని గూర్చిన కొంత సమాచారం మీ దగ్గర ఉందని వివరించండి. ఆ పరిష్కారం త్వరలో మరే విధమైన సామాజిక క్రమరాహిత్యాన్ని కూడా తీసివేస్తుంది. అలాంటి ఒక నిరీక్షణను అందించే దేనినైనా పత్రికలో నుండి చూపించండి. మీరు తిరిగి వెళ్ళినప్పుడు జ్ఞానము పుస్తకంలోని 1వ అధ్యాయం వైపుకు గృహస్థుని శ్రద్ధను మళ్ళించగలరు.
6 కుటుంబ జీవితాన్ని గూర్చిన ఒక శీర్షికను ప్రతిపాదించేటప్పుడు మీరీ విధంగా చెప్పవచ్చు:
◼ “ఈ రోజుల్లో కుటుంబాన్ని పోషించడం నిజమైన సవాలు అని చాలా మంది తలిదండ్రులు కనుగొంటారు. చాలా పుస్తకాలు ఆ అంశంపై వ్రాయబడ్డాయి, నిపుణులకు కూడా ఏకాభిప్రాయం లేదు. నమ్మదగిన నడిపింపును ఇవ్వగల వారెవరైనా ఉన్నారా?” బైబిలులో కనుగొనబడిన జ్ఞానపూర్వక ఉపదేశాన్ని తెలిపే ఏదైన ప్రత్యేక వ్యాఖ్యానాన్ని పత్రిక నుండి చూపించండి. మీరు పునర్దర్శనం చేసేటప్పుడు జ్ఞానము పుస్తకం 145-8 పేజీల్లో చెప్పబడిన పిల్లలను పెంచడాన్ని గూర్చిన లేఖనాధార తలంపులను చర్చించండి.
7 ఒక సామాజిక సమస్యను గూర్చిన శీర్షికను విశేషంగా చూపిస్తూ మీరు ఈ విధంగా చెప్పవచ్చు:
◼ “మనం ఉద్రిక్తతతో కూడిన కాలాల్లో జీవిస్తున్నాం కనుక, చాలా మంది ప్రజలు ఒత్తిడికి గురౌతున్నట్లు భావిస్తారు. మనం ఈ విధంగా జీవించాలని దేవుడు ఉద్దేశించాడని మీరనుకుంటారా?” నేటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చూపించే లేదా చింతలేని భవిష్యత్తు కొరకు ఎదురు చూడడానికిగల కారణాలనిచ్చే ఒక శీర్షికను చూపించండి. మీ తరువాతి సందర్శనంలో, జ్ఞానము పుస్తకంలోని 4-5 పేజీల్లోవున్న చిత్రాన్ని, క్యాప్షన్‌ను చర్చించి, నేరుగా గృహ బైబిలు పఠనానికి నడపండి.
8 గృహస్థునికి తగినట్లుగా మార్చుకోండి: విభిన్న ఆసక్తులు మరియు పూర్వ చరిత్రలుగల ప్రజలను మీరు కలుస్తారు. ప్రతి గృహస్థునికి తగినట్లుగా మీరు సవరింపులు చేసుకోగల ప్రాథమిక అందింపును సిద్ధం చేసుకోండి. మీరు ఒక పురుషునితో, ఒక స్త్రీతో, వయస్సు మళ్ళిన వ్యక్తితో లేదా ఒక యౌవనస్థునితో మాట్లాడేటప్పుడు ఎలా సవరింపులు చేసుకోవాలో సిద్ధంకండి. మీరు ఏమి చెప్పాలి అనే దాని గురించి కచ్చితమైన నియమాలేమీ లేవు. మీకు సౌకర్యప్రదంగా ఉండి, ఫలితాలను తెచ్చేదేదైతే అదే చెప్పండి. అయితే, ఉత్సాహంగా ఉండండి, హృదయపూర్వకంగా మాట్లాడండి, మంచి శ్రోతగా ఉండండి. “నిర్ణయింపబడిన” వారు మీ యథార్థతను గ్రహిస్తారు మరియు అనుకూలంగా స్పందిస్తారు.—అపొ. 13:48.
9 ఒకరికొకరు సహాయం చేసుకోండి: ఒకరితోనొకరు తలంపులను పంచుకోవడం ద్వారా, మనల్ని మనం వ్యక్తీకరించుకునే క్రొత్త మార్గాలను తెలుసుకుంటాము. మనం అందింపులను కలిసి అభ్యాసం చేయడం మనకు అనుభవాన్ని నమ్మకాన్ని ఇస్తుంది. (సామె. 27:17) మీరు చెప్పబోయే దానిని పూర్వాభ్యాసం చేసినట్లయితే, ఇండ్ల ద్వారాల దగ్గర మాట్లాడేటప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. తమ పిల్లలు సిద్ధపడడానికి సహాయం చేసేందుకు, వారు అందింపులను అభ్యసిస్తుండగా ఆలకించేందుకు మెరుగుపరుచుకునేందుకు సలహాలను అందించేందుకు తలిదండ్రులు సమయాన్ని తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. మరింత అనుభవంగల ప్రచారకులతో పనిచేయడం ద్వారా క్రొత్తవాళ్ళు ప్రయోజనం పొందగలరు.
10 మీరు సిద్ధం చేసుకునే మీ సొంత పత్రికా అందింపు క్లిష్టమైనదిగా ఉండక్కర్లేదు. చెప్పేందుకు ప్రత్యేకంగా దేనినైనా మనస్సులో పెట్టుకుని దానిని ఆసక్తికరమైన విధంగా వ్యక్తపరచడమే. ముందంజవేసి, ముందాలోచనతో మంచి ప్రతిస్పందనను తేగల చక్కని అందింపును మీరు తయారు చేసుకోగలరు.
11 ప్రపంచవ్యాప్తంగా రాజ్య వర్తమానాన్ని వ్యాపింపజేయడంలో పత్రికల పంపకం అనేది ప్రథమ మార్గం. మీరు యథార్థపరులైన ప్రజలకు విడి పత్రికలను అందించడమో, వారితో కావలికోట, తేజరిల్లు!లకు చందా కట్టించడమో చేసినట్లయితే పత్రికలే మాట్లాడగలుగుతాయి. వాటి విలువను, వాటి సందేశం జీవితాలను ఎలా కాపాడుతాయనే దానిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ‘ఉపకారమును ధర్మమును చేసే’ ఈ పద్ధతే యెహోవాను చాలా సంతోషింపజేస్తుంది.—హెబ్రీ. 13:16.