మన రాజ్య ప్రకటనను మెరుగుపరచుకొనే మార్గాలు
1 మన ప్రకటన పని యింతకు మునుపెన్నటికన్నా నేడు మరింత అగత్యమై ఉంది. ప్రజలు జీవిస్తారా లేదా మరణిస్తారా అనేది సువార్తయెడల వారి ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుంది. (1 పేతు. 4:5, 6, 17; ప్రక. 14:6, 7) ఈ కారణం వల్లే మనం ఎల్లప్పుడూ రాజ్య ప్రకటన పనిని అభివృద్ధిచేసే మార్గాలకొరకు చూస్తుంటాము. అభివృద్ధిని సాధించడానికి కొన్ని మార్గాలు ఏవి?
2 బాగా సిద్ధపడడం: మన రాజ్య పరిచర్య కొత్త సంచికను ఉపయోగిస్తూ, మీ ప్రాంతంలోని అనేకమంది ప్రజలకు ఆకర్షణీయంగా కనిపిస్తుందని మీరు భావించే సమాచారాన్ని ఎంపిక చేసుకోండి. స్థానిక పరిస్థితులను బట్టి మీ వ్యాఖ్యానాలను మలచుకోవడం ప్రాముఖ్యము. లేక మీరు వ్యక్తిగతంగా ఫలవంతమని తలంచే అంశాలను మరియు లేఖనాలను ఉపయోగిస్తూ మీకై మీరే సమాచారాన్ని తయారు చేసుకోడానికి యిష్టపడవచ్చు. ఆసక్తిని రేకెత్తించే ఉపోద్ఘాతము మీకవసరం. (తర్కించుట (ఆంగ్లంలో) పుస్తకం పేజీలు 9-15 చూడండి.) బహుశా మీరు ఆలోచన రేకెత్తించే ప్రశ్నను అడగాలని లేదా ఆ ప్రాంతంలో ఆసక్తిగల ఏదైనా వార్తపై గృహస్థుణ్ణి వ్యాఖ్యానించమని అడగాలని ముందే నిర్ణయించవచ్చు. మీ మనస్సులో మీరనుకున్న సమాచారం ఉన్నప్పుడు మీ పురోగతి కొరకు సలహాలు యివ్వగల మీ కుటుంబ సభ్యునితో లేదా మరొక ప్రచారకునితో దానిని అభ్యసించండి.
3 ప్రజలతో సంభాషించండి: మన లక్ష్యమేమంటే ప్రాముఖ్యమైన సందేశాన్ని అందించడమే. మనం వినేవారిని అర్థవంతమైన సంభాషణలోకి దించుతూ మనమా విధంగా చేయగలం. గృహస్థుడు అభ్యంతరం చెబుతున్నట్లయితే లేదా అభిప్రాయం చెబుతున్నట్లయితే, అతడు చెప్పదలచుకున్నది శ్రద్ధగా వినండి. అతని అభిప్రాయాలు మీకున్న నిరీక్షణను గూర్చిన లేఖనాధారమైన జవాబివ్వడానికి మీకు తోడ్పడతాయి. (1 పేతు. 3:15) అతని అభిప్రాయం బైబిలుతో ఏకీభవించకపోతే, మీరు యీ విధంగా నేర్పుగా చెప్పవచ్చు: “అనేకమంది ప్రజలు మీలాగే భావిస్తారు. అయినా, యీ విషయాన్ని గూర్చిన మరొక అభిప్రాయం ఉంది.” తగిన లేఖనాన్ని చదవండి అతని అభిప్రాయాన్ని తెలుసుకోండి.
4 మలచుకోగల పట్టికను కలిగి ఉండండి: బాగా సిద్ధపడినప్పటికీ, మీరు ప్రజలతో మాట్లాడలేకపోతే ప్రయోజనమేమీ ఉండదు. నేడు మనం వెళ్ళినప్పుడు యిండ్లలో కొంతమంది గృహస్థులు మాత్రమే ఉండడం సాధారణమే. మీ ప్రాంతంలో పరిస్థితి అదే అయితే, ఇండ్లలో ప్రజలు ఎక్కువగా ఉండే సమయాల్లో ఇంటింటి పరిచర్య చేసేలా మీ పట్టికలో సర్దుబాట్లు చేసుకోడానికి ప్రయత్నించండి. వారాంతాలు, సందర్శించడానికి మంచి సమయమని మీరు తెలుసుకొని ఉండవచ్చు; మరి కొందరిని మిగిలిన రోజుల్లో సాయంకాలాల్లో కలిసే సాధ్యత ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని ప్రాంతాల్లో సెలవు దినాల్లో సాక్ష్యమివ్వడం సులభమని కొందరు ప్రచారకులు తెలుసుకున్నారు, ఎందుకంటే, అప్పుడైతే ప్రజలు యిండ్లలో ఉంటారు. సాధారణంగా ప్రజలందరూ సంతోషకరమైన అవస్థలో ఉంటారు, అలాంటి సమయాల్లో సంభాషించడానికి యిష్టపడతారు. మీ ఉపోద్ఘాతాన్ని సందర్భాన్నిబట్టి మలచుకోవడం అలాగే, మీ అభిప్రాయాలను లేఖనాధార అంశాలతో జోడించడం మంచిది.
5 మీ సమాచారంయొక్క ఉపయోగాన్ని విశ్లేషించండి: ప్రతి యింటి నుండి వచ్చిన తర్వాత, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘నేను గృహస్థుని హృదయాన్ని చేరుకున్నానా? అతని అభిప్రాయాన్ని చెప్పనిచ్చానా, అతడు చెప్పదలచిన దానిని శ్రద్ధగా విన్నానా? నేను నేర్పుగా జవాబిచ్చానా? పరిస్థితుల దృష్ట్యా, నేను సరైన పద్ధతిని అవలంబించానా?’ పరిచర్యలో మీ స్వంత సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు అనుభవంగల ప్రచారకునితో లేదా పయినీరుతో పరిచర్యకు వెళ్ళడం, వారు మాట్లాడే విధానాన్ని జాగ్రత్తగా వినడం సహాయకరంగా ఉండవచ్చును.
6 మీ పనిలో మీరు నిపుణులైతే, మీరు ‘మిమ్మును మీ బోధ వినువారిని రక్షించే’ రాజ్య సత్యాలను పంచుకోగలుగుతారు.—1 తిమో. 4:16; సామె. 22:29.