కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/96 పేజీ 1
  • మనకు ఓ నియామకం ఉంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనకు ఓ నియామకం ఉంది
  • మన రాజ్య పరిచర్య—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిచర్య చేయడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • మంచివార్తను ఎవరు ప్రకటిస్తున్నారు, ఎలా ప్రకటిస్తున్నారు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • “వెళ్లి … శిష్యుల్ని చేయండి”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • యెహోవా ప్రకాశమానమైన రథ కదలికకు అనుగుణ్యముగా నడువుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1996
km 11/96 పేజీ 1

మనకు ఓ నియామకం ఉంది

1 యేసు తన అనుచరులకు, “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అన్న ఆజ్ఞనిచ్చాడు. (మత్త. 28:19) భూవ్యాప్తంగా 232 దేశాల్లోనూ దీవుల్లోనూ, సూమారు యాభై లక్షలకు పైగా యెహోవా స్తుతికర్తలు, యేసు ఆజ్ఞ నెరవేర్పుకు సజీవ సాక్ష్యాన్నిస్తున్నారు. మరి వ్యక్తిగతంగా మన విషయమేంటి? ప్రకటించే పనిని మనం గంభీరమైన విషయంగా తీసుకుంటామా?

2 ఓ నైతిక బాధ్యత: ఓ నియామకం అంటే “నిర్దేశించిన కార్యాలను చేసేందుకు ఇచ్చే ఆజ్ఞ.” ప్రకటించాలని యేసు మనకు ఆజ్ఞనిచ్చాడు. (అపొ. 10:42) అది, సువార్తను ప్రకటించే అవసరతను లేదా నైతిక బాధ్యతను తనపై మోపిందని అపొస్తలుడైన పౌలు గ్రహించాడు. (1 కొరిం. 9:16) దృష్టాంతంగా: మునిగిపోతున్న ఓ ఓడలోని నావిక గణంలో మీరో సభ్యులనుకోండి. ప్రయాణీకులను హెచ్చరించి, ప్రాణరక్షక పడవల వైపుకు వారిని నడిపించమని నాయకుడు మీకు ఆజ్ఞనిస్తాడు. ఆ ఆజ్ఞను అలక్ష్యం చేసి కేవలం మిమ్మల్ని మీరు రక్షించుకోవడంమీదే అవధానముంచుతారా? అలా కానేకాదు. ఇతరులు మీ మీద ఆధారపడి ఉన్నారు. వారి జీవితాలు అపాయంలో ఉన్నాయి. వారికి సహాయం చేయాలని మీకివ్వబడిన నియామకాన్ని నిర్వర్తించాల్సిన నైతిక బాధ్యత మీపై ఉంది.

3 హెచ్చరికనివ్వవల్సిందిగా మనకు దైవిక నియామకం ఇవ్వబడింది. త్వరలోనే యెహోవా ఈ దుష్టవిధానమంతటికీ అంతాన్ని తీసుకొస్తాడు. లక్షలకొలది జీవితాలు త్రాసులో ఊగిసలాడుతున్నాయి. ఇతరులకు కలగబోయే అపాయాన్ని అలక్ష్యం చేసి కేవలం మనలను మనం రక్షించుకోవడంపైనే అవధానముంచడం మనకు తగునా? ఎన్నటికీకాదు. ఇతరుల జీవితాలను రక్షించేందుకు సహాయపడాల్సిన నైతిక బాధ్యత మనపై ఉంది.—1 తిమో. 4:16.

4 అనుసరించేందుకుగల విశ్వసనీయమైన ఉదాహరణలు: అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులకు హెచ్చరికనివ్వాలనే బాధ్యత తన మీద ఉందని ప్రవక్తైన యెహెజ్కేలు భావించాడు. అతను తన పనిని చేయలేకపోయినట్లైతే వచ్చే పరిణామాలను గూర్చి యెహోవా అతనిని గట్టిగా హెచ్చరించాడు: “అవశ్యముగా నీవు మరణ మవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరికచేయక [పోయిన ఎడల]. . . ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమునుబట్టి మరణమవునుగాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును.” (యెహె. 3:18) తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ యెహెజ్కేలు తన నియామకాన్ని నమ్మకంగా నెరవేర్చాడు. కనుకనే యెహోవా తీర్పు తీర్చినప్పుడు ఆయన ఆనందించగల్గాడు.

5 శతాబ్దాల తర్వాత, ప్రకటించడంలో తనకున్న బాధ్యతను గూర్చి అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. ఆయన ఇలా ప్రకటించాడు: “అందరి రక్తము విషయమై నేను నిర్దోషిని. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.” పౌలు బహిరంగంగానూ ఇంటింటనూ ప్రకటించాడు ఎందుకంటే అలా చేయకపోవడంవల్ల దేవుని ఎదుట తాను రక్తాపరాధి అవుతాడని అతను గ్రహించాడు.—అపొ. 20:20, 26, 27, అథఃస్సూచి.

6 యెహెజ్కేలుకున్న ఆసక్తి మనకు ఉందా? పౌలు భావించినట్లుగా, ప్రకటించేందుకు మనం బద్ధులమై ఉన్నామని భావిస్తామా? వారికివ్వబడిన ఆజ్ఞే మనకూ ఉంది. ఇతరులు ఉదాసీనతనూ అలక్ష్యభావాన్ని లేక తిరస్కారాన్ని కనపర్చినప్పటికీ మనం వారిని హెచ్చరించే బాధ్యతను నిర్వహిస్తూనే ఉండాలి. ఇంకా వేలమంది రాజ్యసువార్తకు ప్రతిస్పందించి “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుము,” అని చాటగలరు. (జెక. 8:23) దేవుని ఎడల మరియు మన తోటి మానవుని ఎడల మనకు గల ప్రేమ, కొనసాగేందుకు మనల్ని కదలించును గాక. ప్రకటించాలన్న ఓ నియామకం మనకు ఉంది!

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి