నవంబరులోని సేవా కూటాలు
గమనిక: సమావేశ కాలంలో ప్రతివారం సేవా కూటం కొరకైన పట్టికను మన రాజ్య పరిచర్య వేస్తుంది. “దైవికశాంతి సందేశకులు” జిల్లా సమావేశానికి హాజరవ్వడానికి వీలయ్యేందుకు, అలాగే ఆ కార్యక్రమంలోని ఉన్నతాంశాలను దాని తరువాతి వారం 30 నిమిషాలు సమీక్షించేందుకు అవసరమైన సవరింపులను సంఘాలు చేసుకోవచ్చు. జిల్లా సమావేశంలోని ఒక్కోరోజు జరిగే కార్యక్రమ సమీక్షను చేసేందుకు విశేషమైన అంశాలపై శ్రద్ధ కేంద్రీకరించగల యోగ్యత గల ఇద్దరో ముగ్గురో సహోదరులను ముందుగానే నియమించాలి. బాగా సిద్ధపడిన ఆ పునఃసమీక్ష కీలకాంశాలను జ్ఞాపకముంచుకుని వ్యక్తిగతంగా అన్వయించుకునేందుకు, పరిచర్యలో ఉపయోగించేందుకు సంఘానికి సహాయపడుతుంది. ప్రేక్షకులు చెప్పే వ్యాఖ్యలు మరియు అనుభవాలు క్లుప్తమైనవిగాను, కీలకమైనవిగాను ఉండాలి.
నవంబరు 4తో ప్రారంభమయ్యే వారం
పాట 29 (11)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసిన ప్రకటనలు. దేశంలోని అలాగే స్థానిక సంఘంలోని జూలై ప్రాంతీయ సేవా నివేదికపై వ్యాఖ్య.
15 నిమి: “మీరు దేవుని వాక్యాన్ని సరిగా ఉపదేశిస్తున్నారా?” ప్రశ్నా జవాబులు. తర్కించుట (ఆంగ్లం) పుస్తకం, 58-60 పేజీల నుండి “బైబిలును పరిశీలించడానికి గల కారణాలు” అనే దానిపై వ్యాఖ్యలను ఇమిడ్చండి.
20 నిమి: ‘ఇదియే నిత్యజీవము.’ (1-5 పేరాలు) 1వ పేరాపై క్లుప్తమైన ప్రారంభ వ్యాఖ్యల తర్వాత, 2-5 పేరాల్లోని అందింపులను ప్రదర్శించమని సామర్థ్యంగల ఇద్దరు ప్రచారకులతో చెప్పండి. బైబిలు పఠనాన్ని ఆరంభించాలనే లక్ష్యాన్ని నొక్కిచెప్పండి.
పాట 128 (89) మరియు ముగింపు ప్రార్థన.
నవంబరు 11తో ప్రారంభమయ్యే వారం
పాట 40 (18)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
20 నిమి: యెహోవాకు ఎందుకివ్వాలి? నవంబరు 1, 1996 కావలికోట 28-31 పేజీల్లోవున్న శీర్షికలోని ముఖ్యాంశాలను ఉన్నతపరుస్తూ ఇద్దరు పెద్దల మధ్య చర్చ లేదా ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం ద్వారా సమాచారాన్ని చెప్పవచ్చు.
15 నిమి: ‘ఇదియే నిత్యజీవము.’ (6-8 పేరాలు) బైబిలు పఠనాలను ఆరంభించేందుకు సూటైన పద్ధతులను ఉపయోగించడంలోని ప్రయోజనాలను చర్చించండి. 6-7 పేరాలలోని అందింపులను ప్రదర్శించేందుకు అనుభవజ్ఞులైన ప్రచారకులను ఉపయోగించండి. మొదటి దర్శనంలోనే పఠనాన్ని ఆరంభించిన ఉదాహరణలను చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి. ఒక పఠనాన్ని నేరుగా ప్రతిపాదించినప్పుడు “అలాగా. లోపలికి రండి. పఠించడమంటే నాకు చాలా ఇష్టం” అని ఒక వ్యక్తి జవాబిచ్చాడు. ఆయనతో పఠనం ప్రారంభించబడింది, తరువాతి వారం ఆయన కుటుంబమంతా కూర్చుంది, త్వరలోనే అందరూ కూటాలకు హాజరు కావడం, సాక్ష్యపు పనిలో భాగం వహించడం ఆరంభించారు. తరువాతి వారపు సేవా కూటానికి తమ జూన్ 1996 మన రాజ్య పరిచర్య ఇన్‌సర్ట్ ప్రతిని తెచ్చుకోమని అందరినీ ప్రోత్సహించండి.
పాట 129 (66) మరియు ముగింపు ప్రార్థన.
నవంబరు 18తో ప్రారంభమయ్యే వారం
పాట 140 (77)
10 నిమి: స్థానిక ప్రకటనలు. “క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం” సమీక్షించండి.
15 నిమి: “మనకు ఓ నియామకం ఉంది.” ప్రశ్నా జవాబులు. జనవరి 1, 1988, కావలికోట (ఆంగ్లం) 28-9 పేజీల్లోని 13-16 పేరాలపై క్లుప్త వ్యాఖ్యలను చేయండి.
20 నిమి: అభివృద్ధిని సాధించే బైబిలు పఠనాలను నిర్వహించండి. సేవాధ్యక్షుని ప్రసంగం. మనం దాదాపు ఒక సంవత్సరంగా బైబిలు పఠన పనిలో జ్ఞానము అనే పుస్తకాన్ని ఉపయోగిస్తున్నాము. కొందరు ఇంకా ఆ పుస్తకాన్ని పఠిస్తుండగా, మరి కొందరు విద్యార్థులు ఇప్పటికే ముగించి ఉండవచ్చు. క్రొత్తవారు సత్యాన్ని త్వరగా నేర్చుకుని, దానిని తమ జీవితాల్లో అన్వయించుకుని, సంఘంలో భాగమయ్యేలా సహాయపడేందుకు రూపకల్పన చేయబడిన పఠనాలను నిర్వహించడంపై కేంద్రీకరించాలని మనం ప్రోత్సహించబడ్డాం. మనం బోధకులుగా ఫలవంతులై ఉండేందుకు సహాయపడే చక్కని సలహాలు జూన్ 1996 మన రాజ్య పరిచర్య ఇన్‌సర్ట్‌లో ఇవ్వబడ్డాయి. నిపుణతతో విద్యార్థులకు నేర్పించేందుకు ఆ ఇన్‌సర్ట్‌లో 3-13 పేరాల్లో ఇవ్వబడిన సలహాలలో కొన్నింటిని క్లుప్తంగా పునఃసమీక్షించండి. తర్వాత, 14-22 పేరాల్లో సంక్షిప్తంగా ఇవ్వబడినట్లు, వారు స్థిరమైన స్థానాన్ని తీసుకునేందుకు వారికి సహాయపడేందుకు చేయవలసిన విషయాలపై కేంద్రీకరించండి. 15, 17, 20-1 పేరాలను చదవండి. స్థానిక ప్రచారకులు మంచి ఫలితాలను ఎలా సాధించారో చూపించే కొన్ని అనుకూలమైన నివేదికలను పునఃసమీక్షించండి. బైబిలు పఠన పనిలో భాగం వహించమని అనేకులను ప్రోత్సహించండి.
పాట 85 (11 sb29-TU) మరియు ముగింపు ప్రార్థన.
నవంబరు 25తో ప్రారంభమయ్యే వారం
పాట 46 (5 sb29-TU)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రశ్నాభాగాన్ని చర్చించండి. ఇండ్ల దగ్గరలేని వారి సరైన రికార్డులను పెట్టుకోవలసిన అవసరతను ఉన్నతపరచండి.
25 నిమి: “సువార్తను అన్నిచోట్ల ప్రకటించండి.” ప్రశ్నా జవాబులు. ఇన్‌సర్ట్‌లో విశేషంగా ఇవ్వబడిన కొన్ని సలహాలను ప్రణాళికవేసి, స్థానిక ప్రాంతంలో ఎలా సంస్థీకరించవచ్చో పేర్కొనండి. ఇంటింటి పరిచర్యను నిర్లక్ష్యం చేయకుండానే సాక్ష్యమివ్వగల ప్రతి అవకాశాన్ని గూర్చి అప్రమత్తంగా ఉండాలని అందరినీ ప్రోత్సహించండి. 23-25 పేరాలను ప్రదర్శించండి. 34-35 పేరాలను చదవండి.
10 నిమి: డిశంబరు కొరకైన సాహిత్య ప్రతిపాదనను పునఃసమీక్షించండి. మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని 11-13 పేజీల్లోని చిత్రాలను ఉపయోగిస్తూ ప్రతిపాదించండి. 11వ అధ్యాయం వైపుకు అవధానాన్ని మళ్ళించండి. క్రీస్తు జీవిత చరిత్రను గూర్చిన పుస్తకాన్ని తీసుకోగల ఇంట్లో జీవించినవారిలోకెల్లా మహా గొప్ప మనిషి అనే పుస్తకాన్ని, పిల్లలున్న అలాంటి మరో ఇంట్లో నా బైబిలు కథల పుస్తకమును (ఆంగ్లం) ప్రతిపాదించడాన్ని ప్రదర్శించండి. ఆసక్తి కనపడిన చోటెల్లా పునర్దర్శనం కొరకు కచ్చితమైన ఏర్పాట్లు చేయబడాలి.
పాట 180 (100) మరియు ముగింపు ప్రార్థన.