మన వర్తమానాన్ని ఎవరు వింటారు?
1 మానవచరిత్రలో మునుపెన్నడూ లేనంతగా, నేడు ప్రజలు సమాచారంలో మునిగి తేలుతున్నారు. దీనిలో అధిక శాతం నిరర్థకమైనదే కాక పెడదోవపట్టిస్తుంది కూడా. తత్ఫలితంగా, అనేకమంది కలతచెందివున్నారు మరి దేవుని రాజ్య వర్తమానాన్ని వారు వినేలా చేయడం మనకు సవాలుగా తయారౌతుంది. దేవుని వాక్యాన్ని వినడంవల్ల వారికి లభించే మంచి ఫలితాన్ని వారు గ్రహించరు.—లూకా 11:28.
2 ప్రపంచంలోని అనేక భాగాల్లో, వేవేల కొలది ప్రజలు ఈ వర్తమానాన్ని వింటున్నందుకూ గృహ బైబిలు పఠనాన్ని స్వీకరిస్తున్నందుకు మనం ఆనందిస్తున్నాము. అయితే ఇతర ప్రాంతాల్లో, అంత ప్రతిస్పందన లేదు. పరిచర్యలో మనం చేసే అనేక సందర్శనాలకు ఫలితం లేకుండాపోవచ్చు, అప్పుడు మన సమాచారాన్ని ఎవరు వింటారా అని మనం ఆలోచించవచ్చు.
3 మనం నిరుత్సాహపడకుండా జాగ్రత్తపడాలి. పౌలు ఇలా వివరించాడు: “ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షించబడును. వారు విననివానికి . . . ఎట్లు ప్రార్థన చేయుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు? . . . ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడియున్నది.” (రోమా. 10:13-15) రాజ్య విత్తనాలను మనం శ్రద్ధగా విత్తినట్లైతే, యథార్థ హృదయంగలవారిలో అది వృద్ధిచెందేలా దేవుడు చేస్తాడు.—1 కొరిం. 3:6.
4 క్రమంగా పునర్దర్శనాలు చేయడమే దాని కీలకం: మన వర్తమానాన్ని ఎక్కువ మంది ప్రజలు వినరనిపించే ప్రాంతాల్లో, మనం ప్రచురణలను అందించినా అందించకపోయినా వాళ్లలో కనిపించే ఏ కొద్దిపాటి ఆసక్తినైనా పెంచడంపై మనం మన అవధానాన్ని నిలపాలి. ఏమీ సాధించలేమని ఎందుకు త్వరపడి నిర్థారించుకోవాలి? మనం విత్తనాలను విత్తినప్పుడు ఏ విత్తనం ఎక్కడ మొలకెత్తుతుందో మనకు తెలియదు. (ప్రసం. 11:6) లేఖనాలనుండి ఏదోక విషయాన్ని గూర్చి మాట్లాడేందుకు మనం సిద్ధపడి తిరిగి వెళ్ళినట్లైతే, క్లుప్తంగా మాట్లాడినప్పటికీ ఆ వ్యక్తి హృదయాన్ని మనం చేరగల్గే అవకాశముంది. మనం ఓ కరపత్రాన్ని గానీ లేక ఇటీవలి పత్రికలనుగానీ ఇచ్చిరావచ్చు. చివరికి, బైబిలు పఠనాన్ని ఎలా చేయాలో మనం చూపించవచ్చు. మనం చేసే ప్రయత్నాలను యెహోవా ఎంతగా ఆశీర్వదిస్తాడో చూసి మనం ఆశ్చర్యపోతాము.—కీర్త. 126:5, 6.
5 కొద్దిగా ఆసక్తి చూపిన స్త్రీకి ఓ కరపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రెండు నెలలకు ఆమె ఇంటిదగ్గిర కనిపించింది కానీ, మాట్లాడే తీరికలేకపోయింది. మరలా అదే కరపత్రాన్ని ఆమెకివ్వడం జరిగింది. ఆ ప్రచారకురాలు ఆమెను తన ఇంటిదగ్గిర కలిసేందుకు ఎడతెగని ప్రయత్నాలెన్నో చేసినా మరలా ఆమెను కలిసేందుకు మూడు నెలలు పట్టింది. కానీ ఆమె అప్పుడు అనారోగ్యంతో ఉంది. ఆ సహోదరి మరలా ఆ పైవారం ఆమె దగ్గరకు వెళ్లింది వెంటనే ఆ కరపత్రాన్ని గూర్చి చిన్న సంభాషణ ప్రారంభమైంది. ఆ తర్వాతి వారం సహోదరి వెళ్లినప్పుడు, ఆ స్త్రీ రాజ్యవర్తమానం విషయంలో నిజమైన ఆసక్తిని చూపించింది. ఆమె జీవిత పరిస్థితుల్లో వచ్చిన మార్పు ఆమెకు ఆత్మీయ అవసరత ఉందనే విషయాన్ని తెలియచేశాయి. బైబిలు పఠనం ప్రారంభించబడింది మరి అప్పటినుండి ఆమె ప్రతివారం ఉత్సాహంగా పఠించేది.
6 మనం ఏదైనా పెరగడాన్ని చూడాలని కోరుకుంటున్నట్లయితే, అది పుష్పాలైనాగానీ, కూరగాయలైనాగానీ లేక రాజ్యసందేశమందు ఆసక్తియైనాగానీ సాగు చేయడం అవసరం. అలా చేసేందుకు సమయం, కృషి, శ్రద్ధవహించే మనస్తత్త్వం, వెనుకంజ వేయకూడదనే దృఢ సంకల్పం అవసరం. రాజ్య విత్తనం మొలకెత్తిన మూడు లక్షల కన్నా ఎక్కువమంది ప్రజలు గత సంవత్సరం బాప్తిస్మం తీసుకున్నారు! మనం ప్రకటిస్తూ ఉన్నట్లైతే, మన వర్తమానాన్ని వినే అనేకమందిని మనం తప్పకుండా కనుగొనగలం.—గలతీయులు 6:9 పోల్చండి.