నిశ్చయముగా తిరిగివెళ్లి మాట్లాడుము
1 సువార్తయొక్క పరిచారకులుగా, శిష్యులను చేయుటకు మనము ఆజ్ఞాపింపబడితిమి. (మత్త. 28:19, 20) శిష్యులను తయారుచేయు మన పనిలో పునర్దర్శనములను చేయుట చాలా ముఖ్యమైన భాగము. ఇందు ప్రాణములు ఇమిడియున్నవను దానిని మనము గుణగ్రహింతుము గనుక, మొదట చూపిన ఆసక్తిని వృద్ధిచేయుటకు మనము సమస్త ప్రయత్నములు చేయుటకు కోరుకొందుము.
2 మనము సాహిత్యమును అందించిన ప్రతివ్యక్తిని తాను పునర్దర్శించుటకు యోగ్యుడని మనము ఎంచవలెను. అయినను, సాహిత్యమును అందించుటయే, కేవలము పునర్దర్శనముచేయుటకు ఆధారము కాదు. అనేకులు బైబిలు వర్తమానమును చర్చించుటకు ఇష్టపడుదురుగాని, సాహిత్యమును తీసికొనుటకు ఇష్టపడరు. కావున ఆసక్తిని కనిపెట్టినప్పుడు, మనము నిశ్చయంగా తిరిగివెళ్లి, దానిని వృద్ధిచేయుటకు ప్రయత్నించవలెను.
3 అందింపులను విడువక వెంబడించుట: సాహిత్యమును అందించినవాటికంటె, పునర్దర్శనముల సంఖ్య ఎంతో ఎక్కువగాయుండును గనుక, అభివృద్ధికి ఎంతో ఆధారమున్నది. ఒక పయినీరు పుస్తకమును అందించాడుగాని, ఆ ఇంటివ్యక్తిలో చాలా కొంచెము ఆసక్తినే గమనించాడు. ఒక మధ్యాహ్నము, తన దర్శనములన్నిటిని పూర్తి చేసికొన్న తరువాత, ఆ సహోదరుడు ఈ వ్యక్తిని కలవాలని నిర్ణయించుకున్నాడు. ఫలితంగా బైబిలు పఠనము ప్రారంభించబడినది.
4 ఒక సహోదరుడు ఒకాయనకు రెండు పత్రికలనందించి, ఆయనకు నిజంగా ఆసక్తిలేదని తలస్తూ, ఆ వ్యక్తిని మరచిపోయాడు. కొన్ని దినముల తరువాత, ఆ వ్యక్తి, అచ్చటి స్థానిక సంఘానికి నాకు బాప్తిస్మమివ్వమని కోరుతూ ఒక ఉత్తరం వ్రాశాడు. ఒక మిషనరీ సహోదరి 74 మందికి ప్రచారకులగునట్లు సహాయపడగలిగింది. ఆమె అలా చేయగలుగుటకు ముఖ్యమైన అంశము ఏదని ఆమె తలస్తున్నట్లు ఆమెను అడుగగా ఆమె ఇలా చెప్పింది: “మేము చాలా ఎక్కువగా పత్రికా పనిని చేశాము. పత్రికలు తీసికొనిన వ్యక్తులతో, నేను వారితో బైబిలు పఠనములను ప్రారంభించేంతవరకు పునర్దర్శనములను చేస్తూనే ఉన్నాను.”
5 మొదట దర్శించినప్పుడు ఇంటివారికి, కొన్నిసార్లు, కేవలము ఒక కరపత్రమును మాత్రమే అందించగలుగుదుము. తరచు ఒక బైబిలు పఠనమును ప్రదర్శించి చూపుటకు కరపత్రములను ఫలవంతముగా ఉపయోగించవచ్చును. మరొక ప్రచారకునితో పనిచేయుచున్న ఒక ప్రాంతీయ కాపరి ఒక స్త్రీకి కరపత్రమును అందించాడు. అది చాలా క్లుప్తముగా ముగిసిన దర్శనము. అయితే ఆయన సహోదరిని తిరిగి దర్శించమని ప్రోత్సహించాడు. ఆ సహోదరి తిరిగి దర్శించి వెంటనే బైబిలు పఠనమును ప్రారంభించినది.
6 ఆసక్తి చూపించినప్పుడు: మొదటిసారి దర్శించినప్పుడు గృహస్థుడు సాహిత్యమును తీసికొనకపోయినంతమాత్రమున, దాని భావము ఆయనకు ఆసక్తి లేదని కాదు. ఒక యౌవన దంపతులను ఒక ప్రచారకుడు తిరిగి దర్శించినప్పుడు, వారికి క్రితములోనే మన సాహిత్యములు కొన్నివున్నట్లు, వారు ముందే వాటిని చదివియున్నట్లు తెలుసుకొనెను. వారు తిరిగి పఠించుటకు వెంటనే అంగీకరించారు. ఒక స్పెషల్ పయినీరు, పత్రికలను తీసికొనుటకు ఎల్లప్పుడు తిరస్కరించే ఒక స్త్రీలో బయటకు కనపడని ఆసక్తి ఉందని పసికట్టాడు. ఈ పయినీరు పత్రికలను ప్రక్కనపెట్టేశాడు. ఆ స్త్రీ ఒక బుక్‌లెట్‌లోని కొన్ని పేరాగ్రాఫ్‌లను చర్చించుటకు యిష్టపడింది. మరికొన్నిసార్లు దర్శించిన తరువాత, ఆమె వారానికి రెండుసార్లు బైబిలును పఠించుటకారంభించినది.
7 తమకైతాముగా యెహోవాకు సమర్పించుకొన్న ప్రతి ఒక్కరు శిష్యులను తయారుచేయు పనిలో వంతు కలిగియుండు బాధ్యతను గుర్తించాలి. ఆసక్తిచూపినవారిని క్రమముగా తిరిగివెళ్లి దర్శించుటనుబట్టి, మనకును ‘మనలను వినువారికిని’ మెండైన దీవెనలను తెచ్చు ఫలమును కోయగలము.—1 తిమో. 4:16.