‘మీ కుటుంబాన్ని బలపర్చుకోండి’
1 ప్రపంచవ్యాప్తంగావున్న అన్ని సంస్కృతుల్లోనూ కుటుంబ జీవితం విచ్ఛిన్నమైపోతోందన్నది స్పష్టమే. సాతాను లోకం మోసంలోనూ అవినీతిలోనూ పొర్లాడుతోంది. (1 యోహా. 5:19) మనం మన ‘కుటుంబాన్ని బలపర్చుకోవల్సిన’ అత్యవసరతనూ అలాగే ఇతరులు కూడా తమ కుటుంబాలను ఎలా బలపర్చుకోగలరో బోధించాల్సిన అత్యవసరతనూ ఇది నొక్కి చెబుతోంది.—సామె. 24:3, 27.
2 బైబిలు సూత్రాలు రక్షణనిస్తాయి: నిజమైన కుటుంబ సంతోషానికి కీలకం బైబిలు సూత్రాలను అన్వయించుకోవడంలోనే ఉంది. ఈ శక్తివంతమైన సత్యాలు కుటుంబంలోని సభ్యులందరికీ జీవితంలోని ప్రతికోణమందూ ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. వీటిని అన్వయించుకునే కుటుంబం ఆనందంగా ఉంటుందీ అలాగే దైవిక శాంతిని అనుభవిస్తుంది.—యెషయా 32:17 పోల్చండి.
3 మన కుటుంబాన్ని బలపర్చుకునేందుకు సహాయపడే సూత్రాలను, కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే కొత్త పుస్తకంలో సంక్షిప్త రూపంలో పొందుపర్చడం జరిగింది. కుటుంబ సభ్యులు గుర్తుంచుకోవల్సిన సూత్రాలను నొక్కి చెప్పే సహాయకరమైన బోధనా బాక్సులతో ప్రతి అధ్యాయమూ ముగుస్తుంది. ఈ బాక్సుల్లో అనేకం, “. . . ఈ బైబిలు సూత్రాలు ఎలా సహాయం చేయగలవు?” అనే ప్రశ్నతో ప్రారంభమౌతాయి. ఇది దేవుని ఆలోచనల వైపుకు మన అవధానాన్ని మళ్లిస్తుంది. తద్వారా, చర్చించే విషయంపై ఆయన ఆలోచనను మనం గ్రహిస్తాము.—యెష. 48:17.
4 ఈ పుస్తకంలోని విషయాలను బాగా తెలుసుకోండి. వివిధ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, మీకు సహాయపడగలిగే సూత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి. ఈ పుస్తకం ఈ క్రింది విషయాలను గూర్చి చెబుతోంది: కాబోయే వివాహ జతను ఎన్నుకోవడంలో ఒక వ్యక్తి ఏ విషయాల కొరకు వెదకాలి (2వ అధ్యాయం), శాశ్వతమైన వైవాహిక సంతోషానికి ఏ ప్రాముఖ్యమైన కీలకాలు సహాయపడతాయి (3వ అధ్యాయం), యౌవనస్థులైన తమ పిల్లలు, బాధ్యతాయుతమైనవారిగానూ దైవభయంగల పెద్దలుగానూ పెరిగేందుకు తలిదండ్రులు ఎలా సహాయంచేయగలరు (6వ అధ్యాయం), కుటుంబాన్ని వినాశకరమైన ప్రభావాలనుండి ఎలా కాపాడవచ్చు (8వ అధ్యాయం), ఒంటరిగా ఉన్న తల్లి లేక తండ్రి ఉన్న కుటుంబాలు విజయవంతమయ్యేందుకు సహాయపడే సూత్రాలు (9వ అధ్యాయం), త్రాగుబోతుతనమూ హింసల మూలంగా బాధననుభవించే కుటుంబాలకు ఆత్మీయ సహాయం (12వ అధ్యాయం), వివాహ బంధం విచ్ఛిన్నమైపోయే స్థితిలో ఉన్నప్పుడు ఏమి చేయాలి (13వ అధ్యాయం), వృద్ధులైన తలిదండ్రుల్ని సన్మానించేందుకు ఏమి చేయాల్సివుంది (15వ అధ్యాయం), ఒకరు తమ కుటుంబం కొరకు నిత్య భవిష్యత్తును ఎలా సంపాదించవచ్చు (16వ అధ్యాయం).
5 కొత్త పుస్తకాన్ని పూర్తిగా ఉపయోగించండి: మీరు ఇంతవరకూ ఈ పని చేయనట్లైతే, కుటుంబ సంతోషము అనే ఈ పుస్తకాన్ని కుటుంబమంతా కలిసి ఎందుకు పఠించకూడదు? అలాగే, మీ కుటుంబానికి కొత్త సమస్యలూ లేక సవాళ్లూ ఎదురైనప్పుడు వాటికి సంబంధించి ఈ పుస్తకంలో ఉన్న అధ్యాయాలను పునఃపరిశీలించి వాటిలోని సలహాను ఎలా అన్వయించుకోవచ్చో ప్రార్థనా పూర్వకంగా ఆలోచించండి. దానికి తోడు, కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకాన్ని సాధ్యమైనంత మంది ప్రజలకు అందించడానికి ప్రయత్నించేందుకుగాను ప్రాంతీయ సేవకు సమృద్ధిగా సమయాన్ని కేటాయించండి.
6 దైవిక భక్తి గల కుటుంబాలు ఆత్మీయంగా బలపర్చబడతాయి, ఐక్యంగా ఉంటాయి, అంతేకాకుండా సాతాను దాడులను తాళుకునేందుకు సంసిద్ధంగా ఉంటాయి. (1 తిమో. 4:7, 8; 1 పేతు. 5:8, 9) కుటుంబ స్థాపకుడైనవానినుండి దైవిక ఉపదేశం మనకు వస్తున్నందుకు మనం ఎంత కృతజ్ఞులమోకదా!