కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp22 No. 1 పేజీలు 8-9
  • 2 | పగ తీర్చుకోకండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 2 | పగ తీర్చుకోకండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు సలహా:
  • దానర్థం:
  • మనం ఏం చేయవచ్చు?
  • పగ తీర్చుకోవడం గురించి బైబిలు ఏం చెప్తుంది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ప్రతీకారం తీర్చుకోవడం సరైనదేనా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • ద్వేషాన్ని లేకుండా చేయడం సాధ్యమే!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
wp22 No. 1 పేజీలు 8-9
కోపంతో ఉన్న ఇద్దరు వ్యక్తులు చెట్టు కొమ్మల మీద ఎదురెదురుగా కూర్చున్నారు. ఒక్కొక్కరు తాను కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నారు.

ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?

2 | పగ తీర్చుకోకండి

బైబిలు సలహా:

“ఎవరైనా మీకు చెడు చేస్తే, తిరిగి వాళ్లకు చెడు చేయకండి. . . . సాధ్యమైతే, మీకు చేతనైనంత వరకు మనుషులందరితో శాంతిగా మెలగండి. . . . మీకు మీరే పగతీర్చుకోకండి, . . . ఎందుకంటే లేఖనాల్లో ఇలా ఉంది: ‘“పగతీర్చుకోవడం, ప్రతిఫలం ఇవ్వడం నా పని” అని యెహోవా అంటున్నాడు.’”—రోమీయులు 12:17-19.

దానర్థం:

మనకు అన్యాయం జరిగినప్పుడు కోపం రావడం సహజమే. కానీ పగ తీర్చుకోవద్దని, ఓపిక చూపించమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే, అన్యాయానికి గురైన వాళ్లందరికీ త్వరలో న్యాయం చేస్తానని ఆయన అంటున్నాడు.—కీర్తన 37:7, 10.

మనం ఏం చేయవచ్చు?

మనుషులు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే సమస్య తీరకపోగా, అదింకా పెద్దదౌతుంది. ద్వేషం తరతరాలు కొనసాగుతుంది. అందుకే, ఎవరైనా మనకు చెడు చేస్తే దెబ్బకు దెబ్బ తీయాలని అనుకోకూడదు. ఆవేశాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. కొన్ని విషయాల్ని మనసులోకి తీసుకోకుండా వదిలేయడమే మంచిది. (సామెతలు 19:11) కాకపోతే, కొన్నిటిని మాత్రం అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీ మీద ఎవరైనా దాడి చేస్తే దాని గురించి పోలీసులకు, సంబంధిత అధికారులకు చెప్పాల్సి రావచ్చు.

పగ-ప్రతీకారాలు మనల్నే నాశనం చేస్తాయి

ఒక సమస్యను ప్రశాంతంగా పరిష్కరించుకునే మార్గమే కనిపించకపోతే ఏం చేయాలి? లేదా, ప్రశాంతంగా పరిష్కరించుకోవడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోతే అప్పుడేం చేయాలి? అప్పుడు కూడా పగ పెంచుకోకూడదు; లేదంటే పరిస్థితి ఇంకా చేయి దాటిపోతుంది. దానికి బదులు, అపార్థాలను తొలగించుకుని ద్వేషానికి అడ్డుకట్ట వేయాలి. అంతేకాదు, దేవుడే ఒక పరిష్కారం చూపిస్తాడని నమ్మాలి. ‘ఆయన మీద ఆధారపడితే, ఆయనే మీ తరఫున చర్య తీసుకుంటాడు.’—కీర్తన 37:3-5.

నిజ జీవిత అనుభవం—ఎడ్రియన్‌

పగ పెంచుకోవడం మానేశాడు

ఎడ్రియన్‌.

ఎడ్రియన్‌ టీనేజీ వయసుకు వచ్చేసరికే వీధిరౌడీగా మారాడు. దీనికి తోడు మనసు నిండా ద్వేషం, ముక్కు మీద కోపం. తన జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టేవాడు కాదు. ఒకసారి ఏం జరిగిందో ఎడ్రియన్‌ ఇలా చెప్పాడు: “తరచూ మా గొడవలు గన్నులతో కాల్చుకునేదాకా వెళ్లేవి. నేను రక్తపు మడుగులో స్పృహ లేకుండా వీధిలో పడివున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. చెప్పాలంటే, ఎన్నోసార్లు చావు అంచుల దాకా వెళ్లొచ్చాను.”

ఎడ్రియన్‌కు 16 ఏళ్లున్నప్పుడు బైబిలు గురించి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. దానిగురించి అతనిలా చెప్పాడు: “బైబిలు గురించి నేర్చుకునే కొద్దీ, నేను చాలా మారాలని గ్రహించాను.” ఎడ్రియన్‌ ద్వేషం పెంచుకోకూడదని, గొడవలు పడకూడదని గ్రహించాడు. ముఖ్యంగా, పగ తీర్చుకోకూడదని రోమీయులు 12:17-19⁠లో ఉన్న విషయం అతనిలో చాలా మార్పు తీసుకొచ్చింది. “యెహోవా ఆయన అనుకున్న మార్గంలో, సమయంలో అన్యాయాన్ని తీసేస్తాడని నాకు నమ్మకం కుదిరింది. మెల్లమెల్లగా నా పాత జీవితం నుండి బయటపడ్డాను” అని ఎడ్రియన్‌ చెప్పాడు.

ఒకరోజు సాయంత్రం పాత కక్ష్యలు మనసులో పెట్టుకుని కొంతమంది రౌడీలు ఎడ్రియన్‌ మీద దాడి చేశారు. ఆ ముఠా నాయకుడు గట్టిగా అరుస్తూ ‘రా, నువ్వో నేనో చూసుకుందాం’ అని రెచ్చగొట్టేలా మాట్లాడాడు. ఆ సందర్భంలో తన రక్తం మరిగిపోయిందని ఎడ్రియన్‌ చెప్పాడు. కానీ అతను గొడవకు దిగకుండా మనసులో యెహోవాకు చిన్న ప్రార్థన చేసుకుని అక్కడ నుండి వచ్చేశాడు.

తర్వాత ఏం జరిగిందో ఎడ్రియన్‌ వివరించాడు: “మరుసటి రోజు ఆ ముఠా నాయకుడు మళ్లీ నాకు ఎదురుపడ్డాడు, కాకపోతే ఈసారి ఒంటరిగా ఉన్నాడు. అతన్ని ఏదోకటి చేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఆవేశాన్ని అణచుకోవడానికి సహాయం చేయమని మనసులో యెహోవాను ప్రాధేయపడ్డాను. ఇంతలో అతను నేరుగా నా దగ్గరకు వచ్చి, ‘రాత్రి నేనలా మాట్లాడకుండా ఉండాల్సింది క్షమించు. నేను కూడా నీలా మారాలనుకుంటున్నా, బైబిలు గురించి నేర్చుకోవాలనుకుంటున్నా’ అన్నాడు. ఆ రాత్రి నా కోపాన్ని అణచుకొని మంచి పని చేశాను అనిపించింది. దానివల్లే మేమిద్దరం కలిసి బైబిలు గురించి నేర్చుకోగలిగాం.”

ఎడ్రియన్‌ జీవితం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే, 2016 No. 5, కావలికోట పత్రికలోని 14-15 పేజీలు చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి