కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w23 ఫిబ్రవరి పేజీలు 14-19
  • “మీ ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకోండి, అప్రమత్తంగా ఉండండి!”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మీ ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకోండి, అప్రమత్తంగా ఉండండి!”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • లోకంలో జరుగుతున్నవి గమనిస్తూనే ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకోండి
  • మన విషయంలో మనం శ్రద్ధ తీసుకోవడం అంటే ఏంటి?
  • మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి
  • మనమెందుకు ‘మెలకువగా ఉండాలి’?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • యేసును ఆదర్శంగా తీసుకొని మెలకువగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • కనిపెట్టుకొని ఉండండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • “అప్రమత్తంగా ఉండండి”—తీర్పు తీర్చే గడియ వచ్చింది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
w23 ఫిబ్రవరి పేజీలు 14-19

అధ్యయన ఆర్టికల్‌ 8

“మీ ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకోండి, అప్రమత్తంగా ఉండండి!”

“మీ ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకోండి, అప్రమత్తంగా ఉండండి!”​—1 పేతు. 5:8.

పాట 144 మీ దృష్టి లక్ష్యంపై ఉంచండి!

ఈ ఆర్టికల్‌లో . . .a

1. అంతం గురించి యేసు తన శిష్యులకు ఏం చెప్పాడు? ఆయన వాళ్లకు ఏ హెచ్చరిక ఇచ్చాడు?

యేసు చనిపోవడానికి కొద్ది రోజుల ముందు, నలుగురు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అడిగారు: “ఈ వ్యవస్థ ముగింపుకు సూచన ఏమిటి?” (మత్త. 24:3) ఆ శిష్యులు బహుశా యెరూషలేము, దాని ఆలయం ఎప్పుడు నాశనమౌతుందో తెలుసుకోవాలని అనుకున్నారు. దానికి జవాబుగా యేసు యెరూషలేము, దాని ఆలయ నాశనం గురించే కాదు మనం ఇప్పుడు జీవిస్తున్న “ఈ వ్యవస్థ ముగింపు గురించి” కూడా చెప్పాడు. అంతం ఎప్పుడొస్తుంది అనే విషయం గురించి మాట్లాడుతూ యేసు ఇలా అన్నాడు: “ఆ రోజు గురించి, ఆ గంట గురించి ఎవ్వరికీ తెలీదు. పరలోకంలోని దూతలకు గానీ, కుమారునికి గానీ తెలీదు; తండ్రికి మాత్రమే తెలుసు.” తర్వాత ఆయన తన శిష్యులందర్నీ “అప్రమత్తంగా, మెలకువగా ఉండండి” అని హెచ్చరించాడు.—మార్కు 13:32-37.

2. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు అప్రమత్తంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

2 మొదటి శతాబ్దంలోని యూదా క్రైస్తవులు అప్రమత్తంగా ఉండాలి. అలా ఉంటేనే వాళ్లు తమ ప్రాణాల్ని కాపాడుకోగలరు. యెరూషలేము ఎప్పుడు నాశనమౌతుందో తెలుసుకోవడానికి యేసు తన శిష్యులకు ఒక సూచన ఇచ్చాడు. ఆయన ఇలా అన్నాడు: “యెరూషలేమును సైన్యాలు చుట్టుముట్టడం మీరు చూసినప్పుడు, దాని నాశనం దగ్గరపడిందని తెలుసుకోండి.” అలా జరిగినప్పుడు వాళ్లు యేసు హెచ్చరికకు లోబడుతూ “కొండలకు పారిపోవడం మొదలుపెట్టాలి.” (లూకా 21:20, 21) రోమన్లు యెరూషలేమును నాశనం చేసినప్పుడు ఆ హెచ్చరికకు లోబడినవాళ్లు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

3 ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ చెడ్డ లోకం త్వరలోనే అంతమౌతుంది. కాబట్టి మనం మన ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. అయితే, ఒకవైపు లోకంలో జరుగుతున్న వాటిని గమనిస్తూనే మరోవైపు మన ఆలోచనా సామర్థ్యాల్ని ఎలా కాపాడుకోవచ్చు? మన విషయంలో మనం ఎలా శ్రద్ధ తీసుకోవచ్చు? మిగిలివున్న సమయాన్ని ఎలా శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించవచ్చు? అనే ప్రశ్నల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

లోకంలో జరుగుతున్నవి గమనిస్తూనే ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకోండి

4. లోకంలో జరుగుతున్నవి బైబిలు ప్రవచనాల్ని ఎలా నెరవేరుస్తున్నాయో ఆలోచించడం ఎందుకు మంచిది?

4 ప్రస్తుతం లోకంలో జరుగుతున్నవి బైబిలు ప్రవచనాల్ని ఎలా నెరవేరుస్తున్నాయో ఆలోచించడం మంచిది. ఎందుకంటే, సాతాను లోకం అంతమయ్యే ముందు ఏమేం జరుగుతాయో యేసు చెప్పాడు. (మత్త. 24:3-14) కాబట్టి మన విశ్వాసం బలంగా ఉండడానికి ప్రవచనాల నెరవేర్పు మీద మనసుపెట్టమని అపొస్తలుడైన పేతురు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. (2 పేతు. 1:19-21) బైబిల్లోని చివరి పుస్తకం ఈ మాటలతో మొదలౌతుంది: “ఇవి యేసుక్రీస్తు బయల్పర్చిన విషయాలు. దేవుడు త్వరలో జరగబోయేవాటిని తన దాసులకు చూపించడానికి వాటిని యేసుకు ఇచ్చాడు.” (ప్రక. 1:1) కాబట్టి లోకంలో ఏం జరుగుతుందో, అది బైబిలు ప్రవచనాల్ని ఎలా నెరవేరుస్తుందో తెలుసుకోవాలని అనుకుంటాం. అంతేకాదు, జరుగుతున్న విషయాల గురించి వేరేవాళ్లకు చెప్పేయాలని అనిపిస్తుంది.

లోక పరిస్థితులను చూసి వేర్వేరుగా స్పందిస్తున్న రెండు జంటలు. 1. లోక నాయకుల మధ్య జరుగుతున్న శాంతి ఒప్పందం గురించి ఒక జంట టీవీలో వార్తలు చూస్తున్నారు. తర్వాత, వాళ్లు వార్తల్లో చూసిన వాటిగురించి వాళ్ల సొంత అభిప్రాల్ని రాజ్యమందిరంలో ఇద్దరు సిస్టర్స్‌కి చెప్తున్నారు. 2. పరిపాలక సభ అప్‌డేట్‌ వీడియో చూస్తున్న ఇంకొక జంట. తర్వాత, ఈ జంట కార్టు దగ్గరకు వచ్చిన ఒకతనికి సాక్ష్యం ఇస్తున్నారు.

బైబిలు ప్రవచనాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఏం చేయకూడదు, ఏం చేయాలి? (5వ పేరా చూడండి)b

5. మనం ఏం చేయకూడదు, ఏం చేయాలి? (చిత్రాలు కూడా చూడండి.)

5 బైబిలు ప్రవచనాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో అని ఊహించుకుంటూ మన సొంత అభిప్రాయాల్ని చెప్పకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు మన మాటలవల్ల సంఘ ఐక్యత పాడయ్యే ప్రమాదముంది. ఉదాహరణకు, ప్రపంచ నాయకులు ఏదైన ఒక సమస్యను పరిష్కరించి శాంతి భద్రతల్ని తీసుకొస్తామని చెప్పవచ్చు. అది విన్నప్పుడు 1 థెస్సలొనీకయులు 5:3 లోని ప్రవచనం నెరవేరిపోయిందేమో అని ఊహించుకోకూడదు. బదులుగా సంస్థ ప్రచురించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవాలి. మనం యెహోవా సంస్థ తయారుచేసిన ప్రచురణల్లో ఉన్న విషయాల్ని బట్టే ఒకరితోఒకరు మాట్లాడుకోవాలి. అప్పుడు సంఘమంతా ‘ఒకే ఆలోచనతో’ ఐక్యంగా ఉంటుంది.—1 కొరిం. 1:10; 4:6.

6. రెండో పేతురు 3:11-13 వచనాల నుండి ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

6 రెండో పేతురు 3:11-13 చదవండి. బైబిలు ప్రవచనాల్ని పరిశీలిస్తున్నప్పుడు సరిగ్గా ఆలోచించడానికి అపొస్తలుడైన పేతురు మాటలు మనకు సహాయం చేస్తాయి. ‘యెహోవా రోజు కోసం ఎదురుచూస్తూ, దాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకోమని’ ఆయన చెప్పాడు. ఎందుకు? హార్‌మెగిద్దోన్‌ ఏ రోజు వస్తుందో, ఏ గంటకు వస్తుందో తెలుసుకోవడానికి కాదుగానీ మిగిలిన ఈ సమయంలో, “పవిత్రంగా నడుచుకుంటూ, దైవభక్తిగల పనులు” చేయడానికి మనమలా ఎదురుచూడాలి. (మత్త. 24:36; లూకా 12:40) మరో మాటలో చెప్పాలంటే, మనం ఈ సమయంలో సరిగ్గా ప్రవర్తించాలి. యెహోవా సేవలో చేసేవన్నీ ఆయన మీద ప్రేమతోనే చేయాలి. అయితే ఇలా చేయాలంటే మనం మన విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.

మన విషయంలో మనం శ్రద్ధ తీసుకోవడం అంటే ఏంటి?

7. మన విషయంలో మనం శ్రద్ధ తీసుకుంటున్నామని ఎలా చూపించవచ్చు? (లూకా 21:34)

7 శిష్యులు లోకంలో జరుగుతున్న విషయాల్ని గమనిస్తూనే, తమ విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలని యేసు చెప్పాడు. దాన్ని ఆయన లూకా 21:34 లో స్పష్టంగా చెప్పాడు. (చదవండి.) అక్కడ యేసు ఇలా అన్నాడు: “మీ విషయంలో శ్రద్ధ తీసుకోండి.” తన విషయంలో శ్రద్ధ తీసుకునే వ్యక్తి, యెహోవాతో తనకున్న సంబంధాన్ని పాడుచేసే ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తాడు. ఒకవేళ ఏమైనా ఉంటే, వాటికి దూరంగా ఉండడానికి చేయగలిగినదంతా చేస్తాడు. అలా అతను “దేవుడు ప్రేమించే” వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తాడు.—సామె. 22:3; యూదా 20, 21.

8. అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఏమని చెప్పాడు?

8 తమ విషయంలో శ్రద్ధ తీసుకోమని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు చెప్పాడు. ఉదాహరణకు, ఆయన ఎఫెసులో ఉన్న క్రైస్తవులతో ఇలా అన్నాడు: “మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ తెలివితక్కువవాళ్లలా కాకుండా తెలివిగలవాళ్లలా నడుచుకోండి.” (ఎఫె. 5:15, 16) యెహోవాతో మనకున్న స్నేహాన్ని పాడుచేయడానికి సాతాను ప్రయత్నిస్తూనే ఉంటాడు కాబట్టి, “యెహోవా ఇష్టం ఏమిటో అర్థంచేసుకుంటూ” ఉండమని బైబిలు చెప్తుంది. అలా చేస్తే సాతాను తీసుకొచ్చే ఎలాంటి దాడినైనా మనం ధైర్యంగా ఎదిరించగలం.—ఎఫె. 5:17.

9. మనం “యెహోవా ఇష్టం” ఏంటో ఎలా అర్థం చేసుకోవచ్చు?

9 యెహోవాతో మనకున్న స్నేహాన్ని దెబ్బతీసే ప్రమాదాలన్నిటి గురించి బైబిలు చెప్పట్లేదు. మనం లేఖనాల్లో సూటిగా లేని విషయాల గురించి తరచూ నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. కాబట్టి తెలివైన నిర్ణయాలు తీసుకోవాలంటే మనం “యెహోవా ఇష్టం” ఏంటో అర్థం చేసుకోవాలి. అదెలా? క్రమంగా బైబిలు చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా మనం యెహోవా ఇష్టాన్ని తెలుసుకోవచ్చు. మనం యెహోవా ఇష్టాన్ని ఎంతెక్కువ అర్థం చేసుకుని, ‘క్రీస్తు మనసును’ ఎంతెక్కువ అలవర్చుకుంటే మనం అంతెక్కువగా “తెలివిగలవాళ్లలా” నడుచుకుంటాం. నిజానికి కొన్ని విషయాలు బైబిలు సూటిగా చెప్పకపోయినా మనం అలా నడుచుకోగలుగుతాం. (1 కొరిం. 2:14-16) కొన్నిసార్లు ఏ ప్రమాదాలకు దూరంగా ఉండాలో వెంటనే అర్థమౌతుంది. కానీ కొన్నిసార్లు అర్థంకాకపోవచ్చు.

10. మనం వేటికి దూరంగా ఉండాలి?

10 సరసాలాడడం, అతిగా తాగడం, అతిగా తినడం, ఇతరుల్ని బాధపెట్టేలా మాట్లాడడం, హింసతో కూడిన వినోదం, అశ్లీల చిత్రాలు చూడడం వంటివాటికి మనం దూరంగా ఉండాలి. (కీర్త. 101:3) యెహోవాతో మనకున్న స్నేహాన్ని పాడుచేయడానికి మన శత్రువైన సాతాను అవకాశాల కోసం వెదుకుతూనే ఉన్నాడు. (1 పేతు. 5:8) ఒకవేళ మనం అప్రమత్తంగా లేకపోతే సాతాను మనలో ఈర్ష్య, నిజాయితీ లేకపోవడం, అత్యాశ, ద్వేషం, గర్వం, పగ లాంటివి మొదలయ్యేలా చేస్తాడు. (గల. 5:19-21) మొదట్లో ఇలాంటివి పెద్ద ప్రమాదంగా అనిపించకపోవచ్చు. కానీ నిప్పురవ్వలా ఉన్నప్పుడే వాటిని ఆర్పకపోతే, చివరికి అవి యెహోవాతో మనకున్న బంధాన్ని తగలబెట్టేస్తాయి.—యాకో. 1:14, 15.

11. మనం వెంటనే గుర్తించని ఒక ప్రమాదం ఏంటి? దానికి ఎందుకు దూరంగా ఉండాలి?

11 మనం వెంటనే గుర్తించలేని ఒక ప్రమాదం ఏంటంటే చెడు సహవాసాలు. దాన్ని అర్థంచేసుకోవడానికి ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. మీ ఉద్యోగ స్థలంలో యెహోవాసాక్షికాని వ్యక్తితో మీరు కలిసి పనిచేస్తున్నారు అనుకోండి. యెహోవాసాక్షుల మీద వాళ్లకు మంచి అభిప్రాయం రావాలని మీరు ఎప్పుడూ వాళ్లతో దయగా ఉంటూ, వాళ్లకు హెల్ప్‌ చేస్తూ, అప్పుడప్పుడు వాళ్లతో కలిసి లంచ్‌ చేస్తూ ఉన్నారు. కానీ కొంతకాలానికి మీరు వాళ్లతో రోజూ లంచ్‌ చేయడం మొదలుపెట్టారు. మాటల మధ్యలో వాళ్లు అనైతిక విషయాలు మాట్లాడితే మొదట్లో మీకు నచ్చలేదు. కానీ సమయం గడిచే కొద్దీ వాళ్ల మాటలు మీకు ఎంత అలవాటైపోయాయి అంటే, అవేం పెద్ద తప్పు కాదని మీకు అనిపిస్తుంది. అయితే, ఒకరోజు ఆఫీస్‌ అయిపోయాక సరదాగా పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచారు. దానికి మీరు వెళ్లారు. అలా మెల్లమెల్లగా మీరూ వాళ్లలాగే ఆలోచిస్తూ, వాళ్లు ఏది చెప్పినా దానికి తలాడిస్తున్నారు. ఇక మీరు పూర్తిగా వాళ్లలా మారిపోవడానికి ఎంతో టైమ్‌ పట్టదు కదా. నిజమే, మనం అందరితో దయగా, గౌరవంగా ఉండాలి. కానీ మనం ఎవరితో ఎక్కువ తిరుగుతామో వాళ్లలాగే తయారౌతాం అని మర్చిపోకూడదు. (1 కొరిం. 15:33) యేసు చెప్పినట్టే మన విషయంలో మనం శ్రద్ధ తీసుకుంటే సాక్షులుకాని వాళ్లతో అనవసరంగా సమయం గడపం. (2 కొరిం. 6:15) ప్రమాదాన్ని ముందే పసిగట్టి దానికి దూరంగా ఉంటాం.

మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి

12. యేసు శిష్యులు అంతం కోసం ఎదురుచూస్తూ ఏం చేయాలి?

12 తన శిష్యులు, ఖాళీగా కూర్చుని అంతం కోసం ఎదురుచూడాలని యేసు చెప్పలేదు. యేసు వాళ్లకు ఒక ముఖ్యమైన పని ఇచ్చాడు. “యెరూషలేములో, యూదయ అంతటిలో, సమరయలో, భూమంతటా” మంచివార్త ప్రకటించమని యేసు వాళ్లకు ఆజ్ఞాపించాడు. (అపొ. 1:6-8) అది నిజంగా పెద్ద పనే. వాళ్లు ఆ పనిలో చేయగలిగినదంతా చేయడం ద్వారా తమ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకున్నారు.

13. మన సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఎందుకు ఉపయోగించాలి? (కొలొస్సయులు 4:5)

13 కొలొస్సయులు 4:5 చదవండి. మన సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో ఆలోచించడం ద్వారా కూడా మనం మన విషయంలో శ్రద్ధ తీసుకుంటాం. ఎందుకంటే, “అనుకోని సంఘటనలు” మనందరికి ఎదురౌతాయి. (ప్రసం. 9:11) మనం ఎప్పుడైనా చనిపోవచ్చు.

టీవీలో వార్తలు చూసిన సిస్టర్‌ అలాగే పరిపాలక సభ అప్‌డేట్‌ వీడియో చూసిన సిస్టర్‌ కలిసి ఒకామెకు బైబిలు స్టడీ చేస్తున్నారు. వాళ్లు “రాజ్యమందిరం అంటే ఏమిటి?” అనే వీడియోను ఆమెకు చూపిస్తున్నారు.

మన సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఎలా ఉపయోగించుకోవచ్చు? (14-15 పేరాలు చూడండి)

14-15. మన సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఎలా ఉపయోగించుకోవచ్చు? (హెబ్రీయులు 6:11, 12) (చిత్రం కూడా చూడండి.)

14 యెహోవా ఇష్టం చేస్తూ ఆయనతో స్నేహాన్ని బలపర్చుకుంటూ ఉండడం ద్వారా మన సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోవచ్చు. (యోహా. 14:21) మనం ‘స్థిరంగా, నిలకడగా ఉండాలి. ఎప్పుడూ ప్రభువు సేవలో నిమగ్నమై ఉండాలి.’ (1 కొరిం. 15:58) అప్పుడు, అనుకోకుండా మన ప్రాణం పోయినా, ఈ దుష్టలోకం అంతమైనా యెహోవా సేవ ఎక్కువ చేయలేకపోయామే అనే బాధ మనకు ఉండదు.—మత్త. 24:13; రోమా. 14:8.

15 నేడు భూమంతటా జరుగుతున్న ప్రకటనా పనిలో యేసు తన శిష్యులను నడిపిస్తున్నాడు. మనం ఎలా ప్రకటించాలో సంస్థ ద్వారా నేర్పిస్తున్నాడు. దానికి అవసరమయ్యే పనిముట్లను కూడా ఇస్తున్నాడు. యేసు తన మాట నిలబెట్టుకున్నాడు. మరి మన సంగతేంటి? (మత్త. 28:18-20) మనం కూడా అంతం వచ్చేవరకు అప్రమత్తంగా ఉంటూ ప్రకటించడంలో, బోధించడంలో ఉత్సాహంగా పని చేయాలి. అంతేకాదు, హెబ్రీయులు 6:11, 12​లో ఉన్న సలహాను పాటిస్తూ మన నిరీక్షణను “అంతం వరకు” దృఢంగా ఉంచుకోవాలి.—చదవండి.

16. మనం ఏం చేయాలని గట్టిగా నిర్ణయించుకుందాం?

16 సాతాను లోకాన్ని అంతం చేసే డేట్‌, టైమ్‌ యెహోవా ఎప్పుడో నిర్ణయించాడు. ఆ రోజు వచ్చినప్పుడు యెహోవా ఖచ్చితంగా పరదైసు విషయంలో ఆయన చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తాడు. బహుశా అంతం రావడం లేటు అవుతుందని మనకు అనిపించవచ్చు. కానీ యెహోవా రోజు అస్సలు “ఆలస్యం అవ్వదు!” (హబ. 2:3) కాబట్టి ‘యెహోవా కోసం కనిపెట్టుకొని’ ఉంటూ ‘మన రక్షకుడైన దేవుని కోసం ఓపిగ్గా వేచివుండాలని’ గట్టిగా నిర్ణయించుకుందాం.—మీకా 7:7.

మీరెలా జవాబిస్తారు?

  • లోకంలో జరుగుతున్నవాటిని గమనిస్తున్నప్పుడు మన ఆలోచనా సామర్థ్యాల్ని ఎలా కాపాడుకోవచ్చో?

  • మన విషయంలో మనం శ్రద్ధ తీసుకోవడం అంటే ఏంటి?

  • మన సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఎలా ఉపయోగించుకోవచ్చు?

పాట 139 కొత్త లోకంలో ఉన్నట్టు ఊహించుకోండి!

a లోకంలో జరుగుతున్నవాటిని గమనిస్తూనే మన ఆలోచనా సామర్థ్యాల్ని ఎలా కాపాడుకోవచ్చో, అప్రమత్తంగా ఎలా ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. అలాగే మన విషయంలో మనం శ్రద్ధ తీసుకోవడం అంటే ఏంటి? మన సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఎలా ఉపయోగించవచ్చు? అనే ప్రశ్నల్ని కూడా చూస్తాం.

b చిత్రాల వివరణ: (పైనున్న చిత్రం) ఒక జంట టీవీలో వార్తలు చూస్తున్నారు. మీటింగ్‌ తర్వాత వార్తల్లో చూసిన వాటిగురించి వాళ్ల సొంత అభిప్రాయాల్ని ఇతరులకు చెప్తున్నారు. (కిందున్న చిత్రం) బైబిలు ప్రవచనాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవడానికి మరో జంట పరిపాలక సభ అప్‌డేట్‌ వీడియో చూస్తున్నారు. నమ్మకమైన దాసుడు అందించే బైబిలు ప్రచురణలను ప్రకటనా పనిలో ఇతరులకు ఇస్తున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి