కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 10/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1994
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1995
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1995
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1995
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 10/8 పేజీ 30

మా పాఠకుల నుండి

రొమ్ము క్యాన్సర్‌ “రొమ్ము క్యాన్సర్‌—ప్రతి స్త్రీకివున్న భయము” అనే (ఏప్రిల్‌ 8, 1994) పరంపరలు ప్రచురించినందుకు మీకు కృతజ్ఞతలు. అప్పుడప్పుడు నాకై నేను పరీక్షించుకున్నాను మరి నా గ్రంథులు కేవలం గట్టిగ వున్నవని అనుకున్నాను. అనిశ్చయత వల్ల దాని గూర్చి నేనేమి చేయలేదు. కాని, ఆ శీర్షికను చదివిన తరువాత, నేను ఆసుపత్రికి వెళ్లి, నాకు క్యాన్సర్‌ వుందని తెలుసుకొన్నాను. నేను శస్త్రచికిత్స చేయించుకోడానికి ఏర్పాట్లు చేయబడినవి. నా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలను తెల్పుకుంటున్నాను.

టి. వై., జపాన్‌

నాకు శస్త్రచికిత్స జరిగినప్పటినుండి, క్యాన్సర్‌ గూర్చి నేనింకేమికూడ చదవలేకపొయ్యాను. ఆ పత్రిక వచ్చినప్పుడు, దాని గూర్చి నేను సంతోషించలేదు. కాని నేను సాధారణంగా తేజరిల్లు! యొక్క సంచికలన్నిటిని మొదటినుండి చివరివరకు చదువుతాను, నేను భయపడితే ఆపేయవచ్చు అనుకొని ఆ రాత్రి నేను కొద్దిగా చదువడానికి నిర్ణయించుకున్నాను. ఇంక దానిని చదువకుండ ఉండలేకపొయ్యాను. ఇది చాలా బాగా ఉంది, ఎంతో వివరంగా, ఎంతో శ్రద్ధ కల్గివుంది.

జి. కె., అమెరికా

ప్రాణాపాయంగొల్పే వ్యాధి నెదుర్కొనుటలోని మన భయాలను యెహోవా ఎలా అర్థం చేసుకుంటాడో చూడడానికి ఈ శీర్షిక నాకు సహాయపడింది. ఈ విధంగా తలంచే వారు బలహీనులని, విశ్వాసం సన్నగిల్లిన వారని నేనెల్లప్పుడు తలంచాను. యెహోవా లోతైన కనికరాన్ని చూడడానికది నాకు నిజంగా సహాయపడింది.

కె. జి., అమెరికా

ఆ సంచిక నాతో నిజంగా మాట్లాడింది. నా రొమ్ము క్యాన్సర్‌ శస్త్రచికిత్సకు సంబంధించిన నా వైద్యబిల్లులు చుట్టు వేసుకొని పడుకపై నేను, నా భర్త కూర్చున్నాము. బిల్లులు చెల్లించమని బ్యాంక్‌కు ఆర్డర్‌లు వ్రాస్తుండగా, తపాలవాడు ఈ తేజరిల్లు! సంచికను అందించాడు. ఆ శీర్షికను అదే దినమున నేను సాధారణమైన దానికన్న ఎక్కువ ఆసక్తితో చదివాను. ఆ శీర్షికల నుండి ధైర్యము తెచ్చుకునే స్త్రీలందరి తరఫున కృతజ్ఞతలు.

ఇ. జె., అమెరికా

సిటీస్‌ నేను 16 సంవత్సరాల వయస్సుగలదాన్ని మరి పట్టణాలపై పరంపరలను చదవడానికి సంతోషించాను. భూగోళశాస్త్రం తరగతిలో మేము మాకు నచ్చిన అంశంపై ఒక చిన్న ప్రసంగమివ్వడానికి కోరబడినాము. “ది సిటీ దట్‌ వాజ్‌ అబండంట్‌ విత్త్‌ పీపుల్‌” అనే (జనవరి 22, 1994) ఈ శీర్షికలపై నేను, నా ప్రసంగాన్ని ఆధారం చేసుకున్నాను. దానిని తరగతిలో గట్టిగా చదివిన తరువాత, ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. నేను భూగోళశాస్త్ర గ్రహింపును అభివృద్ధి చేసుకొనుటకు నాకు సహాయపడినందుకు కృతజ్ఞతలు.

టి. ఆర్‌., జర్మనీ

“లెట్‌ అస్‌ బిల్డ్‌ అవర్‌సెల్వ్‌స్‌ ఎ సిటీ” అనే శీర్షికలో, “1900లో పది లక్షల జనాభాతో లోకమంతటిలో ఒకే పట్టణంగా లండన్‌ ఉండెను” అని మీరన్నారు. (జనవరి 8, 1994) దాని తదుపరి సంచికలో, మీరిలా అన్నారు: “1800 మధ్యకాలం నాటికి ఇది [ఇడొ, ఇప్పుడు టోక్యోగా పిలువబడుచున్నది] పది లక్షల జనాభాకన్నా ఎక్కువగా ఉండింది.” ఏది సరియైనది?

ఎస్‌. టి., జపాన్‌

లండన్‌కు సంబంధించిన వివరణము స్పష్టమైన తప్పుగా ఉండింది. “యిలస్ట్రేటెడ్‌ అట్‌లాస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌” (ర్యాండ్‌ మెక్కనల్లి అండ్‌ కంపెని) అనే 1985 గ్రంథముపై యిది ఆధారపడినది. కాని, “ది వరల్డ్‌ అల్‌మానక్‌ యాన్‌ బుక్‌ ఆఫ్‌ ఫాక్ట్స్‌ 1993”, అనేక పట్టణాలు 1900 నాటికి పదిలక్షలకు పైగా జనాభాను కల్గివుండినవని చెప్పుటలో సరిగా కనిపిస్తుంది. గందరగోళానికి క్షమించండి—ఎడిటర్‌.

నిరక్షరాస్యత కొన్ని ఆసక్తికరమైన శీర్షికలు చదివిన తరువాత నేను తరచు మీకు వ్రాసి కృతజ్ఞతలు తెల్పాలనుకునేదాన్ని. కాని “బ్రేకింగ్‌ ది చెయిన్స్‌ ఆఫ్‌ ఇల్లిటరసి” (ఫిబ్రవరి 22, 1994) ఆ పరంపరలు చివరకు అలా చేయడానికి నన్ను ఒప్పించాయి. ఎలా చదవాలో లేక వ్రాయాలో తెలియని ఒక స్త్రీతో వచ్చేవారం నేను బైబిలు పఠనం ప్రారంభించబోతున్నాను. నేను ఎలా చేయాలో నాకు తెలియదు, కాని ఇప్పుడు నాకు తెలుసు, ఈ శీర్షికల గూర్చి కృతజ్ఞతలు తెల్పుతున్నాను. అవి సరియైన సమయమందు వచ్చాయి!

యమ్‌. ఎ. సి., ఇటలి

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి