కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g03 4/8 పేజీ 29
  • పక్షిరాజు కన్ను

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పక్షిరాజు కన్ను
  • తేజరిల్లు!—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగరడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • యెహోవా అలసిపోయిన వాళ్లకు శక్తిని ఇస్తాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • గద్దలా లేక రాబందులా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • జంతు సృష్టి యెహోవాను ఘనపరుస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
తేజరిల్లు!—2003
g03 4/8 పేజీ 29

పక్షిరాజు కన్ను

స్పెయిన్‌లోని తేజరిల్లు! రచయిత

స్పెయిన్‌ దేశస్థులు నిశితదృష్టిగల వ్యక్తిని గద్ద కన్ను వ్యక్తి (బీస్టే దె ఆగీలా) అని వర్ణిస్తారు. జర్మన్లకూ అలాంటి పదమే ఉంది (ఆడ్‌లర్‌ఆగె). గద్దకున్న సూక్ష్మ దృష్టి శతాబ్దాలుగా సామెతల్లో తరచూ ప్రస్తావించబడడానికి బలమైన కారణం లేకపోలేదు. మూడు వేల సంవత్సరాల కంటే పూర్వం వ్రాయబడిన యోబు పుస్తకం గద్ద గురించి ఇలా చెబుతోంది: ‘పక్షిరాజు కన్నులు దూరమునుండి కనిపెట్టును.’​—యోబు 39:27, 29.

వాస్తవానికి గద్ద ఎంత దూరం వరకు చూడగలుగుతుంది? “సాధారణ పరిస్థితుల్లో ఒక స్వర్ణ గద్ద (అక్విల క్రిసాటోస్‌) 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరానున్న కుందేలు చేసే స్వల్ప కదలికలను కూడా పసిగట్టగలుగుతుంది” అని ద గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ ఎనిమల్‌ రికార్డ్స్‌ తెలియజేస్తోంది. గద్ద అంతకంటే ఎక్కువ దూరం చూడగలుగుతుందని మరికొందరు అంచనా వేశారు!

గద్దకు అంత శక్తివంతమైన నిశిత దృష్టి ఎలా వచ్చింది? అన్నింటికంటే ముఖ్యంగా స్వర్ణ గద్దకుండే రెండు పెద్ద పెద్ద కళ్ళు దాని తలలోని ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకొని ఉంటాయి. బుక్‌ ఆఫ్‌ బ్రిటీష్‌ బర్డ్స్‌ స్వర్ణ గద్ద గురించి చెబుతూ వాస్తవానికి దాని కళ్ళు “గరిష్ట పరిమాణంలో ఉంటాయి, అయినా అది ఎగరడానికి ఆటంకం కలిగించేంత భారంగా ఉండవు” అని పేర్కొంది.

అంతేకాదు వెలుగుకు ప్రతిస్పందించే కణాలైన కోన్‌లు మన కంటిలో ఒక చదరపు మిల్లీమీటరుకు 2,00,000 ఉంటే, గద్ద కంటిలో దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా అంటే 10,00,000 కోన్‌లు ఉంటాయి. దాదాపు ప్రతీ జ్ఞాననాడి చివరి భాగం ఒక నరంతో అనుసంధానమై ఉంటుంది. తత్ఫలితంగా కంటి నుండి మెదడుకు సందేశాన్ని చేరవేసే దృష్టి నాడికి ఉండే తంతువులు, మానవుని కంటే గద్దలో రెట్టింపు ఉంటాయి. కాబట్టి ఈ ప్రాణులకు నిశితమైన వర్ణ గ్రహణశక్తి ఉండడం అతిశయోక్తి కాదు! చివరిగా ఇతర పక్షుల్లాగే ఈ వేట పక్షుల కళ్ళకు కూడా శక్తివంతమైన దృష్టి సవరణ కటకాలు ఉంటాయి, ఇవి తమ దృష్టిని ఒక అంగుళం దూరానున్న వస్తువులపై నుండి ఎంతో దూరానున్న వస్తువులపైకి అత్యంత వేగంతో మళ్ళించగలుగుతాయి. ఈ విషయంలో కూడా వాటి కళ్ళు మన కళ్ళ కంటే ఎంతో గొప్పవి.

గద్ద దృష్టి పగటి వెలుగులో ఉత్కృష్టంగా ఉంటుంది కానీ గుడ్లగూబలకు రాత్రి అనుకూల సమయం. రాత్రిపూట వేటాడే ఈ పక్షుల కళ్ళల్లో వెలుగును గ్రహించే రాడ్‌లు అధికంగా ఉండడమేకాక వాటిలోని కటకం పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. తత్ఫలితంగా అవి రాత్రుళ్ళు మనం చూసేదానికంటే 100 రెట్లు చక్కగా చూడగలుగుతాయి. అయినప్పటికీ పూర్తి గాఢాంధకారం ఉండే అరుదైన సందర్భాల్లో ఈ గుడ్లగూబలు తమ వేటను కనిపెట్టడానికి నిశితమైన తమ వినికిడి శక్తిపైనే సంపూర్ణంగా ఆధారపడాల్సివస్తుంది.

ఈ పక్షులకు ఇలాంటి లక్షణాలను ఎవరిచ్చారు? దేవుడు యోబును ఇలా అడిగాడు: “పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా?” అద్భుతమైన ఈ సృష్టికి ఘనత తనకు దక్కాలని ఏ మానవుడూ వాదించలేడన్నది సుస్పష్టం. యోబు స్వయంగా ఆ విషయాన్ని నమ్రతతో అంగీకరించాడు: “నీవు [యెహోవా] సమస్తక్రియలను చేయగలవని . . . తెలిసికొంటిని.” (యోబు 39:27; 42:1, 2) పక్షిరాజు కన్ను మన సృష్టికర్త జ్ఞానానికి కేవలం మరొక నిదర్శనం మాత్రమే. (g02 12/22)

[29వ పేజీలోని చిత్రం]

స్వర్ణ గద్ద

[29వ పేజీలోని చిత్రం]

తెల్లని గుడ్లగూబ

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి