దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెషయా 38-42
యెహోవా అలసిపోయిన వాళ్లకు శక్తిని ఇస్తాడు
గద్ద ఉష్ణవాయువులు (thermals) లేదా పైకి ఎగిసే వేడి గాలి తరంగాల సహాయంతో గంటలు తరబడి చాలా ఎత్తులో ఉండగలదు. వేడి గాలి తరంగం తగలగానే గద్ద దాని చుట్టూ తిరుగుతుంది. ఆ గాలి గద్దను పైపైకి తీసుకువెళ్తుంది. కొంత ఎత్తుకు చేరుకోగానే, గద్ద ఆ ఉష్ణవాయువు నుండి పక్కన ఉన్న ఉష్ణవాయువుకు సునాయాసంగా ఎగురుతుంది. అలా వేడిగాలులను ఉపయోగించుకుని చాలాసేపు ఎగురుతుంది.
గద్ద ఎక్కువ శక్తి ఉపయోగించకుండానే గాలిలో ఎగరగలుగుతుంది. మనం కూడా దేవుడు ఇచ్చే బలంతో ఆయనను ఎలా ఆరాధించవచ్చో ఈ ఉదాహరణ చక్కగా వర్ణిస్తుంది