పాట 82
“మీ వెలుగు ప్రకాశింపనివ్వండి”
1. ప్రకాశింపజేస్తూ మన వెలుగు,
పాటిస్తూ ఉందాము యేసు ఆజ్ఞను.
పక్షపాతం లేని సూర్యుడిలాగే
పంచుదాం అందరికీ వాక్య వెలుగు.
2. ప్రకటిస్తే మనం మంచివార్తను,
వెలుగునిస్తుంది రాజ్య సందేశం.
దైవ వాక్యంలోని సత్య వెలుగు
చూపిస్తుంది దారిని నిత్యం మనకు.
3. మన సత్క్రియల్లో ఉన్న వెలుగు
చేస్తుంది మాటల్ని మంచి ముత్యాల్లా.
సరైనది చేస్తే ఎప్పుడూ మనం,
మహిమపరుస్తాము మన తండ్రిని.
(కీర్త. 119:130; మత్త. 5:14, 15, 45; కొలొ. 4:6 కూడా చూడండి.)