కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/11 పేజీ 1
  • ‘మీ వెలుగు ప్రకాశించనివ్వండి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘మీ వెలుగు ప్రకాశించనివ్వండి’
  • మన రాజ్య పరిచర్య—2011
  • ఇలాంటి మరితర సమాచారం
  • “మీ వెలుగును ప్రకాశింపనివ్వండి”
    మన రాజ్య పరిచర్య—2001
  • మన వెలుగును ఎడతెగక ప్రకాశింపజేయడం
    మన రాజ్య పరిచర్య—1995
  • యెహోవాకు మహిమ తెచ్చేలా “మీ వెలుగు ప్రకాశింపనివ్వండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • లోకమునకు వెలుగైయున్న వానిని అనుసరించుడి
    కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2011
km 5/11 పేజీ 1

‘మీ వెలుగు ప్రకాశించనివ్వండి’

1. దేన్ని పంచుకునే ఆధిక్యత మనకుంది?

1 సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అందంగా ప్రకాశించే వెలుగు యెహోవా దేవునికి ఘనతను తెస్తుంది. అయితే, యేసు తన శిష్యులతో మరో రకమైన వెలుగు, అంటే “జీవపు వెలుగు” కలిగివుండమని చెప్పాడు. (యోహా. 8:12) ఈ ఆధ్యాత్మిక అవగాహన మనకు దొరికిన గొప్ప ఆధిక్యత, అయితే దానితోపాటు మనకు గంభీరమైన బాధ్యతలు కూడా వచ్చాయి. ఇతరులకు ప్రయోజనం కలిగేవిధంగా ‘మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశించనివ్వండి’ అని యేసు ఉపదేశించాడు. (మత్త. 5:16) గాఢమైన ఆధ్యాత్మిక అంధకారం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఈ వెలుగును వేరేవాళ్లతో తప్పక పంచుకోవాలి, ఇలా చేయడం ముందెప్పటికన్నా ఇప్పుడు ఎంతో అవసరం! యేసులా మనం మన వెలుగును ఎలా ప్రకాశించనివ్వవచ్చు?

2. ఆధ్యాత్మిక వెలుగును వేరేవాళ్లతో పంచుకోవడం ముఖ్యమని యేసు ఎలా చూపించాడు?

2 ప్రకటించడం ద్వారా: ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ, ఇళ్లల్లో, సంతవీధుల్లో, కొండ ప్రాంతాల్లో వాళ్లకు సత్యపు వెలుగు తెలియజేయడానికి యేసు తన సమయాన్ని, శక్తిని, వనరులను ఉపయోగించాడు. ప్రజలకు సరైన ఆధ్యాత్మిక అవగాహన కల్పించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎంతోకాలం ఉంటాయని యేసు గ్రహించాడు. (యోహా. 12:46) ఇంకా ఎక్కువమందిని చేరుకోవడానికి, ఆయన తన శిష్యులను ‘లోకానికి వెలుగుగా’ ఉండేలా సిద్ధం చేశాడు. (మత్త. 5:14) తమ పొరుగువాళ్లకు మేలు చేయడం ద్వారా, ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేయడం ద్వారా వాళ్లు తమ వెలుగును ప్రకాశించనిస్తారు.

3. సత్యపు వెలుగును మనం నిజంగా విలువైనదిగా ఎంచుతున్నామని ఎలా చూపించవచ్చు?

3 ‘వెలుగు సంబంధుల్లా నడుచుకోండి’ అనే బాధ్యతను దేవుని ప్రజలు గంభీరంగా తీసుకుని, ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రకటిస్తారు. (ఎఫె. 5:10) స్కూల్లో, ఉద్యోగ స్థలాల్లో విరామ సమయాలప్పుడు, అందరికీ కనిపించేలా బైబిలు లేదా మన క్రైస్తవ ప్రచురణలు చదివితే లేఖనాల గురించి మాట్లాడే మంచి అవకాశం దొరకవచ్చు. ఒక యౌవన సహోదరి అలాగే చేసి ఒక బైబిలు అధ్యయనం మొదలుపెట్టింది, తోటి విద్యార్థులకు 12 పుస్తకాలు ఇచ్చింది!

4. ‘మన వెలుగును ప్రకాశించనివ్వాలంటే’ మన ప్రవర్తన మంచిగా ఎందుకుండాలి?

4 మంచి పనుల ద్వారా: మన వెలుగును ప్రకాశించనివ్వాలంటే మన రోజువారీ ప్రవర్తన కూడా సరిగ్గా ఉండాలి. (ఎఫె. 5:9) ఉద్యోగ స్థలంలో, స్కూల్లో, బయట మరెక్కడైనా ఉన్నప్పుడు మన క్రైస్తవ ప్రవర్తన అందరికీ కనబడుతుంది కాబట్టి, బైబిలు సత్యాల గురించి వాళ్లతో మాట్లాడే అవకాశాలు మనకు దొరుకుతాయి. (1 పేతు. 2:12) ఉదాహరణకు, ఐదు సంవత్సరాల అబ్బాయి మంచి ప్రవర్తన చూసి వాళ్ల టీచర్‌ ఆ అబ్బాయి తల్లిదండ్రులతో, “మంచి చెడుల గురించి ఇంత చక్కగా తెలిసిన మీ అబ్బాయి లాంటి వాళ్లను నేనెప్పుడూ చూడలేదు” అంది. మన పరిచర్య వల్ల, మన మంచి ప్రవర్తన వల్ల ప్రజలు “జీవపు వెలుగు” వైపు ఆకర్షించబడతారు, మన దేవునికి స్తుతి కలుగుతుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి