కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 12/15 పేజీలు 28-29
  • యెహోవా కనికరముతో పరిపాలిస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా కనికరముతో పరిపాలిస్తాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా కనికరాన్ని అనుకరించడం
  • క్రూరమైన లోకంలో కనికరం
  • “కరుణాచిత్తులై” ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • యెహోవాలా కనికరం చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • వాత్సల్యంతో కూడిన కనికరంగలవారై ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ‘మన దేవుని గొప్ప కనికరం’
    యెహోవాకు దగ్గరవ్వండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 12/15 పేజీలు 28-29

యెహోవా కనికరముతో పరిపాలిస్తాడు

చరిత్రంతటిలో అనేకమంది మానవ పరిపాలకులు తమ అధీనంలోవున్న ప్రజల ఎడల కనికరం లేకుండా కఠినంగా వారి మీద అధికారం చెలాయించారు. అయితే యెహోవా ఒక జనాంగాన్ని—ఇశ్రాయేలీయులను—ఏర్పర్చుకొని వారిని కనికరంతో పరిపాలించడం ద్వారా తేడాను ప్రదర్శించాడు.

ఇశ్రాయేలీయులు ఇంకా ప్రాచీన ఐగుప్తులో దాసులుగా ఉన్నప్పుడు, సహాయం కొరకు వారు చేసిన మొరలను యెహోవా విన్నాడు. “వారి యావద్బాధలో ఆయన బాధనొందెను. . . . ప్రేమచేతను తాలిమి [“కనికరము,” NW] చేతను వారిని విమోచించెను.” (యెషయా 63:9) యెహోవా ఇశ్రాయేలీయులను రక్షించాడు, అద్భుతమైన ఆహారాన్ని వారికి దయచేశాడు, వారి సొంత దేశానికి వారిని చేర్చాడు.

యెహోవా దేవుని లక్షణమైన కనికరము ఈ జనాంగానికి ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రంలో మరింత స్పష్టపర్చబడింది. అనాధలతో, విధవరాండ్రతో, మరియు పరదేశులతో కనికరంగా వ్యవహరించాలని ఆయన ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. వారు వికలాంగుల నుండి అన్యాయంగా లాభాన్ని ఆర్జించకూడదు.

అవసరంలో ఉన్నవారికి కనికరం చూపాలని ధర్మశాస్త్రం కోరుతుంది. పంటకోసిన తరువాత పేదవారు పరిగె ఏరుకోవచ్చు. ఋణములు సబ్బాతు (ఏడవ) సంవత్సరములో కొట్టివేయబడేవి. అమ్ముకొనబడిన స్వాస్థ్యపు భూములన్నింటినీ సునాద (50వ) సంవత్సరంలో తిరిగి ఇచ్చేయాలి. ప్రాచీన ఇశ్రాయేలు—దాని జీవనం మరియు సమాజాలు (ఆంగ్లం) ఇలా నివేదిస్తుంది: “ఇశ్రాయేలులో, ఆధునిక భావంలో సామాజికవర్గాలు అసలు ఉనికిలో లేనేలేవు.” “వారు నివాసమేర్పరచుకున్న తొలి రోజుల్లో, ఇశ్రాయేలీయులందరు దాదాపు ఒకే విధమైన జీవన ప్రమాణాన్ని ఆనందించారు.”—లేవీయకాండము 25:10; ద్వితీయోపదేశకాండము 15:12-14; 24:17-22; 27:18.

యెహోవా కనికరాన్ని అనుకరించడం

దేవుని సేవకులు ఆయన కనికరం ద్వారా ప్రేరేపింపబడ్డారు. ఉదాహరణకు, చరిత్రంతటిలో కొత్తగా రాజులైన కొంతమంది మునుపటి రాజవంశములో మిగిలివున్న సభ్యులను చంపేశారు. కాని యెహోవా సేవకుడైన దావీదు అలా చేయలేదు. రాజైన సౌలు మరణం తరువాత, సౌలు యొక్క మనుమడు మరియు వారసుడు అయిన మెఫీబోషెతును దావీదు కాపాడాడు. “సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతుపై రాజు కనికరం చూపించాడు.”—2 సమూయేలు 21:7, NW.

యేసు చేసినట్లుగా ఏ ఇతర మానవుడూ యెహోవా యొక్క కనికరాన్ని అనుకరించలేదు. ఆయన చేసిన అద్భుతాల్లో అనేకం దైవిక కనికరం ద్వారా ప్రేరేపించబడ్డాయి. ఒక సందర్భంలో ఒక కుష్ఠురోగి, “నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని” ఆయనను వేడుకున్నాడు. యేసు కనికరపడి, “నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని” చెబుతూ అతని ముట్టుకున్నాడు. (మార్కు 1:40-42) మరొక సమయంలో గొప్ప సమూహము యేసును వెంబడించింది. మాటల కోలాహలం మధ్యనూ, “ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని” ఇద్దరు గుడ్డివారు బిగ్గరగా అడగడాన్ని యేసు ఆలకించి, “కనికరపడి వారి కన్నులు ముట్టెను; వెంటనే వారు దృష్టిపొందిరి.”—మత్తయి 20:29-34.

విస్తారమైన సమూహములు, ఇతరుల యెడల యేసుకున్న భావాలను మొద్దుబారజేయలేదు. వారు కొద్ది రోజులుగా ఏమీ తినలేదు గనుక “నేను వారిమీద కనికరపడుచున్నాను” అని ఒక సందర్భంలో ఆయన అన్నాడు. కాబట్టి ఆయన వారికి అద్భుతరీతిగా ఆహారం పెట్టాడు. (మార్కు 8:1-8) యేసు పర్యటించేటప్పుడు, ఆయన జనసమూహానికి బోధించడమే కాకుండా వారి అవసరతలను గమనించేవాడు. (మత్తయి 9:35, 36) అలాంటి ఒక పర్యటన తరువాత యేసుకు, ఆయన శిష్యులకు భోజనం చేయడానికి కూడా తీరిక సమయం దొరకలేదు. బైబిలు వృత్తాంతం ఇలా చెబుతుంది: “కాగా వారు దోనె యెక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లిరి. వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటె ముందుగా వచ్చిరి గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింపసాగెను.”—మార్కు 6:31-34.

కేవలం ప్రజల అనారోగ్యం మరియు పేదరికం కాదు గాని వారి యొక్క ఆధ్యాత్మిక స్థితియే యేసును కదిలించింది. ప్రజల నాయకులు వాళ్ల స్వప్రయోజనం నిమిత్తం వారిని దోచుకునేవారు, కాబట్టి యేసు ‘వారి ఎడల కనికరంతో కదిలించబడ్డాడు.’ ‘కనికరంతో కదిలించబడడం’ అనే పదబంధం కొరకు ఉపయోగించబడిన గ్రీకు పదం యొక్క అర్థం “కడుపు తరుక్కుపోయిన అవ్యక్తానుభూతిని పొందడం.” యేసు నిజంగా కనికరంగల వ్యక్తి!

క్రూరమైన లోకంలో కనికరం

యెహోవా పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు ఇప్పుడు రాజు. దేవుడు ప్రాచీన ఇశ్రాయేలులో చేసినట్లుగానే, నేడు తన ప్రజలను కనికరంతో పరిపాలిస్తున్నాడు. “‘నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయసంపాద్యమై యుందురు; నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.’”—మలాకీ 3:17.

యెహోవా కనికరాన్ని పొందాలని కోరుకొనేవారు ఆయన విధానాలను అనుసరించాలి. నిజమే, అవసరంలో ఉన్నవారికి సహాయంచేసే బదులు తమ జీవన విధానాలను కాపాడుకోవడంలో ఎక్కువ ఆసక్తి గల ప్రజలున్న లోకంలో మనం జీవిస్తున్నాము. అధికారంగల పురుషులు తరచూ కార్మికుల మరియు వినియోగదారుల భద్రతను బలిచేస్తూ, తమ లాభం కొరకే ప్రయత్నిస్తారు. అనేకుల హృదయాల్లో కనికరమే లేకుండా హరించివేసిన మన కాలంలోని నైతిక పరిస్థితిని బైబిలు 2 తిమోతి 3:1-4లో సరిగ్గా వర్ణిస్తోంది.

అయినప్పటికీ, కనికరం చూపించే అవకాశాలను మనం కనుగొనవచ్చు. మన పొరుగువారికి అవసరమైన కొంత సహాయాన్ని మనం అందించగలమా? మనం సందర్శించాల్సిన, అస్వస్థత గలవారెవరైనా ఉన్నారా? “ధైర్యము చెడినవారిని ధైర్యపర్చుడి, బలహీనులకు ఊత నియ్యుడి” అనే సలహామేరకు మానసికంగా కృంగినవారిని మనం ఓదార్చగలమా?—1 థెస్సలొనీకయులు 5:14.

ఇతరులు తప్పిదములు చేసినప్పుడు మనం కఠినంగా ప్రతిస్పందించకుండా ఉండడానికి కూడా కనికరం మనకు సహాయం చేస్తుంది. “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయకలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు [“ధారాళముగా,” NW] క్షమించుడి” అని మనకు చెప్పబడింది.—ఎఫెసీయులు 4:31, 32.

అధికారాన్ని దుర్వినియోగపర్చే ధోరణిని విసర్జించడానికి కనికరం మనకు సహాయం చేస్తుంది. “మీరు జాలి [“కనికరము,” NW] గల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి” అని బైబిలు చెబుతుంది. (కొలొస్సయులు 3:12) మన పర్యవేక్షణ క్రిందవున్న వారి స్థానంలో మనల్ని మనం ఉంచుకునేలా వినయం మనకు సహాయం చేస్తుంది. కనికరం కల్గివుండడంలో, ప్రీతిపర్చలేని వ్యక్తులుగా ఉండే బదులు వినయంగా మరియు సహేతుకంగా ఉండడం చేరివుంది. ప్రజలను కేవలం యంత్ర భాగాలుగా చూడడానికి సామర్థ్యం ఒక సాకుగా ఉండకూడదు. అంతేకాకుండా, కుటుంబంలో భార్యలు బలహీనమైన ఘటములని కనికరంగల భర్తలు గుర్తుంచుకుంటారు. (1 పేతురు 3:7) కనికరంగల యేసు మాదిరి గురించి ఆలోచించడం ఈ విషయాలన్నిటిలో మనకు సహాయం చేస్తుంది.

యేసు తన భూపరిచర్య కాలంలో ప్రజల ఎడల ఎంతో జాలిచూపించాడు గనుక, ఆయన ఇప్పుడు, ఇకముందు కూడా కనికరంతో పరిపాలిస్తాడని మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు. 72వ కీర్తన ఆయన గురించి ప్రవచనార్థకంగా ఇలా చెబుతుంది: “ప్రజలలో శ్రమనొందువారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగగొట్టును. సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును.”—కీర్తన 72:4, 8, 13.

దేవుని వాక్యం ఇలా ప్రవచిస్తోంది: “నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శచేయును . . . దుష్టులను చంపును.” క్రూరమైన, మృగాల్లాంటి ప్రజలు తమ మార్గాలను మార్చుకోవడాన్ని గురించి వర్ణించిన తర్వాత, ప్రవచనం ఇంకా ఇలా చెబుతుంది: “నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగము హాని చేయదు నాశనముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.” (యెషయా 11:4-9) యెహోవాను తెలుసుకొని, ఆయన కనికరంగల మార్గాలను అనుకరించే ప్రజల భూవ్యాప్త సంస్థ గురించి నిజంగా ఈ ప్రవచనం వాగ్దానం చేస్తోంది!

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి