కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w06 1/15 పేజీ 3
  • దేవదూతలు ఎవరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవదూతలు ఎవరు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవదూతలు అంటే ఎవరు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • దేవదూతలు—‘పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • దేవదూతలు మనపై ఎలా ప్రభావం చూపిస్తారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • దేవదూతలు మీకు ఎలా సహాయం చేయగలరంటే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
w06 1/15 పేజీ 3

దేవదూతలు ఎవరు?

ఒక మహా సామ్రాజ్యపు చక్రవర్తి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అగ్నిలో దహించబడాలని శిక్షవిధించబడిన ముగ్గురు వ్యక్తులు మరణ కోరల నుండి తప్పించుకున్నారు! వాళ్ళను ఎవరు కాపాడారు? అలా కాపాడబడిన ఆ ముగ్గురితో స్వయంగా రాజే ఇలా అన్నాడు: “[మీ] దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను.” (దానియేలు 3:28) దాదాపు రెండు సహస్రాబ్దాల పూర్వపు ఈ బబులోను పరిపాలకుడు దేవదూతలు రక్షించారనడానికి ప్రత్యక్షసాక్షిగా ఉన్నాడు. పూర్వకాలాల్లో కోట్లాదిమంది దేవదూతలను నమ్మారు. నేడు అనేకులు, దేవదూతలు ఉనికిలో ఉన్నారని నమ్మడమే గాక దేవదూతలు తమ జీవితాలను ఏదో ఒకవిధంగా ప్రభావితం చేస్తున్నారని భావిస్తున్నారు. దేవదూతలంటే ఎవరు, వారు ఎక్కడి నుండి వచ్చారు?

బైబిలు ప్రకారం, దేవదూతలు కూడా దేవునిలా ఆత్మలే. (హెబ్రీయులు 1:14; యోహాను 4:24) దేవదూతల కుటుంబం చాలా పెద్దది, దేవదూతలు కోట్ల సంఖ్యలో ఉన్నారు. (ప్రకటన 5:11) వాళ్ళంతా “బలశూరులు.” (కీర్తన 103:20) వ్యక్తిత్వం, స్వేచ్ఛాచిత్తం కలిగివుండడంలో దేవదూతలు మానవుల్లా ఉన్నా, వాళ్ళు మానవులుగా తమ జీవితాలను ఆరంభించలేదు. వాస్తవానికి, దేవుడు మానవజాతిని సృష్టించడానికి చాలాకాలం పూర్వమే, అంటే భూగ్రహం కూడా సృష్టించబడక పూర్వమే దేవదూతలను సృష్టించాడు. దేవుడు ‘భూమికి పునాదులు వేసినప్పుడు ఉదయనక్షత్రములు [దేవదూతలు] ఏకముగా కూడి పాడారు, దేవదూతలందరు ఆనందించి జయధ్వనులు చేశారు’ అని బైబిలు చెబుతోంది. (యోబు 38:4, 7) దేవదూతలను దేవుడు సృష్టించాడు కాబట్టి వాళ్ళు దేవుని కుమారులు అని పిలువబడుతున్నారు.

దేవుడు దేవదూతలను ఎందుకు సృష్టించాడు? మానవ చరిత్రలో దేవదూతలు ఏదైనా పాత్ర నిర్వహించారా, అయితే ఏ పాత్ర నిర్వహించారు? నేడు వాళ్ళు మన జీవితాలను ప్రభావితం చేస్తారా? వాళ్ళకు నైతిక స్వేచ్ఛ ఉంది కాబట్టి, దేవదూతలెవరైనా అపవాదియగు సాతాను మార్గాన్ని అనుసరించి దేవుని శత్రువులుగా మారారా? ఈ ప్రశ్నలకు బైబిలు సత్యవంతమైన సమాధానాలు ఇస్తోంది.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి