కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w18 మే పేజీ 32
  • కోతకొచ్చిన పంట చాలా ఉంది!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కోతకొచ్చిన పంట చాలా ఉంది!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • మంచివార్త ప్రకటించే పద్ధతులు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • పరాగ్వేలో ప్రత్యేకంగావున్న ప్రాంతములో పనిచేయుట ఫలితాన్నిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • మీకు వ్యక్తిగత క్షేత్రం ఉందా?
    మన రాజ్య పరిచర్య—2006
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
w18 మే పేజీ 32
2012లో యుక్రెయిన్‌లోని నిజ్హన్య ఆప్‌షాలో జరిగిన జిల్లా సమావేశం

2012లో యుక్రెయిన్‌లోని నిజ్హన్య ఆప్‌షాలో జరిగిన జిల్లా సమావేశం

కోతకొచ్చిన పంట చాలా ఉంది!

ఈ చివరి రోజుల్లో కోయాల్సిన పంట చాలా ఉంటుందని యేసు తన అనుచరులకు ముందే చెప్పాడు. (మత్త. 9:37; 24:14) యేసు చెప్పిన మాటలు యుక్రెయిన్‌లోని ట్రాన్స్‌కార్పాతీయ అనే ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన విధానంలో ఎలా నిజమయ్యాయో చూద్దాం. ట్రాన్స్‌కార్పాతీయలో ఉన్న మూడు పట్టణాల్లోనే 5,400 కన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉన్నారు, 50 సంఘాలు ఉన్నాయి.a అంటే ఆ మూడు పట్టణాల్లో ఉన్న మొత్తం జనాభాలోని ప్రతీ నలుగురిలో ఒకరు యెహోవాసాక్షి అన్నమాట!

అక్కడి ప్రజలు ఎలాంటివాళ్లు? “వాళ్లు బైబిల్ని గౌరవిస్తారు, న్యాయానికి విలువిస్తారు, కుటుంబ బంధాలకు ప్రాముఖ్యతనిస్తారు, ఒకరికొకరు మనస్ఫూర్తిగా సహాయం చేసుకుంటారు. అంతేకాదు మన నమ్మకాలన్నిటినీ ఒప్పుకోకపోయినా బైబిలు నుండి ఏదైనా చెప్తే శ్రద్ధగా వింటారు” అని వాసీలె అనే స్థానిక సహోదరుడు చెప్తున్నాడు.

మంచివార్త వినాల్సిన ప్రజలకన్నా ప్రచారకుల సంఖ్య ఎక్కువున్న ప్రాంతాల్లో ప్రీచింగ్‌ చేసేటప్పుడు సహోదరసహోదరీలు కొన్ని అసాధారణమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఉదాహరణకు, ఒక ప్రాంతంలో కేవలం 50 ఇళ్లే ఉన్నాయి కానీ అక్కడున్న సంఘంలో 134 మంది ప్రచారకులు ఉన్నారు! మరి ఇలాంటి పరిస్థితిలో ప్రచారకులు ఏమి చేశారు?

అందుకే చాలామంది సహోదరసహోదరీలు అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లడానికి ముందుకొచ్చారు. “మా ప్రాంతంలో ప్రతీ ప్రచారకుడు రెండు ఇళ్లు మాట్లాడితే చాలు క్షేత్రం మొత్తం అయిపోతుంది. నేనిప్పుడు మా పల్లెటూరులో ప్రీచింగ్‌ చేస్తున్నాను. కానీ నా ఆరోగ్యం బాగున్న రోజుల్లో, 160 కి.మీ. దూరంలో ఉన్న హంగేరియన్‌ భాషా ప్రాంతానికి వెళ్లి ప్రీచింగ్‌ చేసేవాణ్ణి” అని యోనాష్‌ అనే 90 ఏళ్ల సహోదరుడు చెప్పాడు. ప్రచారకులు ఇతర ప్రాంతాల్లో ప్రీచింగ్‌ చేయడానికి త్యాగాలు చేయాల్సి ఉంటుందని చెప్తూ ఆ సహోదరుడు ఇలా అన్నాడు, “నేను ట్రైన్‌ అందుకోవడానికి ఉదయాన్నే 4 గంటలకు లేచేవాణ్ణి. రోజంతా ప్రీచింగ్‌ చేసి మళ్లీ సాయంత్రం 6 గంటల ట్రైన్‌లో ఇంటికి వచ్చేవాణ్ణి. వారంలో రెండు మూడు రోజులు అలాగే చేసేవాణ్ణి.” మరి ఆ సహోదరుని కృషికి ఫలితం దక్కిందా? “అలా ప్రీచింగ్‌ చేసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉండేది. మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక కుటుంబం సత్యం నేర్చుకోవడానికి నేను సహాయం చేశాను” అని ఆ సహోదరుడు చెప్తున్నాడు.

నిజమే, ఆ సంఘాల్లోని ప్రతీఒక్కరూ సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయలేరు. కానీ, వృద్ధ ప్రచారకులతోసహా మిగతా ప్రచారకులందరూ స్థానికంగా ఉన్న ప్రాంతాన్ని పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలా చేయడంవల్ల 2017లో, ట్రాన్స్‌కార్పాతీయలో ఉన్న మూడు పట్టణాల్లో ఉన్న జనాభాలోని సగంమంది అంటే అక్కడున్న ప్రచారకులకు రెండింతల మంది జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చారు. దీన్నిబట్టి, మనం ఎక్కడ సేవ చేసినప్పటికీ “ప్రభువు సేవలో” చేయడానికి ఎంతో పని ఉందని అర్థమౌతుంది.—1 కొరిం. 15:58.

a ఆ మూడు పట్టణాలు ఏమిటంటే: హెలీబోక్య పోటీక్‌, సరడ్నన్య వోద్యాన, నిజ్హన్య ఆప్‌షా.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి