కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/06 పేజీ 8
  • మీకు వ్యక్తిగత క్షేత్రం ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకు వ్యక్తిగత క్షేత్రం ఉందా?
  • మన రాజ్య పరిచర్య—2006
  • ఇలాంటి మరితర సమాచారం
  • వ్యక్తిగత క్షేత్రం తీసుకోగలరేమో ఆలోచించండి
    మన రాజ్య పరిచర్య—2013
  • మంచివార్త ప్రకటించే పద్ధతులు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ప్రశ్నాభాగం
    మన రాజ్య పరిచర్య—2000
  • ప్రజలు ఇళ్ళలో లేనప్పుడు
    మన రాజ్య పరిచర్య—2007
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2006
km 12/06 పేజీ 8

మీకు వ్యక్తిగత క్షేత్రం ఉందా?

1. వ్యక్తిగత క్షేత్రం అంటే ఏమిటి?

1 వ్యక్తిగతంగా మీకు నియమించబడేదే వ్యక్తిగత క్షేత్రం. ఆ క్షేత్రానికి మీరు త్వరగా చేరుకొని, మీరు ఒంటరిగా లేదా ఇతరులతో కలిసి ప్రకటించడానికి వీలుగా అది దగ్గరి ప్రాంతంలో ఉండవచ్చు. సాధ్యమైనప్పుడల్లా కలిసి సాక్ష్యమివ్వడానికి సంఘం చేసిన ఏర్పాట్లకు మద్దతునివ్వడం ప్రయోజనకరమైనప్పటికీ, ప్రత్యేకంగా సంఘాలకు పెద్ద క్షేత్రం ఉన్నప్పుడు, ఇతర సందర్భాల్లో పని చేయడానికి వ్యక్తిగత క్షేత్రాన్ని కలిగివుండడం సమగ్రంగా సాక్ష్యమివ్వడానికి సహాయకరంగా ఉండగలదు.​—అపొ. 10:42.

2. వ్యక్తిగత క్షేత్రాన్ని కలిగివుండడంవల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఏమిటి?

2 ప్రయోజనాలు: భోజన విరామ సమయంలో లేదా పని అయిపోయిన వెంటనే ప్రకటించడానికి వీలుగా వారి ఉద్యోగస్థలానికి దగ్గర్లోని క్షేత్రంలో ప్రకటించడం వల్ల అదనపు ప్రయోజనాలున్నట్లు కొంతమంది కనుగొన్నారు. ఇతరులు సంఘ పుస్తక అధ్యయనానికి ముందు కుటుంబంగా కలిసి వారి దగ్గరి ప్రాంతంలో గంట లేదా అంతకన్నా ఎక్కువసేపు పనిచేయడంలో ఆనందాన్ని పొందారు. దాని ఫలితంగా, దగ్గరి క్షేత్రంలో దొరికిన పునర్దర్శనాలు, బైబిలు అధ్యయనాలు శక్తిని, సమయాన్ని, డబ్బును ఆదా చేశాయి. తక్కువ సమయంలో ఎక్కువ పూర్తిచేయడానికి వీలవుతుంది కాబట్టి, వ్యక్తిగత క్షేత్రాన్ని కలిగివుండడం అప్పుడప్పుడూ సహాయ పయినీరు సేవను లేదా క్రమ పయినీరు సేవను చేయడానికి కొంతమందికి సహాయం చేయవచ్చు. దానితోపాటు, వ్యక్తిగత క్షేత్రంలో పనిచేయడం, ఇంటివారితో మంచి పరిచయాన్ని కలిగివుండడం, మనం వారి నమ్మకాన్ని చూరగొనడానికి, మన అందింపును వారి చింతలకు తగినవిధంగా మలచుకోవడానికి, మన పరిచర్యను ప్రభావవంతంగా చేయడానికి మనకు సహాయం చేయగలవు.

3. వ్యక్తిగత క్షేత్రాన్ని తీసుకున్న ఒక పయినీరు అనుభవమేమిటి?

3 ప్రయాణ పైవిచారణకర్తద్వారా వ్యక్తిగత క్షేత్రాన్ని తీసుకోమని ప్రోత్సహించబడిన ఒక పయినీరు ఇలా చెబుతోంది: “నేను ఆ సలహాను పాటించాను, త్వరలోనే నా క్షేత్రంలో ఉన్న ఇంటివారితో మంచి పరిచయాన్ని, స్నేహాన్ని పెంచుకున్నాను. నా సందర్శనాల సమయాలను వారికి అనుకూలంగా ఉండే విధంగా సర్దుబాటు చేసుకున్నాను. ఫలితంగా, నా పునర్దర్శనాలు నెలకు 35 నుండి 80కి పెరిగాయి, నాకు 7 గృహ బైబిలు అధ్యయనాలు ఉన్నాయి.”

4. మీరెలా వ్యక్తిగత క్షేత్రాన్ని తీసుకొని, పనిచేయవచ్చు?

4 వ్యక్తిగత క్షేత్రాన్ని ఎలా తీసుకోవాలి: మీకు ఒకవేళ వ్యక్తిగత క్షేత్రం కావాలంటే, క్షేత్రాన్ని నియమించే సేవకునితో మాట్లాడండి. మీతో పాటు పనిచేయడానికి ఇతర ప్రచారకుని ఆహ్వానించడానికి సంకోచించకండి, ఇంటివద్ద లేనివారి గురించి వ్రాసిపెట్టుకోండి. మీరు నాలుగు నెలల్లోగా క్షేత్రాన్ని పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. అలా పూర్తి చేయడం కష్టమనిపిస్తే, మీ సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్తను లేదా ఇతరులను సహాయం చేయమని అడగవచ్చు. నాలుగునెలల అంతాన, పూర్తిచేసిన క్షేత్రాన్ని తిరిగి ఇచ్చేయవచ్చు లేదా మళ్ళీ అదే క్షేత్రాన్ని అడగవచ్చు. అయితే, ఆ క్షేత్రాన్ని ఎప్పటికీ మీరే ఉంచుకోకూడదు, బదులుగా ఇతరులు అడగడానికి వీలుగా దానిని తిరిగి ఇచ్చేయాలి. క్షేత్రం తక్కువగా ఉన్న సంఘంలో మీరున్నట్లైతే, వ్యక్తిగత క్షేత్రాన్ని పొందడం సాధ్యంకాకపోతే, బహుశా క్షేత్రంలోని కొంత భాగాన్ని ఇవ్వమని మీ పుస్తక అధ్యయన పైవిచారణకర్తను అడగవచ్చు.

5. ప్రకటించమని మనకివ్వబడిన ఆజ్ఞను నెరవేర్చడానికి ఏమి అవసరం?

5 “లోకమందంతట” ప్రకటించమని మనకివ్వబడిన ఆజ్ఞ నిజానికి గంభీరమైన నియామకం. (మత్త. 24:14) దాన్ని నెరవేర్చేందుకు సమిష్టి కృషి అవసరం. కలిసి సాక్ష్యమివ్వడంతోపాటు, వ్యక్తిగత క్షేత్రంలో ప్రకటించడం సువార్తతో సాధ్యమైనంత ఎక్కువమందిని చేరడానికి సహాయం చేస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి