బైబిలును మరియెక్కువగా ఉపయోగించుట
1 “దేవుని వాక్యము సజీవమై బలముగలదై” యున్నది. (హెబ్రీ. 4:12) దాని శక్తి పూర్తిగా ఉపయోగింపబడి, సజీవమైనదిగా ఉండాలంటే, అది పఠించబడి ఆచరణలో పెట్టబడవలెను. దీనిని నెరవేర్చుట కొరకు యెహోవా సంస్థ, ముఖ్యముగా 1954వ సంవత్సరమునుండి ఇంటింటి పరిచర్యలో బైబిలును ఉపయోగించుటను మనలను ప్రోత్సహించుచున్నది. ఇంటింటి దర్శనములందు ఇంటివారితో మూడు నుండి ఎనిమిది నిముషముల ప్రసంగములను మాటలాడుతూ ముఖ్యమైన అంశములను గూర్చి బైబిలు చెప్పుదానిని తెలియజేయుటకు మనము శిక్షణ పొందియున్నాము.
2 మరీ ఇటీవలి సంవత్సరములలో మన రాజ్య పరిచర్య ప్రాంతీయసేవలో వాడదగిన అంశముపై 2, 3—లేఖనములతో సంభాషణా అంశమును అందించుచున్నది. ఉదాహరణకు ప్రస్తుత సంభాషణా అంశము “దేవుని రాజ్యము చేయబోవునవి,” అను అంశముపై యున్నది. ఇందు వాడబడు లేఖనములు, భవిష్యత్తుకై దేవుడు ఉంచిన అద్భుతకర నిరీక్షణను ఉన్నతపరచును.
3 బైబిలును ఫలప్రదముగా ఉపయోగించుటకు మంచి సాధన మరియు అది నిజముగా దేవుని వాక్యమై సజీవముగాను శక్తివంతముగాను ఉన్నదని గుర్తించుటకు ప్రజలకు సహాయము చేయు కోరిక అవసరమైయున్నది. పత్రికా దినకార్యమందు ఆసంబంధముగా క్లుప్తముగా సూటిగా ఇంటివారితో మాటలాడుటకు మనము ప్రోత్సహించబడుచున్నను ప్రాంతీయ పరిచర్య యొక్క ఇతర భాగములందు బైబిలును ఉపయోగించు విషయములో నిర్లక్ష్యమును చూపువారమగుటను మనము కోరము. మొత్తమునకు మనమందరము బైబిలు విద్యార్థులమైయున్నాము. ఈ విషయమును రూఢిపర్చుటకు బైబిలునుండి లేఖనములు వాటి వాటి ద్వారా దేవుడు మానవులకై ఈ భూమిమీద చేయనైయున్నవాటిని వివరించు మన ప్రయత్నము కంటె శ్రేష్టమైన వేరే మార్గమేమున్నది?
రీజనింగ్ పుస్తకమునుండి సహాయము
4 మన రాజ్య పరిచర్యలోని సంభాషణా అంశముతోపాటు రీజనింగ్ ఫ్రంది స్క్రిప్చర్స్ అను పుస్తకమును కూడా కలిగియున్నాము. అందులోని 9-15 పేజీలలో గల పరిచయములను పునఃపరిశీలించుకొలది, రాజ్యవర్తమానమును ప్రారంభించుటలో వాడదగిన బైబిలు లేఖనములను నీవు కనుగొనెదవు. బైబిలు ఏమి చెప్పుచున్నదో ప్రజలకు చూపించుటకై దానియొద్దకు వెళ్లు అనేక పద్ధతులు మనకు కలవు.
5 ఉదాహరణకు ఇంటివారు తమతో ఉన్న వృద్ధుని విషయమై శ్రద్ధ కలిగియున్నట్లు మనము గ్రహించిన యెడల రీజనింగ్ పుస్తకములో 14వ పేజీలోని “వృద్ధాప్యము, మరణము” అను అంశము క్రిందయున్న దానిని అనుసరించుట వారికి సహాయకరమై యుండవచ్చును. “మనమెందుకు వృద్ధాప్యమునకెదిగి మరణించుచున్నామో మీరెప్పుడైనను ఆలోచించారా?” యని అడుగుట ఎంత తగినదై యుండును! “ప్రేరేపితుడైన బైబిలు వ్రాతగాడు రోమా. 5:12లో ఏమి చెప్పాడో చూపుటకు నేను యిష్టపడుచున్నాను,” అని చెప్పి ఇంకను మీరిట్లు చెప్పవచ్చును: “బైబిలు మనమెందుకు వృద్ధాప్యమున కెదిగి మరణిస్తున్నామో తెలియజేస్తూ, ప్రకటన 21:3, 4 వచనముల యందు మనకొరకు దేవుడుంచిన మంచి నిరీక్షణను కూడా మనముందుంచుచున్నది.” తరువాత ప్రస్తుత సాహిత్యపు అందింపును చూపవచ్చును.
6 ఈ దినములలో తరచుగా ప్రజలు “తొందరలో యున్నాము. మాకు తీరికలేదు” అని చెప్పుటను మనము గమనింతుము. అనేకుల విషయములో అది నిజమే గనుక, వారి విషయములోను పరిస్థితి అదయ్యే యుండవచ్చునను దానిని మనము గుణగ్రహించవలెను. అయినను పరిస్థితులు అనుకూలముగా యున్నట్లయిన నీవిట్లు చెప్పవచ్చును: “నేను అర్థము చేసుకొంటాను. ఈ కాలములు చాలా తొందర సమయములై యున్నవి. ఏమైనను కేవలము ఈ ఒక్క తలంపుతో మిమ్మును వదలి వెళ్దామనుకుంటున్నాను,” అని ప్రస్తుత సంభాషణా అంశములోని ఒక లేఖనమువైపు త్రిప్పుము. దానిని చదివిన తరువాత తొందరగా నీవేమి సాహిత్యమునందించుచున్నావో తెలిపి, సందర్భమునకు తగిన ఒక చిన్న కరపత్రమునివ్వుము. లేక మరలా ఈ ప్రాంతమును త్వరలో దర్శిస్తానని అప్పుడు వచ్చి నిత్యము జీవించు ఆసక్తిదాయకమైన సాధ్యతను గూర్చి సంభాషిస్తానని చెప్పవచ్చును.
7 మన పరిచర్యలో దేవుని వాక్యమును సమర్థతతో నైపుణ్యముగా ఉపయోగించెడి బైబిలు విద్యార్థులుగా ప్రజలు మనలను చూచుట ఎంత మంచి విషయము! తమ దైనందిన జీవితములో దేవుని వాక్యమును సరిగా అనువర్తించుచు దేవుని వాక్యము మీద ఆధారపడిన ప్రజలెవరో గుర్తించుటకు వారికి ఇది సహాయము చేయును. పత్రికాదినమున తప్ప, ఇతర సాహిత్యమునందించు తక్కిన దినములందు బైబిలునుపయోగించుటకు సిద్ధపడియుండును. బైబిలును ఉపయోగించుటకు మనము చేయు ప్రయత్నములు మన పరిచర్యపై యెహోవా ఆశీర్వాదములను తెచ్చి, అనేకుల మనస్సునందు దేవుని వాక్యము నిజముగా సజీవమై, శక్తిని కలిగియుండి, తమ జీవితములపై ప్రభావము చూపగలదని ఉన్నతపరచును.