దైవపరిపాలనా వార్తలు
◆ డొమినికన్ రిపబ్లిక్ డిసెంబరు నెలలో 11,205 మంది ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను రిపోర్టు చేసినది. బైబిలు పఠనాలు గడచిన డిసెంబరుతో పోల్చితే 18 శాతం ఎక్కువై 20,067 అయ్యాయి. పునర్దర్శనములు 25 శాతము పెరిగాయి.
◆ గయనా గడచిన సంవత్సరం కంటే సరాసరి 8 శాతం పెరిగి డిసెంబరులో 1,468 ప్రచారకుల శిఖరాగ్ర స్థాయిని చూచినది.
◆ ఐర్లాండ్ డిసెంబరులో 2,930 ప్రచారకులను రిపోర్టు చేస్తూ 9వ పరంపర శిఖరాన్ని సాధించారు. 298 రెగ్యులర్ పయనీర్ల శిఖరాన్ని కూడా రిపోర్టు చేశారు.
◆ డిసెంబరులో ఇటలీ 1,63,692 మంది ప్రచారకులను కలిగి గత సంవత్సరము కన్నా 5 శాతము అభివృద్ధికి చేరినది. సంఘ ప్రచారకులు సేవలో సరాసరి 13.1 గంటలు గడిపారు.
◆ మార్టినిక్ డిసెంబరులో 2,649 ప్రచారకులను కలిగి ఒక క్రొత్త శిఖరాన్ని చేరింది. ఇది 9 శాతం పెరుగుదల. ఇది ప్రచారకుల శిఖరంలో నాలుగవ పరంపర. వారి ప్రత్యేక సమావేశ దినమున 4,941 మంది హాజరై 77 మంది బాప్తిస్మము పొందారు.
◆ పెరూ అంతకుముందు సంవత్సరపు డిసెంబరు కన్నా 11 శాతము అభివృద్ధిని సాధించినదై ఈ గడచిన డిసెంబరులో 29,187 మంది ప్రచారకులను రిపోర్టు చేసినది. సంఘములోని ప్రచారకులు సగటున 14.8 గంటలను సేవలో గడిపిరి.
◆ రీ యూనియన్ డిసెంబరులో 10 శాతం అభివృద్ధిని సాధించి గత డిసెంబరులో 1,520 ప్రచారకుల క్రొత్త శిఖరాన్ని రిపోర్టు చేసినది. వారి ప్రత్యేక సమావేశమునకు 2,890 మంది హాజరై, 65 మంది బాప్తిస్మము పొందిరి.
◆ సురీనేమ్‌యొక్క అభివృద్ధి ముందటి సం.పు. డిసెంబరు కన్నా క్రితము సం.పు. డిసెంబరులో 12 శాతము అభివృద్ధియై 1,369 మంది ప్రచారకుల శిఖరాగ్ర స్థాయిని చేరినది.