దైవపరిపాలనా వార్తలు
బొలీవియా: అక్టోబరులో క్రొత్త శిఖరాగ్ర సంఖ్యగా 9,588 మంది ప్రచారకులను ఈ బ్రాంచి రిపోర్టుచేసింది. గృహ బైబిలు పఠనాలు, పునర్దర్శనాలు, సంఘ ప్రచారకులు, క్రమ పయినీర్‌లలో కూడా వారు క్రొత్త శిఖరాలను చేరుకున్నారు. సంఘ ప్రచారకులు సరాసరి 14 గంటలు ప్రాంతీయ సేవలో గడిపారు.
ఈస్టోనియా: సెప్టెంబరులో 1,753 మంది ప్రచారకులు సేవచేసినట్లు రిపోర్టు చేస్తున్నారు. గత సంవత్సరపు నెలసరి సరాసరి కంటే ఇది 24 శాతం అభివృద్ధి.
ఇండియా: ఈ దేశంలో ఎన్నడూ లేనంత పెద్ద జిల్లా సమావేశం డిశంబరు 1993 చివరిలో కొట్టాయమ్‌లో జరుగగా దానికి 6,967 మంది హాజరు కాగా, 314 మంది బాప్తిస్మం పొందారు. ఈ బాప్తిస్మ సంఖ్య గత సంవత్సరం ఒక సందర్భంలో ఇండియాలో జరిగిన ఒక పెద్ద సమావేశంలో బాప్తిస్మం పొందిన వారిసంఖ్యకంటే 66 శాతం ఎక్కువ.
మొత్తానికి 21,320 మంది 1993 లో జరిగిన 16 ‘దైవిక బోధ’ జిల్లా సమావేశాలకు హాజరుకాగా, వారిలో 825 మంది ఈ సమావేశాల్లో బాప్తిస్మం పొందారు. ఇండియాలో 1992 లో జరిగిన ‘వెలుగు ప్రకాశకులు’ జిల్లా సమావేశాలకు హాజరైన వారి సంఖ్యకంటే యిప్పుడు హాజరైన వారిసంఖ్య 3 శాతం అభివృద్ధిని సూచిస్తుంది, కాని గత సంవత్సరం జరిగిన సమావేశాల్లో బాప్తిస్మం పొందినవారి సంఖ్యకంటే యిప్పుడు బాప్తిస్మం తీసుకున్నవారి సంఖ్య 15 శాతం ప్రోత్సాహకరమైన అభివృద్ధిని చూపిస్తుంది.
లిథియానియా: క్రొత్త శిఖరాగ్ర సంఖ్యగా 871 మంది ప్రచారకులను అక్టోబరు రిపోర్టు చూపిస్తుంది, యిది 1992 అక్టోబరు కంటే 39 శాతం అభివృద్ధి.
టర్కీ: “దైవిక బోధ” జిల్లా సమావేశానికి 1,510 మంది, హాజరుకాగా, వారిలో 44 మంది తమ సమర్పణను సూచించారు. స్థానిక దూరదర్శిని ఈ సమావేశాన్నిగూర్చి మంచి రిపోర్టును అందించింది.