కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/90 పేజీ 3
  • మన పయినీర్లను మెచ్చుకొనుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మన పయినీర్లను మెచ్చుకొనుట
  • మన రాజ్య పరిచర్య—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎందుకు?
  • సంఘములో
  • పయినీర్లను ప్రోత్సహించుము
  • పయినీర్లకు మద్దతు చూపుట
    మన రాజ్య పరిచర్య—1992
  • పయినీరు పరిచర్యలోని ఆశీర్వాదాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • పయినీరు పరిచర్యలోని ఆశీర్వాదాలు
    మన రాజ్య పరిచర్య—2003
  • యౌవనస్థులతో వారు ఎలా ‘సంతోషించ’వచ్చో చెప్పడం
    మన రాజ్య పరిచర్య—1995
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1990
km 10/90 పేజీ 3

మన పయినీర్లను మెచ్చుకొనుట

1 దేవుని రాజ్యము నిమిత్తమైన తోటిపనివారలు ఒకరినొకరు బలపరచుకుంటారు. (కొలొ. 4:11) క్రైస్తవ సంఘము యొక్క ముఖ్యమైన పని సువార్తను ప్రకటించుటయని మనము తలంచినట్లయిన మన మధ్యలోనున్న పూర్తికాల పనివారలను మెచ్చుకొనుటకు మనము బలమైన కారణములను కలిగియున్నాము.​—మార్కు 13:10; రోమీ. 16:2; ఫిలి. 4:3.

ఎందుకు?

2 స్పష్టమైన రీతిలో పయినీర్లు తక్కువ అనుభవముగల ప్రచారకులతో సువార్తపని యొక్క విభిన్న చర్యలలో పని చేయుట ద్వారా సంఘమును కట్టుదురు. వీటిలో పత్రికా సాక్ష్యము, పునర్దర్శనములకు సిద్ధపడి వాటిని చేయుట, గృహ బైబిలు పఠనములను ప్రారంభించి, వాటిని ఫలవంతముగా చేయుట ఇమిడియున్నవి. అంతేగాక ధైర్యముగా తటస్థ సాక్ష్యమిచ్చుటలోను పయినీర్లు మాదిరినుంచగలరు. వారపు మధ్యలో ఏర్పాటు చేయబడు సమూహసాక్ష్యపు ఏర్పాటులందును వారు ఇతరులకు సహాయకరముగాయుండు అవకాశములను కలిగియున్నారు. మరీ ప్రత్యేకముగా ప్రచారకులలో ఎక్కువమంది పాల్గొనగలుగు వారాంతపు ప్రాంతీయసేవలోను ప్రాంతములో వారియొక్క అనుకూల ప్రభావము తేటముకాగలదు.

3 బాగుగా మరియు తరచుగా ప్రాంతమును చుట్టివచ్చుట యందు పయినీర్లు సంఘములకు సహాయపడుదురు. దీనిని బట్టి ప్రజలు మన వర్తమానముతో ఎక్కువ పరిచయము కలిగియుండి మనము దర్శించునప్పుడు మనమెవరమో ఎరిగియుందురు గనుక వారు మృదువుగా యుండుటకు తోడ్పడును. ప్రాంతములో ప్రజలయొద్ద సాహిత్యములను వదలి, ఆసక్తిని పెంపొదిస్తూ పయినీర్లు ఎక్కువ గంటలు గడుపుట​—అనగా సత్య విత్తనములను నాటుట, మరియు నీరు పోయుట​—మరెక్కువ ఫలవంతమైన ప్రాంతంగా చేయుటకే నడపగలదు.​—1 కొరిం. 3:6.

సంఘములో

4 నమ్మకస్థులైన పయినీర్ల ఉత్సాహము మరియు ఆసక్తి తమ హృదయమును తాకినందున అనేకులు పూర్తికాల సేవలో ప్రవేశించుటకు ప్రోత్సహించబడిరి. సంఘములో ఆ విధముగా ఎవరూ లేనందున ఒక సహోదరి రెగ్యులర్‌ పయినీరుగా అగుటకు వెనుకాడుచుండెను. అయితే ఆమె ప్రాంతీయ కాపరిచే ప్రోత్సహించబడినప్పుడు ముందుకు వెళ్లి ప్రారంభించినది. వెంటనే ఇతరులు ఆమెను అనుకరించారు. ఇప్పుడు ఆ సంఘములో మంచి సంఖ్యలో ఆసక్తిగల పయినీర్లు ఉన్నారు.

5 చురుకుగా లేనివారిగానో, లేక క్రమముగా పనిచేయని వారిగానో తయారైన వ్యక్తికి సహాయము చేయుమని పెద్దలు ఒక పయినీరును అడుగు సమయములుండవచ్చును. ఈ సహాయమందు అట్టి వ్యక్తికి బైబిలు పఠనమును చేయుటయు ఇమిడియుండగలదు. ఆ విధముగా పయినీరు యొక్క ఆసక్తి మరియు విశ్వాసము సత్యముపై వ్యక్తికి గల ప్రేమను తిరిగి ప్రేరేపించి తన సమర్పణయొక్క కర్తవ్యములను నెరవేర్చునట్లు ఆ వ్యక్తి తిరిగి చురుకైన వ్యక్తిగా తయారగుటకు సహాయపడును.​—1 థెస్స. 5:14.

పయినీర్లను ప్రోత్సహించుము

6 పయినీర్లు ఇతరులు ప్రోత్సాహపరచబడుటకు ఎంతో చేయుచుండగా తమ మట్టుకు తమకును వారి సేవ యందు ఆనందముగా కొనసాగుటకు ప్రోత్సాహమవసరమైయున్నది. (రోమీ. 1:12) పయినీరు పరిచర్యను గూర్చి నీవు అనుకూలముగా మాట్లాడుదువా? ఒక పయినీరును అతని లేక ఆమె పని లేక స్వయంత్యాగపూరితమైన స్వభావమును గూర్చి నీవు అభినందించిన చివరిసారి ఎప్పుడు? ప్రత్యేకముగా కొద్దిమంది ప్రచారకులే తమతో ఉండు పగటిగంటలందు తమతో కలసి ఒకరు పనిచేయుటను పయినీర్లు మెచ్చుకొందురు. మీరు పయినీర్లతో కలసి బహుశా ఎక్కువ గంటలు వారి ప్రకటన పనిలో మద్దతుగా గడుపుదురా?

7 ఇంకా ఏ విధముగా మీరు పయినీర్లను ప్రోత్సహించుదురు? అభినందించుటతోపాటు, కష్టించి పనిచేయు అట్టివారలకు మీతోపాటు భోజనమునకు ఆహ్వానించుట ద్వారా లేక మీకై మీరు స్వచ్ఛందంగా వారి ప్రయాణఖర్చులకు సహాయపడుట ద్వారా, మరియు మీకు చేతనైన ఇతర మార్గములలో బలపరచుటద్వారాను మీ మెప్పును వ్యక్తపరచవచ్చును.​—1 థెస్సలొనీకయులు 5:12, 13 ను పోల్చుము.

8 పెద్దలు మరియు పరిచారకులు సంఘములో నాయకత్వము వహించుచుండగా పయినీర్లు, మరియు ప్రచారకులు, బాగుగా ఏర్పాటు చేయబడిన ప్రాంతీయ సేవా ఏర్పాట్లను బలపరచగలరు. ఆ విధముగా “ఒకరికొకరము ఉపచారము” చేసికొనుట యందు మనము కలిగియున్న కృపావరములను మనమందరము ఉపయోగించుదుము.​—1 పేతు. 4:10, 11.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి