యౌవనస్థులతో వారు ఎలా ‘సంతోషించ’వచ్చో చెప్పడం
1 అపాయకరమైన పరిస్థితులను సూచించించే బైబిలు ప్రవచనాలు నెరవేరుతున్న కాలంలో మనం జీవిస్తున్నాము. యౌవనస్థులతో సహా, అనేకులు ప్రశాంతమైన, శాంతియుతమైన జీవితాలను గడిపేందుకు వ్యాకులపరచే సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎలా ‘హృదయములో నుండి వ్యాకులమును తీసివేయవచ్చు, అపాయమును తొలగించవచ్చు’ అనే దానిపై బైబిలు ఇచ్చే సలహా నుండి వారు ప్రయోజనం పొందగలరు. (ప్రసం. 11:9, 10) మార్చి నెలలో యౌవనస్థులు అడుగు ప్రశ్నలు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని అందించడం ద్వారా ‘సంతోషంగా’ ఉండేందుకు వారికి సహాయపడే అవకాశం మనకుంది. దానిని అందించేటప్పుడు, యౌవనస్థులు మరియు మొత్తం మీద మానవులందరు ఎదుర్కుంటున్న సమస్యలు బైబిలులో ప్రవచించబడ్డవేనని, బైబిలు వాటికి పరిష్కారాలను చూపిస్తుందని మనం మనస్సులో ఉంచుకోవాలి. తర్వాత, మనమేం చెప్పగలం?
2 ఈ విధంగా చెప్పడం ఫలవంతంగా ఉండవచ్చు:
◼ “కుటుంబ అనైక్యత, విడాకులు, ఒంటరితనం, లైంగికంగా సంక్రమించే వ్యాధులు, మాదక ద్రవ్యం మరియు మద్యాల వలన వచ్చే సమస్యలు మరియు అనేక ఇతర సమస్యలు ఈ 20వ శతాబ్దంలోని యౌవనస్థులను పీడిస్తున్నాయి. ఈ సమస్యలకు ఏదైనా పరిష్కారముందని మీరు తలస్తారా? [జవాబివ్వనివ్వండి.] ఈ సమస్యలన్నీ బైబిలులో చెప్పబడ్డాయని తెలుసుకున్నప్పుడు అనేకులు ఆశ్చర్యపోయారు. ఉదాహరణకు, యేసు తన ప్రఖ్యాతిగాంచిన ప్రసంగాలలో ఒకదాని యందు స్నేహితులను చేసుకోవడం మరియు (స్నేహాన్ని) కాపాడుకోవడం అనే విషయంపై ఇచ్చిన బంగారు సూత్రాన్ని గూర్చి మీరు వినే ఉంటారు. [యౌవనస్థులు అడుగు ప్రశ్నలు అనే పుస్తకం తెరచి, 163వ పుట 1వ పేరాలోని బంగారు సూత్రాన్ని చదవండి.] కుటుంబంలోను మరియు ఇతరులతోను శాంతిని, ఐక్యతను కాపాడుకోవడానికి సహాయపడే మరో నియమం రోమా 12:17, 18లో ఇవ్వబడింది. [అదే పుటలోని 3వ పేరానుండి దీనిని చదవండి.] మీ దైనందిన జీవితాన్ని సాఫీగా మరియు సంతోషకరంగా చేసుకోవడానికి వీటిని, ఇతర సూత్రాలను ఎలా అన్వయించుకోవాలో నేర్చుకోవడానికి మీరు ఇష్టపడతారా?” పుట 8, 9లో ఉన్న విషయ సూచికలోని కొన్ని అంశాలను ఎత్తి చూపించిన తర్వాత పుస్తకాన్ని అందించండి.
3 బహుశ, ఈ ప్రశ్న ఆసక్తికరమైన చర్చకు నడిపించవచ్చు:
◼ “తమ సమస్యలను విజయవంతంగా ఎదుర్కోడానికి యౌవనస్థులకు సహాయపడేందుకు ఏదైనా చేయబడవచ్చని మీరు తలస్తారా? [జవాబివ్వనివ్వండి.] నేడు అకాడమీ విద్య విస్తృతంగా లభ్యమవుతుందని అనేకమంది ప్రజలకు తెలుసు. అయితే జీవం కొరకైన విద్యాభ్యాసమైన నైతిక విద్యాభ్యాసాన్ని గూర్చిన సంగతేమిటి? యౌవనస్థులు, పెద్దవారు మరింత శ్రేష్ఠమైన, సంతోషకరమైన జీవితాలను గడపడానికి వారికి సహాయపడే సలహాల కొరకు నమ్మదగిన మూలం ఏదైనా ఉందా?” యెషయా 48:17, 18 చదివి, యౌవనస్థులు అడుగు ప్రశ్నలు అనే పుస్తకమందలి 6వ పుటలోని 2వ పేరానందలి రెండవ అర్థభాగంపై వ్యాఖ్యానం చేయండి. ఈ పుస్తకంలో ఇవ్వబడిన బైబిలు ఆధారిత సలహా నుండి గృహస్థుడు వ్యక్తిగతంగా ఎలా ప్రయోజనం పొందగలడో వివరించండి.
4 మీరు ఈ విధంగా చెప్పడానికి ఇష్టపడవచ్చు:
◼ “అనేక మంది యౌవనస్థులు తమ భవిష్యత్తును గూర్చి నిరాశచెందుతున్నారు, అలాగే వారి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల క్షేమాన్ని గూర్చి వ్యాకులపడుతున్నారు. యౌవనస్థులు అడుగు ప్రశ్నలు—ఆచరణయోగ్యమైన సమాధానాలు అనే ఈ పుస్తకం యౌవనస్థులు ఇప్పుడు సంతృప్తికరమైన, అర్థవంతమైన జీవితాలను గడపడాన్ని సాధ్యం చేస్తుంది, అలాగే భవిష్యత్తు కొరకైన మంచి నిరీక్షణను వారికి అందజేస్తుంది.” ముప్పై ఎనిమిదవ అధ్యాయంతో సహా, కొన్ని అధ్యాయాల శీర్షికలను చూపించండి, తర్వాత 306వ పుట తెరచి భవిష్యత్తు కొరకైన యెహోవా సంకల్పాన్ని గూర్చి పేర్కొనండి. ఒక ప్రతిని తీసుకోడానికి గృహస్థుని ఆహ్వానించండి, అందరికీ ప్రయోజనాలను తెస్తూ నేడు యౌవనస్థులు ఎదుర్కొనే అనేక సమస్యలను చక్కబెట్టుకోవడానికి సహాయం చేసే దాని ఆచరణాత్మక సమాచారాన్ని కుటుంబంలో ఎలా చదివి చర్చించవచ్చో చూపించండి.
5 దేవుని వాక్యంలో ఉన్న ఉపదేశం మానవ జాతికంతటికీ ఆచరణయోగ్యమైనది. కాబట్టి అందరూ బైబిలు మాటలను వినవలసిన అవసరముంది. సంతోషించడానికి గల ఈ మూలాధారాన్ని గూర్చి యౌవనస్థులకు మరియు అందరికి చెప్పడానికి మనం చేయగలిగినదంతా చేద్దాం.