సువార్తనందించుట—పత్రికలతో
1 చరిత్రలో ఏ ఇతర పత్రికలును ది వాచ్‌టవర్ మరియు అవేక్!లవలె మంచినిమిత్తమై ప్రజల జీవితములపైన ప్రభావమును కలిగిలేవు. ప్రతిసంచిక పూర్తిగా జీవమిచ్చు ఆత్మీయాహారముతో నిండియున్నది. బలమైన లేఖనాధారము, లోతైన పరిశోధన మూలంగా అందింపబడిన సత్యవర్తమానము మన మనస్సులు మరియు హృదయములపైన ముద్రను వేయుచున్నది.
2 ది వాచ్‌టవర్ దాని పేజీల ద్వారా బైబిలు బోధనలను వివరిస్తూ, బైబిలు ప్రవచనముల నెరవేర్పుపైకి మన అవధానమును మలుపుచున్నది. ఆత్మీయముగా ఆకలిగొనిన వారందరిని తమ మనస్సు మార్చుకొని నూతన స్వభావమును ధరించుకొనమని ప్రోత్సహించుచున్నది. (రోమీ. 12:2; ఎఫె. 4:22-24) అవేక్! గుర్తింపదగిన లోక సంఘటనలను గూర్చి దాని చదువరులను జాగ్రత్తపరచుచున్నది. సృష్టిలోని అద్భుతములను వర్ణించు దాని దృశ్యములు నూతనలోకముపైన ఆసక్తిని పెంచి ప్రేమగల సృష్టికర్తపై మన మెప్పును అధికము చేయుచున్నవి.
లౌకిక పత్రికలవలె కాదు
3 లౌకిక పత్రికలు ఈ లోకములో తృప్తికరమైన జీవితములను ఎలా అనుభవించవలెనో ప్రజలకు చూపవు. భవిష్యత్తును గూర్చి అవి యే నిరీక్షణయైనను అందివ్వక నిత్యజీవమును పొందు విధానమును బోధించుటలో తప్పిపోవుచున్నవి. అట్టి లౌకిక పత్రికలు లోకసంబంధమగు వాటిని పురికొల్పుటకు తయారు చేయబడియున్నవి. వాచ్‌టవర్ మరియు అవేక్!లకు ఎంతటి వ్యత్యాసమును కలిగియున్నవి!—1 యోహా. 2:15-17.
4 నిస్సందేహముగా నీ మట్టుకు నీవే “నమ్మకమైన గృహ నిర్వాహకుడి” నుండి వస్తూ సత్యముయొక్క యింపైన సువాసనను కలిగియున్న వాచ్‌టవర్ మరియు అవేక్! యొక్క ప్రతిసంచిక యెడల లోతైన కృతజ్ఞతా భావమును కలిగియుందువు. (లూకా 12:42) పత్రికల అందింపును అధికము చేసి అనేకులు మన పత్రికలనుండి ప్రయోజనము పొందునట్లు మనమేమి చేయగలము?
మన భాగమును చేయుట
5 తగినరీతిలో యథార్థహృదయులను మన పత్రికలను చదవమని ప్రోత్సహించుటకు ముందు ప్రతి సంచిక ఏమి కలిగియున్నదో మనము తెలుసుకొనవలసియున్నాము. దీనికొరకు పరిచర్యలో దానిని ఉపయోగించుటకు ముందు ప్రతిసంచికను చదువవలెను. అందలి విషయములతో బాగుగా పరిచయము కలిగినవారమై ఇంటింటి పరిచర్యలోను, వీధిసాక్ష్యములోను, తటస్థసాక్ష్యములోను పత్రికలను పంచవచ్చును.
6 అంతేగాక ప్రస్తుత పత్రికలను దుకాణమునకు వెళ్లునప్పుడు, ప్రజారవాణాలలో ప్రయాణించునప్పుడు, పాఠశాల యొద్ద, మన ఉద్యోగస్థలమందు, లేక మనమెక్కడకైన వెళ్లినప్పుడు మనయొద్ద కలిగియుండుట ద్వారా సాక్ష్యమిచ్చు అవకాశములను విడిచిపెట్టకుండా ఉండగలుగుదుము. శీర్షికలలోని ఒక అంశముతోపాటు, రీజనింగ్ పుస్తకమునుండి బాగుగా ఎన్నుకొనబడిన ఒక ఉపోద్ఘాతమును జతపరచిన మన పత్రికలను చదువుటకు వ్యక్తియొక్క కోరికను ఉత్తేజపరచవచ్చును.
7 పత్రికలను అందించునప్పుడు మన సంభాషణలు క్లుప్తముగా ఉన్నను, మన చర్చను కేవలము ఒక నిముషమునకు లేక ఆ మాత్రమునకే పరిమితము చేయనవసరములేదు. ఒక వ్యక్తి నిజముగా వర్తమానము నందు ఆసక్తి కలిగియున్నాడా, తాను పత్రికను చదువుతాడా అని నిర్ణయించుకొనేంతవరకు మనము సమయమును తీసుకొనగోరుదుము. ఒకవేళ ప్రశ్న ఉత్పన్నమైన బైబిలును, లేక రీజనింగ్ పుస్తకమును పూర్తిగా ఉపయోగిస్తు అడిగినవాటికి సమాధానము చెప్పుటకు మనమెల్లప్పుడు ప్రయత్నించవలెను. మన విశ్వాసమును సమర్థించుటకు సిద్ధంగా యుండుట ద్వారా అద్భుతమైన దీవెనలను కోయుదుము.—1 పేతు. 3:15.
8 ఒకవేళ వ్యక్తి పత్రికలను చదువుటకు అంగీకరించినట్లయిన మన పనియొక్క స్వభావమును గూర్చి చర్చించి, ప్రపంచవ్యాప్తమైన బైబిలు విద్యాకార్యక్రమములో భాగముగా ఈ పత్రికలు నెలకు రెండుసార్లు ఎట్లు ప్రచురించబడుచున్నవో మాట్లాడవచ్చును. తదుపరి సంచికలోని విషయములు ఎల్లప్పుడు ప్రచురించబడుచున్నవి గనుక వాటికి సంబంధించిన ప్రశ్నలకు ఎదురుచూడమని, లేక రాబోవు శీర్షికలయెడల అవధానమును మలపవచ్చును. ఇది వ్యక్తియొక్క ఆశను తృప్తిపరచి ఆ సంచిక వెలువడినప్పుడు దానిని పొందాలనే కోరికను తెలియజేయుటకు నడుపవచ్చును. ఇది పత్రికామార్గమునకు ప్రారంభము కాగలదు.
9 ఈ యుగాంతము సమీపించుండగా యథార్థహృదయులైనవారు మహాబబులోనునుండి తప్పించుకొని వచ్చుటకు మనము చేయు సహాయమును ఎక్కువ చేయుదము గాక. (ప్రక. 18:4) ప్రపంచవ్యాప్తమైన మన బైబిలు విద్యాకార్యక్రమములో వాచ్‌టవర్ మరియు అవేక్! శక్తివంతమైన పాత్రను నిర్వహించుచున్నవి. పరిచర్యలో ఉపయోగించుటకు యెహోవా మనకు వాటిని అనుగ్రహించినందుకు మనము కృతజ్ఞులమైయున్నాము. మనము శ్రద్ధతో మరియు తీవ్రతరముగా ఈ పత్రికలను ఉపయోగించుటను దీవించుటలో యెహోవా కొనసాగును గాక!