మన స్వంత బాధ్యతా భారమును మోయుట
1 బాధ్యత అనే తలంపు ఈనాడు ప్రజలపై భారము మోపుచున్నట్టుగా కన్పించుచున్నది. అనేకమంది తప్పుకొనుట ప్రయత్నింతురు. తత్ఫలితముగా భర్తలు భార్యలను పరిత్యజించుట, తల్లులు పిల్లలను విడిచిపెట్టుట, యౌవనులు పాఠశాల మానుకొనుట, పౌరులు పన్నులు ఎగవేయుట జరుగుచున్నది. ఇలా బాధ్యతారహిత క్రియల పట్టికకు అంతుండదు. బాధ్యతగల వ్యక్తియనగా, అతడు నమ్మకస్థుడు, ఇష్టపడువాడు మరియు తన ప్రవర్తనకు జవాబు చెప్పగలవాడై యుండును. కావున, క్రైస్తవుడైన “ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలెను” అని దేవుని వాక్యము స్పష్టముగా చెప్పుచున్నది. (గల. 6:5) అందువలన 1992 సేవా సంవత్సరము కొరకైన ప్రాంతీయ సమావేశముల మూలాంశము. “మన స్వంత బాధ్యతా భారమును మోయుట” ఎంత సరియైనదిగా యున్నది! ఈ సమావేశములు 1992 జనవరినుండి ఆరంభమగును. హాజరగుటకు మనమందరము ఖచ్చితముగా పథకము వేసికొనవలెను.
2 ప్రసంగములు, స్కిట్స్, ప్రదర్శనలు, అనుభవములు, పరిచయములద్వారా, ఈ చక్కని ప్రాంతీయ సమావేశ కార్యక్రమము క్రైస్తవులుగా మనమందరము కలిగియున్న వివిధ బాధ్యతలను స్పష్టముగా వివరించును. శనివారము మధ్యాహ్నము, మనమందరము ఆనందముతో మన బాధ్యతలను ఎట్లు నిర్వర్తించగలమో వివరించు నాలుగు భాగములుగల గోష్టి ఒకటి ఉండును. మన యౌవనస్థులు కలిగియుండవలసిన బాధ్యతయొకటి కలదు. శనివారము మధ్యాహ్నము ప్రాంతీయకాపరిద్వారా ఇవ్వబడు ప్రసంగము ప్రత్యేకముగా వారికి ఉద్దేశించబడి యుండును. క్రొత్తగా సమర్పించుకొనిన వారు బాప్తిస్మము తీసికొను అవకాశముకూడ శనివారముండును. ప్రాంతీయ సమావేశములో బాప్తిస్మము తీసికొనుటకు పథకము వేసికొను వారందరు సంఘ అధ్యక్షునికి చాలాముందే తెలియజేయవలెను అలా దీని కొరకు తగిన ఏర్పాట్లు చేయుటకు వీలగును.
3 ఆదివారము ఉదయము ప్రకటించు క్రైస్తవ బాధ్యతమీద దృష్టినిల్పు మరొక నాలుగు భాగముల గోష్టి ఉండును. ఆ పిమ్మట, ఆదివారము మధ్యాహ్నము, జిల్లాకాపరిచే “దేవునియొక్క నూతన లోకము—ప్రవేశించుటకు ఎవరు అర్హులగుదురు?” అను మూలాంశముగల బహిరంగ ప్రసంగము ఇవ్వబడును. ఈ ప్రసంగమును వినుటకు ఆసక్తిగల వారందరిని ఆహ్వానించుటకు సిద్ధముగా ఉండుము.
4 హాజరగుటకు మరియు అద్భుతకరమైన ఈ రెండు దినముల కార్యక్రమమునుండి పూర్తిగా ప్రయోజనము పొందుటకు మనమందరము మన వ్యవహారములను తగిన రీతిలో ఏర్పాటు చేసికొనుటకు కోరుకొందుము. మీ సంఘము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రాంతము మరియు తేదీలను మీ ప్రాంతీయ కాపరి మీకు తెలియజేయును.