క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం
1 1996 మార్చిలో ప్రారంభమౌతున్న ప్రాంతీయ సమావేశాల అంశం “దేవుని వాక్యాన్ని అనుసరించేందుకు విని నేర్చుకోండి.” ద్వితీయోపదేశకాండము 31:12, 13 పై ఆధారపడిన ఈ అంశం, మనం నేర్చుకుని అన్వయించుకోవల్సిన పాఠాల ఉన్నతాంశాల పూర్తి కార్యక్రమం కొరకు సరైన ఆధారాన్ని అందిస్తుంది.
2 నేడు అనేకమంది ప్రజలు తప్పుదోవపట్టించే ప్రేరణాత్మకమైన మాటలను వింటున్నప్పటికీ, దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరించేందుకు నేర్చుకోవల్సిన అవసరం మనలో ప్రతిఒక్కరికీ ఉంది. (లూకా 11:28; 1 తిమో. 4:1) దీన్ని మనస్సులో ఉంచుకునే, ప్రచారకులకూ కుటుంబాలకూ, పెద్దలకు మరియు పయినీర్లకూ ప్రోత్సాహాన్నీ సహాయాన్నీ అందించేందుకే ప్రాంతీయ సమావేశ కార్యక్రమం రూపొందించబడింది. శనివారం నాడు, “దేవుని వాక్యమందు శ్రద్ధ నిలపడం ద్వారా మన సమస్యలను ఎదుర్కోవడం” అన్న విషయంపై నాలుగు భాగాల గోష్ఠి ఉంటుంది. మరి ఆదివారం ఉదయం “లేఖనాలు నీతియందు ఎలా శిక్షణనిస్తాయి” అన్న విషయంపై ఓ గోష్ఠి ఉంటుంది. మీరూ మీ కుటుంబమూ తప్పకుండా పొందాల్సిన ఆత్మీయ ప్రోత్సాహాన్ని ఈ కార్యక్రమమంతా అందిస్తుంది.
3 శనివారం మరియు ఆదివారం రెండు రోజులూ ప్రాంతీయ పరిచర్యకొరకు కొన్ని ఆచరణాత్మకమైన సలహాలు అందించబడతాయి మరియు ప్రదర్శించబడతాయి. ప్రోత్సాహకరమైన మరియు ఉపదేశాత్మకమైన అనుభవాలూ పరిచయాలూ కూడా అందించబడతాయి. ఆ విధంగా, మీరు నేర్చుకునే వాటిని ఆచరణలో పెట్టాలన్న దృష్టితో మీరు హాజరై విన్నట్లైతే, దేవుని వాక్యంలోని ఆజ్ఞలను చక్కగా సంపూర్ణంగా అనుసరించగల్గుతారు.
4 క్రొత్తగా సమర్పించుకున్న సహోదర సహోదరీల బాప్తిస్మం, ఈ ప్రాంతీయ సమావేశంలోని ముఖ్యాంశాల్లో ఒకటి. తమ సమర్పణను బహిరంగంగా ప్రకటించకముందు పెద్దలు వారితో చర్చించేలా సంఘాధ్యక్షుడు ఏర్పాటుచేయగలిగేలా, బాప్తిస్మం తీసుకోవాలన్న తమ కోరికను ఆ అభ్యర్థులు ఆయనతో చెప్పాలి.
5 ఈ ప్రాంతీయ సమావేశాల బహిరంగ ప్రసంగ ముఖ్యాంశం, “బైబిలు ద్వారా ఎందుకు నడిపించబడాలి?” ఆసక్తిగలవారిని హాజరయ్యేందుకు ఆహ్వానించండి. మీరూ మీ కుటుంబమూ పొందబోయే ఎంతో ఆవశ్యకమైన ప్రోత్సాహాన్ని మరియు సహాయాన్ని అపేక్షిస్తూ, కార్యక్రమమంతటికీ హాజరయ్యేందుకు సరైన పథకాలను వేసుకోండి.